15th Nov 2023 Soul Sustenance Telugu new » Brahma Kumaris | Official

November 15, 2023

మీ మాటలకన్నా మీ తరంగాల ప్రభావమే ఎక్కువ

చాలాసార్లు మనమిచ్చే సలహా మంచిదైనా కానీ ఇతరులు దానిని తిరస్కరిస్తుంటారు.  వారు మారాలని అనుకోనప్పుడు, మన మాటలు వారిని చేరనివ్వకుండా వారి అహం అడ్డుగా నిలుస్తుంది. అయితే, ఆలోచనా తరంగాలు మాటలు, చేతలకన్నా శక్తివంతమైనవి. ఇదే సలహాను మనం మన శుద్ధమైన ఆలోచనలతో పంపిస్తే, ఆ తరంగాల ప్రభావంనుండి ఎవ్వరూ తప్పించుకోలేరు.

కొన్నిసార్లు కొంతమంది మీరిచ్చిన సలహాను వారి అహం కారణంగా అంగీకరించకపోవచ్చు, మరికొన్ని సార్లు అంగీకరించినా అమలు చేయలేకపోవచ్చు. అప్పుడు వారితో వాదించకండి, విమర్శించకండి లేదా ఇలాగే చేయాలని బలవంతపెట్టకండి.  మీ ఆలోచనా శక్తిని వినియోగించి వారిని సానుకూలంగా ప్రభావితం చేయండి.

ఇతరుల కోసం మీరు చేసే ప్రతి ఆలోచన ఒక శక్తి అని, అది తరంగాల రూపంలో వారికి చేరుతుందని గుర్తుంచుకోండి. కాలం, సమయం వంటి అడ్డంకులను మీ తరంగాలు దాటుకుంటూ వెళ్ళి ఆ వ్యక్తికి చేరుకుని వారిని ప్రభావితం చేస్తాయి.

మెడిటేషన్ చేసేటప్పుడు ఆ వ్యక్తిని మీ మానసపటలంపైకి తీసుకురండి. వారిలో మీరు ఆశించే సానుకూల మార్పుల గురించి శుద్ధమైన, సానుకూలమైన మరియు శక్తివంతమైన తరంగాలను పంపించండి, అది వారి ఆరోగ్యం, సంతోషం, అలవాట్లు, వృత్తి, సంబంధాలు, ఆర్థిక వ్యవహారాలు… కావచ్చు.

రోజంతా కూడా ఇతరుల గురించి శక్తిశాలి ఆలోచనలనే చేయండి. ఉదాహరణకు, ఒకరి ఆరోగ్యం కోసం ఇలా ఆలోచించండి – అతడు సంతోష స్వరూపుడు. అతని శరీరంలోని ప్రతి కణం శక్తి మరియు పవిత్రతతో నిండుతుంది. అతను తీసుకునే వైద్యం అతనికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇటువంటి మీ తరంగాలు వారి శక్తి క్షేత్రాన్ని లేదా ఆరాను (సౌరభం) పెంపొందించి, ఎటువంటి అనారోగ్యాన్నయినా అధిగమించేలా వారిని సాధికారపరుస్తుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

3rd Dec 2023 Soul Sustenance Telugu » Brahma Kumaris | Official

మెడిటేషన్ లో చేయవలసిన మరియు చేయకూడని 10 అంశాలు (పార్ట్ 2 )

ఆత్మానుభూతి పొందుతూ కర్మలలో ఆత్మానుభూతి చేసుకోవడం – మెడిటేషన్ కు ముఖ్యమైన పునాది ఆత్మ యొక్క స్పృహ ఉండడం. స్వయాన్ని ఆత్మగా అనగా జ్యోతి స్వరూపంగా భావిస్తూ, ఆత్మ యొక్క నిజగుణాలను అనుభూతి చేసుకోవడం.

Read More »
2nd Dec 2023 Soul Sustenance Telugu » Brahma Kumaris | Official

మెడిటేషన్ లో చేయవలసిన మరియు చేయకూడని 10 అంశాలు (పార్ట్ 1)

ఒక పాజిటివ్ ఆలోచనతో మీ మెడిటేషన్ ను ప్రారంభించండి – మెడిటేషన్ ప్రారంభించే ముందు, మీరు స్వచ్ఛమైన మరియు ప్రశాంతమైన జీవి అని మరియు సర్వ గుణాల, శక్తుల సాగరుడైన భగవంతుడు మీ తండ్రి

Read More »
1st Dec 2023 Soul Sustenance Telugu » Brahma Kumaris | Official

మీ ఆనందాన్ని వాయిదా వేయకండి

మనం ప్రతి క్షణం ఆనందంగా ఉండాలనుకుంటాము. అయినప్పటికీ, ఏదైనా కావాల్సినది జరిగే వరకు ఆ ఆనందాన్ని వాయిదా వేయడానికి మన మనస్సును ప్రోగ్రామింగ్ చేశాం. తద్వారా మనం మన మనుసును షరతులతో కూడినదిగా చేస్తాము.

Read More »