Hin

28th-oct-2023-soul-sustenance-telugu

October 28, 2023

మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 2)

  1. మంచి కర్మలు మరియు చెడు కర్మలు అనేవి జీవితమనే నాణానికి ఉన్న రెండు వైపుల వంటివి. మన కర్మలు ఎంత సానుకూలంగా మరియు చక్కగా ఉంటాయో అంత ఎక్కువగా మన జీవితం తేలికగా, సంతోషంగా సాగిపోతుంది. చాలావరకు, ఎవరైతే అసంతోషాన్ని, అసంతృప్తిని పొందుతున్నారో వారు గతంలో చెడు కర్మలు చేసి ఉండవచ్చు, అది ఈ జీవితం కావచ్చు లేక గత జీవితం కావచ్చు. వర్తమానంలో ఎంత ఎక్కువ సత్కర్మలు చేస్తే అంత ఎక్కవుగా ఈ విశ్వంలోకి మంచిని ప్రసరింపజేసేందుకు నిమిత్తమవ్వగలము. ఇదే భగవంతుడు మనకిచ్చిన నిజ ధర్మము, బాధ్యత. నేను నా కోసమే జీవిస్తున్నానా లేక, మంచిగా ఉండు-మంచిని పంచు, సానుకూలంగా ఉండు- సానుకూలతను పంచు అన్న కార్యాన్ని నెరవేరుస్తున్నానా? ఇలా మనల్ని మనమే ప్రశ్నించుకోవటం ముఖ్యం. మంచితనము దాగి ఉండదు, మంచితనాన్ని అందరికీ పంచాలి. సత్కర్మలు చేయడం వలన కలిగే లాభం ఇది. చెడు కర్మలు చేస్తే భగవంతుని దృష్టిలో, మన దృష్టిలో, సమాజం దృష్టిలో మనం గౌరవాన్ని కోల్పోతాము. ఎందుకంటే ఇతరులను మంచి వైపుకు కాక చెడు వైపుకు ప్రేరేపిస్తున్నాము కనుక.
  2. సత్కర్మలే నిజమైన విశ్వ కర్మలు. ప్రపంచం వయసు ఎక్కువ అయింది. కామము, క్రోధము, మోహము, లోభము, అహంకారము, ఈర్ష్య, ద్వేషము, పగ మరియు ఇతర ప్రతికూల భావోద్వేగాలు అనే మాధ్యమాల ద్వారా ప్రతికూలత ఎక్కువయింది. నిజమైన సత్ పురుషులు మరియు స్త్రీలు ఈ నెగిటివ్ భావోద్వేగాల ప్రభావంలో లేరు. అందుకే, భగవంతుడు మనిషిని తన ప్రతిరూపంగా తయారు చేసాడు అంటారు. ఈ విశ్వంలోని మంచితనము భగవంతుని స్వభావానికి తార్కాణం. నేటి ప్రతికూలత అసురతత్వానికి (రావణుడికి) ప్రతీక, అసురుడు లేక రావణుడు మనలో ఉన్న బలహీనతలకు గుర్తు.

 

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

8th feb 2025 soul sustenance telugu

ఇతరులకు నిరంతరం ఇస్తూ ఉండండి (పార్ట్ 1) 

ఎమోషనల్ ఓదార్పు మరియు శక్తిని ఇవ్వడం   మన జీవితమంతా మనకు తెలిసిన వ్యక్తులకు మరియు మనకు తెలియని వ్యక్తులకు కూడా సేవ చేస్తాము. ఎందుకంటే ఇవ్వడం, సేవ చేయడం మన సహజ లక్షణాలు.

Read More »
7th feb 2025 soul sustenance telugu

అంతర్గత శాంతి మరియు ఆనందం కోసం ఇంట్లో ఒక పవిత్ర స్థలాన్ని ఏర్పాటు చేసుకోవటం

ధ్యానం కోసం ఇంట్లో ప్రత్యేకమైన, ఉన్నతమైన తరంగాల గది లేదా చోటును ఏర్పర్చుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. మనము అంతర్గత శాంతి, ఆనందం కోసం ఉన్నత ఆధ్యాత్మిక శక్తి గల ప్రదేశాలకు వెళ్తాము. మనం మానసికంగా

Read More »
6th feb 2025 soul sustenance telugu

మనం స్వీయ నియంత్రణను ఎందుకు కోల్పోతున్నాము?

మనం ఎందుకు, ఎలా స్వీయ నియంత్రణను కోల్పోతామో అన్వేషిద్దాం. గాలిలోని కాలుష్య కారకాల గురించి మనకు తెలుసు, కానీ మరొక సూక్ష్మమైన మరియు కీలకమైన భాగం ఉంది, దానిని మనం చూడలేము కాని మనం

Read More »