Hin

12th mar 2024 soul sustenance telugu

March 12, 2024

మీ మూడ్‌ను ఎప్పటికీ సంతోషంగా, పాజిటివ్‌గా పెట్టుకోండి

సంతోషం-బాధ, శాంతి-అశాంతి వంటి రకరకాల మూడ్‌లను ఎదుర్కుంటున్నారా? అప్పుడప్పుడు కనిపించే ఈ మూడ్ అలజడులను సరి చేయకపోతే అవి తరచుగా రావడం మొదలవుతాయి. మన మూడ్ ఎప్పుడూ పాజిటివ్‌గా, శక్తివంతంగా ఉండటం చాలా ముఖ్యం. లేకపోతే ఒక మూడ్ నుండి మరొక మూడ్‌కు పదే పదే మారుతూ ఉంటే అది అలసటను, అసంతృప్తిని తెస్తుంది.

  1. మూడ్ మారుతూ ఉందంటే అందుకు ఆలోచనల నాణ్యతలో వచ్చే హెచ్చుతగ్గులే కారణం. ఎటువంటి ఆలోచనలు మూడ్‌ను మారుస్తున్నాయో పరిశీలించుకోండి, మీకు వచ్చే బ్యాడ్ మూడ్‌లను వ్రాసుకోండి, మూడ్ మారినప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో ఆలోచించండి.
  2. ఒక పరిస్థితిలో వచ్చిన చెడు లేక తక్కువ స్థాయి మూడ్‌ను సరి చేయకపోతే, అది సబ్ కాన్షస్ మైండ్‌లో రికార్డు అయిపోతుంది. ఒక చిన్న కారణం వచ్చినా, రికార్డు అయిన చెడు మూడ్‌ను నిద్రలేపి అది మీ మూడ్‌గా అయ్యేలా చేస్తుంది. అంటే, మీరు బాధ అనే మూడ్‌లో చాలాకాలం ఉన్నారనుకోండి, అది తరచూ వచ్చే మీ మానసిక స్థితిగా మారుతుంది, చివరకు అది మీ వ్యక్తిత్వంగా మారిపోతుంది.
  3. ప్రతి ఉదయం ఆధ్యాత్మిక అధ్యయనం మరియు ధ్యానం ద్వారా మీ మనస్సుకు స్వచ్ఛమైన, సానుకూల ఆలోచనలు మరియు భావాలను అందించడం ద్వారా, మీరు ప్రతి పరిస్థితిలో మంచి ఆలోచనను, మంచి భావాన్ని ఎంచుకుంటారు. మీ మూడ్‌ను వ్యక్తులు, వస్తువులు లేక పరిస్థితులు నిర్దేశించలేవు.
  4. పరిస్థితులు ఎప్పుడూ మారుతూనే ఉంటాయి, కొన్నిసార్లు అవి సవాలు విసురుతూ ఉంటాయి. పరిస్థితులను మీకు సంతోషాన్నిచ్చే మూలాలుగా మీరు పెట్టుకుంటే, జీవితం మంచి మరియు చెడు మూడ్‌ల రోలర్ కోస్టర్ అవుతుంది. కానీ ఆనందమే మీ స్వభావం అని మీరు గ్రహిస్తే, జీవితం ఎల్లప్పుడూ సాఫీగా మరియు సుఖంగా ఉంటుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

20th march 2025 soul sustenance telugu

సంబంధాల్లో కలిగే బాధ నుండి విముక్తిని పొందడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలోని వివిధ రంగాలలో వేర్వేరు సంబంధాలలోకి వచ్చినప్పుడు, కొన్నిసార్లు మన అంతర్గత ప్రపంచంలోకి మరొక ఆత్మను అనుమతించినప్పుడు, మనల్ని వారు అర్థం

Read More »
19th march 2025 soul sustenance telugu

జీవితంలోని వివిధ దృశ్యాలలో సాకులు చెప్పడం మానుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలా మంది మన విశ్వసనీయతను కాపాడుకోవడానికి, ఇతరులపై లేదా పరిస్థితులపై నిందలు వేయడానికి సాకులు చెబుతారు. కొన్నిసార్లు మనకు, మన

Read More »
18th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు అంతర్గత బలం యొక్క సానుకూల సంస్కారాలను సృష్టించడానికి, మనం ముందుగా పట్టుదల యొక్క మొదటి అడుగు వేయాలి. పట్టుదల అంటే నేను

Read More »