Hin

15th october 2024 soul sustenance telugu

October 15, 2024

మీ మనస్సును ఎల్లప్పుడూ తేలికగా మరియు శక్తివంతంగా ఉంచుకోండి

మన మనస్సులను అనవసరమైన ఆలోచనలతో నింపుకోవడం మానసిక అలసటకు దారితీసింది. మీ మనస్సు గతంలో లేదా భవిష్యత్తులో ఉంటుందా? ఇతరులను సంతోషపెట్టడానికి ఒత్తిడికి గురి అవుతుందా?ఎవరినైనా గుర్తు చేసుకుంటూ ఉంటుందా ? లేదా విశ్రాంతి లేకుండా ఉంటుందా? ఈ అలవాట్లు మానసిక అలసటకు కారణమవుతాయి.

  1. దృఢమైన, సహజమైన, ప్రతి సన్నివేశంలోని పరిష్కారాలపై దృష్టి కేంద్రీకరించే స్థిరమైన మనస్సును కలిగి ఉండటానికి ప్రతి ఉదయం ధ్యానం చేసి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అధ్యయనం చేయండి. మీ రోజును క్రమబద్ధీకరించుకోండి, టైమెలైన్లను నిర్దేశించుకొని ఆ ప్లాన్ కు కట్టుబడి ఉండడంతో మీ శక్తి క్రమబద్ధంగా ఉంటుంది.
  2. జీవనశైలి క్రమశిక్షణలను(లైఫ్ స్టైల్ డిసిప్లిన్) అనుసరించండి – వేకువ జామునే మేల్కోండి, ధ్యానం చేయండి, వ్యాయామం చేయండి, నిర్ణీత భోజన సమయాలను అనుసరిస్తూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని శ్రద్దగా తినండి. రోజులో 3 నుండి 4 గంటలు కుటుంబంతో గడపండి. నిద్రపోవడానికి కనీసం ఒక గంట ముందు టెక్నాలజీ, పనికి సంబందించిన కమ్యూనికేషన్ నుండి దూరమవ్వండి. త్వరగా పడుకోండి.
  3. మీ దృక్పథాలు భిన్నంగా ఉంటాయని గుర్తుంచుకుంటూ వ్యక్తులతో కలిసి ఉండండి, కలిసి పనిచేయండి. మీ అభిప్రాయాన్ని గౌరవంగా నొక్కి చెప్పండి. వాదనలు, విభేదాలు, పనిలేని మాటలు మరియు తీర్పుల నుండి వైదొలగండి. వ్యక్తులను క్షమించండి. శాంతి, ఆనందం మరియు ప్రేమ యొక్క మీ వ్యక్తిత్వంతో ప్రతిస్పందించండి.
  4. మీ మనస్సును శుభ్రపరచడానికి, దానికి ఏవైనా ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి మరియు విషపూరిత భావాలను తొలగించడానికి ప్రతి గంట తర్వాత 1 నిమిషం విరామం తీసుకోండి. మీరు ఉదయం చేసిన ధృవీకరణను రివైజ్ చేసుకొని ఈ ఒక నిమిషంలో దానిని విజువలైజ్ చేయవచ్చు. ఇది మీ మనస్సును తేలికగా మరియు తదుపరి 59 నిమిషాలు శక్తివంతంగా ఉంచుతుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

[drts-directory-search directory="bk_locations" size="lg" style="padding:15px; background-color:rgba(0,0,0,0.15); border-radius:4px;"]

రికార్డు

16th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మెడిటేషన్ ని మీ ఔషధంగా చేసుకొని ఆ ఔషధాన్ని ప్రతి రోజు తీసుకోండి మెడిటేషన్ మన మనస్సును మరింత శక్తివంతంగా చేసి

Read More »
15th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు రోజంతా మీ ఆలోచనలను జాగ్రత్తగా పరిశీలించుకోండి   మన భావోద్వేగ ఆరోగ్యం అనేది ముఖ్యంగా మన ఆధ్యాత్మిక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది.

Read More »
14th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం మానవాత్మలం అనగా మొదట ఆత్మలం, ఇది మన ఆధ్యాత్మిక గుర్తింపు. మనం మన భౌతిక శరీరం ద్వారా మన పాత్రను

Read More »