Hin

20th May 2025 Soul Sustenance Telugu

May 20, 2025

మీ పిల్లలతో తగినంత సమయం గడపకపోవడంపై అపరాధ భావాన్ని అధిగమించండి

వివిధ రకాల వ్యక్తిగత మరియు వృత్తిపరమైన నిబద్ధతలను గౌరవించేటప్పుడు, చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు తగినంత నాణ్యమైన సమయాన్ని ఇవ్వకపోవడం పట్ల అపరాధభావం కలిగి ఉంటారు. వారి అపరాధభావ ప్రకంపనలు వారి పిల్లలకు నిరంతరం ప్రసరిస్తాయి. మీరు మీ పిల్లలతో ఎక్కువ సమయం గడపకపోవడం గురించి అపరాధ భావాన్ని కలిగిన లేదా భయాందోళనలను సృష్టించే తల్లిదండ్రులా?

  1. మీ పిల్లలతో మీ సంబంధం అనేది మీరు వారితో గడిపిన సమయం కంటే మీ ఆలోచనలు, భావాలు మరియు వైఖరులపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. నేను వారితో తగినంత సమయం గడపడం లేదు అని మీరు ఎల్లప్పుడూ అనుకుంటే, వారు ఆ ప్రకంపన శక్తిని గ్రహిస్తారు మరియు వారి మనస్సు నా తల్లిదండ్రులకు నా కోసం సమయం లేదు అని నెమ్మదిగా ప్రోగ్రామ్ చేయబడుతుంది. ఇది వారితో మీ సంబంధాన్ని దెబ్బతీస్తుంది మరియు వారితో మీ సంబంధంలో భావోద్వేగ విభేదాలను మరియు అడ్డంకులను సృష్టిస్తుంది. ఇది మీ పిల్లలలో ప్రవర్తనా సమస్యలను కూడా తెస్తుంది. వారి వ్యక్తిత్వం దెబ్బతింటుంది, వారి వ్యక్తిగత పెరుగుదల మరియు విద్య వంటి జీవితంలోని వివిధ రంగాలలో వారి పనితీరును ప్రభావితం చేస్తుంది.
  2. మీరు మీ పిల్లలతో 24 గంటలు ఉన్నప్పటికీ, మీ ఆలోచనలు ఒత్తిడి మరియు ఆందోళనను కలిగి ఉంటే లేదా మీరు మానసికంగా పరధ్యానంలో ఉంటే, మీరు వారిని సరిగ్గా మరియు దృఢత్వంతో శక్తివంతం చేయలేరు. కానీ, మీరు మరొక దేశంలో ఉండి కూడా, నేను నా పిల్లలతో ఉన్నాను, వారు క్షేమంగా, సంతోషంగా ఉన్నారు అని ఒక శక్తివంతమైన ఆలోచనను సృష్టించినప్పుడు వారికి మీ పాలనతో స్థిరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ప్రేమతో నిండిన మీ ఆలోచనలు వారి ఆలోచనలను ప్రభావితం చేస్తాయి మరియు వారు శారీరకంగా మీకు దూరంగా ఉన్నప్పటికీ వారు మీకు చెందిన భావనను అనుభవం చేస్తారు.
  3. మీ పనిలో, మీ సంబంధాలలో, మీ ఆరోగ్యంలో లేదా మీ ఆర్థిక విషయాలలో సమస్యలు ఉండవచ్చు. మీరు సమస్యలను పరిష్కరించేటప్పుడు ప్రశాంతంగా మరియు శక్తివంతంగా ఉండండి. మీ అంతర్గత శక్తి మీ పిల్లలకు ప్రసరిస్తుంది మరియు వారిని భావోద్వేగపరంగా బలంగా చేస్తుంది. మీ పిల్లలు మానసికంగా, భావోద్వేగపరంగా ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారో అలాగే ఎల్లప్పుడూ మానసికంగా, భావోద్వేగపరంగా ఉండండి.
  4. మిమ్మల్ని మీరు శక్తివంతం చేసుకోవడానికి మరియు మీ అంతర్గత బలాన్ని పెంచుకోవడానికి ప్రతిరోజూ మీ జీవితంలో ఆధ్యాత్మికతను చేర్చుకోండి. కొన్నిసార్లు మీరు మీ పిల్లలతో ఒక రోజులో ఒక గంట మాత్రమే గడిపినప్పటికీ, మీరు వారిని శాంతి, ప్రేమతో పోషించడానికి అత్యధిక ప్రకంపనలలో ఉంటారు మరియు వారు పరిపూర్ణంగా పెరుగుతారు. వారు వారి మనస్సులలో ఎటువంటి అసంతృప్తి లేకుండా మిమ్మల్ని ఎల్లప్పుడూ ప్రేమిస్తారు మరియు గౌరవిస్తారు. 

రికార్డు

15th June 2025 Soul Sustenance Telugu

వ్యక్తులు మీపై ఆధారపడేలా చేయవద్దు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు కొంతమందికి లేదా కొన్ని పరిస్థితులకు మనమే ఎంతో ముఖ్యమని, మనం లేకుండా వారు జీవితాన్ని గడపలేరనే నమ్మకంతో మనం తరచుగా జీవిస్తుంటాము.

Read More »
14th June 2025 Soul Sustenance Telugu

భగవంతుడు – ఈ సృష్టి యొక్క ఆది బిందువు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు భగవంతుడు సర్వ శక్తివంతుడు. వారు ఉంటేనే ఈ ప్రపంచం ఉంటుంది, ఎందుకంటే ఈ ప్రపంచంలో  మంచితనం మరియు దైవత్వం క్షీణించిన ప్రతిసారీ

Read More »
13th June 2025 Soul Sustenance Telugu

మిమ్మల్ని మీరు ఎలా ఆశీర్వదించుకోవాలి?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన జీవితంలో సాధువులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కుటుంబం మరియు స్నేహితుల ఆశీర్వాదాల శక్తిని మనమందరం పొందాము. ఆశీర్వాదం అంటే వారందరూ మన

Read More »