Hin

31st may 2024 soul sustenance telugu

May 31, 2024

మీ నమ్మకాలను మార్చుకొని చక్కని భాగ్యాన్ని తయారు చేసుకోండి

మన ఆలోచనలను ప్రభావితం చేసే 3 అంశాలు:  గత అనుభవాలు, సమాచారం మరియు నమ్మకాలు. మన నమ్మకాలు మన భాగ్యాన్ని తయారుచేసి,  మన ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. మన భావోద్వేగాల గురించిన మన నమ్మకాలలో కొన్ని ఒత్తిడి, బాధ మరియు సంబంధాలలో సంఘర్షణలకు కారణమవుతాయి. బదులుగా కొత్త నమ్మకాలను అన్వేషిద్దాం:

  1. టెన్షన్ మరియు ఆందోళన సహజం – శాంతి మరియు ప్రశాంతత సహజం
  2. కోపం అవసరం – కరుణ అవసరం
  3. బాధ పడటం స్పష్టం – అర్థం చేసుకోవటం స్పష్టం
  4. సంతోషం పదవి, ఆస్తులలో ఉంటుంది – ప్రతి ఆలోచనలో సంతోషం సృష్టించబడుతుంది
  5. పోటీయే మార్గం – సహకారమే మార్గం
  6. విమర్శ ఒక ప్రేరేపకం – ప్రశంస ఒక ప్రేరేపకం
  7. ప్రేమలో ఆపేక్షలు ఉంటాయి – ప్రేమ అంటే అంగీకారం
  8. అపరాధ భావం పరివర్తనను తెస్తుంది – గ్రహింపు పరివర్తనను తెస్తుంది

మనమందరం మన ఆలోచనల నాణ్యతను మార్చడానికి ప్రయత్నిస్తాము కానీ మార్చలేకపోతున్నాము, ఎందుకంటే ఆలోచనలు నమ్మక వ్యవస్థల నుండి ఉత్పన్నమవుతాయి. ఒకవేళ మన నమ్మక వ్యవస్థలో ఆలోచనలలో   -”క్రమశిక్షణకు కోపం అవసరం, కోపం లేకుండా విషయాలు అదుపు తప్పుతాయి, అందరూ నన్ను తేలికగా తీసుకుంటారు, అందరూ నన్ను బలహీనంగా భావిస్తారు” అని ఉంటే మనం ప్రేమ మరియు శాంతి ఆలోచనలను సృష్టించలేము. కొత్త నమ్మక వ్యవస్థతో ప్రయోగాలు చేయండి – నేను శాంతియుత, ప్రేమగల ఆత్మను, నా చుట్టూ ఉన్న వారందరూ కూడా అలానే ఉన్నారు. శాంతి మరియు ప్రేమ ఇతరులను ప్రేరేపించే పనిని పూర్తి చేయడానికి మార్గం. ఈ నమ్మక వ్యవస్థను ఉపయోగించి మీ భాగ్యాంలో వచ్చే మార్పును చూడండి. ఉపచేతన మనస్సు స్వయం మరియు ఇతరుల గురించి ఎన్నో నమ్మక వ్యవస్థలతో నిండి ఉంది. మనం వాటి గురించి తెలుసుకుని, మనకు బాధను  కలిగించే దాని బదులుగా  కొత్త నమ్మక వ్యవస్థ అన్వేషిద్దాం.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

11th october 2024 soul sustenance telugu

ఆంతరిక రావణుడిని కాల్చి స్వేచ్ఛను అనుభవం చేసుకోవటం  (పార్ట్ 1)

దసరా నాడు ఆధ్యాత్మిక సందేశం-అక్టోబర్ 12 దసరా అంటే చెడుపై మంచి సాధించిన విజయాన్ని జరుపుకునే పండుగ. ఇది శ్రీరాముడు మరియు రావణుడి మధ్య యుద్ధం రూపంలో చూపబడుతుంది. ఇందులో శ్రీరాముడు రావణుడిని ఓడించి

Read More »
10th october 2024 soul sustenance telugu

ఆలోచనలపై ప్రతికూల ప్రభావాలను అధిగమించడం (పార్ట్ 3)

నిన్న మనం బాహ్య ప్రభావాల గురించి చర్చించుకున్నాము. మన ఆలోచనలపై కొన్ని ఆంతరిక ప్రభావాలు ఈ క్రింది విధంగా ఉంటాయి: – ప్రశంసలు, కీర్తి, ప్రతీకారం, దురాశ, పరిస్థితి లేదా వ్యక్తి యొక్క నియంత్రణలో

Read More »
9th october 2024 soul sustenance telugu

ఆలోచనలపై ప్రతికూల ప్రభావాలను అధిగమించడం (పార్ట్ 2)

కేంద్రీకృత ఆలోచన యొక్క ఆరోగ్యకరమైన, సానుకూల అనుభవంలో ఉండనివ్వని ఒక ముఖ్యమైన అంశం మన జీవితంలో మనం ఎదుర్కొనే అనేక రకాల ప్రభావాలు. రెండు రకాలైన ప్రభావాలు ఉన్నాయి – బాహ్యమైనవి మరియు ఆంతరికమైనవి.

Read More »