Hin

29th august 2024 soul sustenance telugu

August 29, 2024

మీ లక్ష్యాలను సాధించడానికి విజువలైజేషన్ను ఉపయోగించడం

ప్రముఖ అంతర్జాతీయ పోటీలలో గెలిచిన ఎక్కువ మంది క్రీడాకారులు విజయం సాధించడానికి విజువలైజేషన్ అనే సాధనాన్ని ఉపయోగించే శిక్షణ పొందారని ఒక పరిశీలనలో తేలింది. అసలు పోటీ  కంటే చాలా నెలల ముందు, వారు లక్ష్యాన్ని సాధించిన చిత్రాలను వారి మనసులో విజువలైజ్ చేసుకుంటారు. క్యాన్సర్ తో సహా ప్రధాన అనారోగ్యాల నుండి రోగులను నయం చేయడానికి కూడా విజువలైజేషన్ యొక్క అదే సూత్రం ఉపయోగించబడుతుంది. రోగులకు వారి వ్యాధిగ్రస్తమైన అవయవాలను అనారోగ్యాలు లేనట్లుగా విజువలైజ్ చేయడం లేదా ఏదో ఒక రూపంలో వైద్యం చేసే శక్తిని పొందుతున్న అవయవాలను విజువలైజ్ చేయడం నేర్పుతారు. తాము కోరుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని 100% నమ్మకం కలిగి ఉండటానికి విజువలైజేషన్ అందరికీ సహాయపడుతుంది. ఈ శక్తివంతమైన విశ్వాస శక్తితో ప్రయత్నాలు చేసిన వారి విజయానికి ఎక్కువ సంభావ్యత కలిగి ఉంటుంది. మీరు చేస్తున్న పని మీద విశ్వాసం లేకుండా, మీ లక్ష్యాలను సాధించినట్లు మిమ్మల్ని మీరు విజువలైజ్ చేసుకోకుండా మీరు ప్రయత్నాలు చేసినప్పుడు విజయం యొక్క సంభావ్యత అంతగా ఉండదు.

మీరు గతంలోని మీ వైఫల్యాల గురించి ఆలోచిస్తే, మిమ్మల్ని మీరు నమ్మడం మానేసి, మీ ఉత్సాహాన్ని కోల్పోయి, విసుగు చెందుతారు. గత వైఫల్యాలు మీపై ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని చూపకుండా, సానుకూల భవిష్యత్తు యొక్క చిత్రాలను విజువలైజ్ చేయడం, వర్తమానం నుండి భవిష్యత్తు వైపు పనిచేయడానికి మీకు సహాయపడుతుంది. భయాలను, ప్రతికూల అలవాట్లను అధిగమించిన వ్యక్తిలా, భయాలు తొలగిపోయి, ప్రతికూల అలవాట్లు మారిపోయాయని మీకు మీరు విజువలైజ్ చేసుకోండి. మిమ్ముల్ని మీరు పర్రివర్తన అయినట్లుగా చూసుకోండి. ఉదా – నేను అన్ని శక్తులతో నిండిన ఆత్మ అని చెప్పుకోండి. అంతేకానీ, నన్ను నేను అన్ని శక్తులతో నింపుకుంటానని లేదా నన్ను నేను నింపుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అని కాదు. ఆ విజన్ యొక్క శక్తి, సానుకూల ధృవీకరణలు కలిసి, మీలో ఒక పెద్ద మార్పును తీసుకురావడానికి మీకు సహాయపడతాయి, కేవలం ఒక చిన్న మార్పు కాదు. ఎందుకంటే మీరు నిద్రపోతున్న మీ ఉప-చేతన మనస్సుకు, మేల్కొని దాని సామర్థ్యాన్ని గ్రహించటానికి సులభతరం చేస్తారు. మీరు ఎల్లప్పుడూ ఘోరమైన దానిని ఊహించడం మానేసి, ఉత్తమమైనదాన్ని విజువలైజ్ చేస్తారు, నమ్ముతారు. ఇది మిమ్మల్ని ప్రతి దశలో విజయవంతం చేస్తుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

28th march 2025 soul sustenance telugu

సోషల్ మీడియా లైక్‌లు ముఖ్యమా?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఆధారిత సమాజంలో, మనం పోస్ట్ చేసే దానిపై ప్రజల ఆమోదం పొందడం మన స్వీయ-విలువ మరియు కీర్తికి కొలమానంగా

Read More »
27th march 2025 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు

Read More »
26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »