Hin

22nd june2024 soul sustenance telugu

June 22, 2024

మీ మనస్సు ఒక బిడ్డ వంటిది

మనస్సు మన బిడ్డలాంటిది. మనం మన బాధ్యతలను నిర్వర్తిస్తున్నప్పటికీ, మీలో ఉన్న ఈ బిడ్డ  శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలి. మనం దానిని ప్రేమించాలి, పాలన చేయాలి మరియు ఓదార్చాలి. మనుష్యులు తమ మనస్సుపై నియంత్రణ కోల్పోయారని నమ్మి స్వయాన్ని శక్తివంతంగా భావించడానికి ఇతరుల మనస్సులను నియంత్రించాలని కోరుకుంటారు. మన నియంత్రణలో మన మనస్సు మాత్రమే ఉంటుంది. కొంచెం శ్రద్ధ మరియు ప్రేమ ఈ అంతర్గత బిడ్డను క్రమశిక్షణలో పెడుతుంది.

  1. మీ పిల్లలతో మీరు ఎల్లప్పుడూ ఉన్నట్లే, మీ మనస్సుతో కనెక్ట్ అయ్యి అడుగడుగునా మార్గనిర్దేశం చేయండి. ఇంటి పని, కుటుంబం, వృత్తి మరియు ఆరోగ్యం వంటి బాధ్యతలను నిర్వర్తిస్తున్నప్పటికీ, మీ ఆంతరిక బిడ్డ పై ప్రాధాన్యత ఉండాలి.
  2. ఎలా ఆలోచించాలో లేదా ఎంత ఆలోచించాలో నేర్పించనందున ఈ అంతర్గత బిడ్డ మీ నియంత్రణలో ఉండకపోవచ్చు. ప్రతిరోజూ ఆధ్యాత్మిక సందేశాలను చదవండి, ధ్యానం చేయండి, సరైన ఆలోచనలను సృష్టించడానికి మనస్సుకు అది మూలం అవుతుంది.
  3. మీ బాధ్యతలను చూసుకుంటున్నప్పుడు, పిల్లవాడు ఏడుపు ప్రారంభించవచ్చు – అంటే మనస్సు చిరాకుగా, కోపంగా, అసూయగా, భయపడుతూ లేదా బాధగా ఉండవచ్చు. పిల్లవాడిని నిశ్శబ్దం చేయడానికి మీరు చేస్తున్న పనుల నుండి ఒక్క నిమిషం తప్పుకోండి. ఇతరులు మీకు అనుకూలంగా లేనప్పుడు శక్తివంతంగా ఉండేందుకు, గతాన్ని మరచిపోయి అందరి గురించి మంచిగా ఆలోచించడం మీ మనస్సుకు నేర్పండి.
  4. బలవంతంగా లేదా కఠినంగా కాకుండా ప్రేమతో ఈ బిడ్డను క్రమశిక్షణలో పెట్టండి. మీరు మీ మనస్సును అర్థం చేసుకున్నప్పుడు, ఇతరులను అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. ఇతరులతో వ్యవహరిస్తున్నప్పుడు, మీరు వారిలోని ఆంతరిక బిడ్డ తో వ్యవహరిస్తున్నట్లు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

17th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 5)

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు భారతదేశంలోని వివిధ నగరాలు, పట్టణాలు మరియు గ్రామాలలోని అన్ని బ్రహ్మా కుమారీల కేంద్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా 120 కి పైగా దేశాలలో ఉన్న కేంద్రాలలో నిర్వహించబడుతుంది. ఈ

Read More »
16th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 4)

ప్రపంచ నాటకం యొక్క తదుపరి 2 యుగాలు అనగా తదుపరి 2500 సంవత్సరాలలో స్వర్గంలో దైవిక మానవుల చేతనంలో ఉన్న దేవతలు,  ఆత్మిక స్మృతి  నుండి శారీరిక స్మృతికి  మారినప్పుడు, వారు స్వయాన్ని దేవి

Read More »
15th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 3)

ఆత్మ మరియు భగవంతుని జ్ఞానాన్ని పంచుకున్న తరువాత, బ్రహ్మా కుమారీల 7 రోజుల పరిచయ కోర్సు ప్రపంచ నాటకం అంటే ఏమిటి మరియు అది 4 యుగాలతో ఎలా రూపొందించబడిందో మనకు బోధిస్తుంది –

Read More »