Hin

29th-oct-2023-soul-sustenance-telugu

October 29, 2023

మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 3)

  1. మంచి కర్మలు మరియు చెడు కర్మలు రెండూ ఈ సమాజంలో ఉన్నాయి. మన జీవితంలో అనేక కర్మలు చేస్తూ ఉంటాము, ఎప్పుడైనా క్షణం ఆగి, నేను చేసే ఎన్ని కర్మలు మంచివి, ఎన్ని చెడువి అని ఆలోచించారా? ఇలా ఆలోచించడం అవసరం. ఉదాహరణకు, ఈరోజు మీరు మీ ఆఫీసుకు వెళ్ళారు, అక్కడ మీరు ఎంతోమందితో మీ కార్యక్షేత్రంలో కలిసారు. కలిసిన ప్రతి ఒక్కరికీ, ఆలోచనల స్థాయిలో, భావాల స్థాయిలో, మాటలు మరియు కర్మల స్థాయిలో మీరు ఏదో ఒకటి పంచుతారు. కొందరితో మీరు ఎక్కువ సుగుణాలను పంచుకొని ఉండవచ్చు, కొందరితో తటస్థంగా ఉండవచ్చు, మరి కొందరితో మీరు ప్రతికూలంగా ఉండవచ్చు. ఈ సమయంలో, ప్రతిరోజూ మీ కర్మలను పరిశీలించుకుంటూ భవిష్యత్తు కోసం సవరించుకుంటున్నారా? మొదటగా, మంచి చెడుల జ్ఞానం ఉండటం ముఖ్యం. తర్వాత ఆ జ్ఞానం ఆధారంగా మీ కర్మలు రూపుదిద్దుకుంటాయి. ఇది మనం ప్రతిరోజూ చేయవలసిన హోమ్‌వర్కు ఎందుకంటే మనమందరమూ మన జీవితంలో విద్యార్థులమే, మనకు మనమే టీచరు.
  2. మనమంతా ఆత్మిక బాటసారులం. ఈరోజు మనం చేసే ప్రతి సంస్కారాన్ని రాబోయే జన్మలకు, భవిష్యత్తులోకి తీసుకువెళ్తున్నాం. చేసిన చెడు కర్మలు, చెడు సంస్కారాల ఫలితం అనే బరువైన లగేజీతో ప్రయాణించాలా లేక సత్కర్మలను చేసి వాటి ద్వారా పొందిన ఆశీర్వాదాలు అనే తేలికైన లగేజీతో ప్రయాణించాలా? మన బంధాలను, మన భౌతిక శరీరాన్ని, మన సంపదను, మనం పోషించే పాత్రలను కూడా మనం మన మరుసటి జన్మకు తీసుకువెళ్ళలేము. ఒకసారి ఈ భౌతిక శరీరాన్ని విడిచిపెడితే ఇవన్నీ మారిపోతాయి. మనం చేసే కర్మల ఆధారంగా మనం నింపుకున్న సంస్కారాలే మనతో వస్తాయి. మంచి కర్మలు మనల్ని మంచి సంస్కారాలతో నింపుతాయి, చెడు కర్మలు చెడు సంస్కారాలతో నింపుతాయి. మన సంస్కారాలు మంచివిగా, దివ్యంగా ఉంటే మరుజన్మలో మనకు ఆరోగ్యకరమైన శరీరం, చక్కని బంధాలు, ఎనలేని సంపద మరియు పోషించడానికి చక్కని పాత్రలు లభిస్తాయి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

26th april 2025 soul sustenance telugu

మనకు మనమే ఎమోషనల్ డిటాక్స్ చేసుకోవాలి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు ప్రతి కొన్ని నిమిషాలకు వివిధ మీడియా నుండి వచ్చే సందేశాలను చదవడానికి మీ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌ని చెక్ చేసే అలవాటు

Read More »
25th april 2025 soul sustenance telugu

సంతుష్టత – ధారణ చేసి రేడియేట్ చేయండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన సంతుష్టతని మరియు మన కోరికలను సమతుల్యం చేసుకోవడమే మనం నేర్చుకోవలసిన జీవిత-నైపుణ్యం. నా జీవితంలో అన్ని మెరుగుదలలు చేసిన తర్వాత,

Read More »
24th april 2025 soul sustenance telugu

వెళ్ళిపోయిన ప్రియమైన వ్యక్తికి శాంతిని, ప్రేమను ప్రసరింపజేయండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో ప్రతి ఒక్కరూ కూడా వేరు వేరు జన్మల ప్రయాణంలో ఉన్నారు, అలాగే మన చుట్టూ ఉన్న ఆత్మలు కూడా. బంధువు,

Read More »