Hin

2nd november 2024 soul sustenance telugu

November 2, 2024

మీ సంబంధాలలో దాతగా ఉండండి

ఈ రోజు మన సంబంధాలలో మనం శ్రద్ధ చూపేవారిలా, ధ్యాస పెట్టేవారిలా మరియు క్షమించేవారిలా ఉన్నామా అని చెక్ చేసుకుందాము. మనం ఇచ్చేవారిగా ప్రారంభిస్తాము, కానీ క్రమంగా వస్తువుల కోరిక వైపు మారుతాము. మనం ఇస్తూనే ఉన్నప్పుడు మాత్రమే సంబంధాలు బలంగా ఉంటాయి. మనం ఇచ్చిపుచ్చుకోవడం ఆశించినప్పుడు అవి వ్యాపారంగా మారతాయి. మీ ముఖ్యమైన సంబంధాలలో, మీరు తీసుకున్న దానికంటే ఎక్కువ మంచితనం ఇచ్చిన వారిలా మీకు అనిపిస్తుందా? అది ఏకపక్షంగా ఉన్నప్పటికీ, మీరు నిస్వార్థ ప్రేమను, గౌరవాన్ని మరియు శ్రద్ధను అవతలి వ్యక్తికి ప్రసరింపజేస్తారా? అవును అయితే, మీ లక్షణాలు శాశ్వత సంబంధాలను సృష్టించడానికి అనుకూలంగా ఉంటాయి. మనం భావోద్వేగపరంగా, ఆధ్యాత్మికంగా మనల్ని మనం జాగ్రత్తగా చూసుకున్నప్పుడు, మన విలువను మనం గుర్తిస్తాము. ఆనందం, శాంతి మరియు ప్రేమ యొక్క అపారమైన ఆంతరిక సంపదను పొందుతాము. ఇతరుల నుండి మనకు ఏమీ అవసరం ఉండదు. శక్తి పరంగా మనం ఇవ్వడానికి చాలా ఉంటుంది, మనం దానిని సహజంగా ఇతరులకు ప్రసరింపజేస్తాము. సంబంధాలు అంటే ఇవ్వడం గురించి, స్వీకరించడం గురించి మాత్రమే కాదు. మనం వారికి అవసరం ఉన్నందువల్ల వారికి సరైన శక్తులను ఇవ్వము, ఇవ్వడం మంచి అనుభూతి, ఇవ్వడం మన స్వభావం కనుక ఇస్తాము. మనం మంచితనాన్ని ప్రసరింపజేసినప్పుడు, మన శక్తిని మొదట పొందేది మనమే. మనము భావోద్వేగపరంగా శక్తివంతంగా, స్వయం సమృద్ధిగా మరియు స్వతంత్రంగా ఉంటాము.

మీరు ప్రేమగల ఆత్మ అని, మీ సంబంధాల సృష్టికర్త అని గుర్తుంచుకోండి. కుటుంబం, స్నేహితులు, సహోద్యోగులు, పొరుగువారు, సమాజాన్ని చూసుకోవడం మీ స్వభావం. సంబంధాలు, సంబంధీకుల సంతోషం మీకు ముఖ్యమైనవి. ప్రతి సంబంధంలో ఇచ్చే వారిగా ఉండటం ఎంచుకోండి. ప్రేమను ఇవ్వండి, అంగీకరించండి మరియు వారి కోసం బేషరతుగా ఉండండి. మీరు వాటిని ఇస్తూ, స్వీకరిస్తూ ఉన్నట్లయితే మీరు ఈ గుణాలతో నిండి ఉంటారు. అప్పుడు మీకు అవి మరెవరి నుండి అవసరం లేదు. వ్యక్తులు మీ ప్రకారంగా ఉండాల్సిన అవసరం లేదు, వారు వారి ప్రకారంగా ఉండవచ్చు. బలహీనతల గురించి ఆలోచించవద్దు, వినవద్దు లేదా మాట్లాడవద్దు. మిమ్మల్ని ప్రేమిస్తున్న, ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలను తెలపండి. మీ ఓపికను, సర్దుబాటుతనం మరియు సహనాన్ని పెంచుకునే అవకాశాన్ని మీకు ఇచ్చినందుకు మీకు సరిగ్గా లేని ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీకు ఏమీ అవసరం లేదు. మీరు మీ సంబంధాలలో కేవలం ఇస్తూనే ఉండండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

5th dec 2024 soul sustenance telugu

ప్రతి కర్మపై ధ్యాస పెట్టడం

మన ప్రతి ఆలోచన, మాట మరియు చర్య మనం ప్రపంచానికి పంపే శక్తి, ఇది మన కర్మ. పరిస్థితులు, వ్యక్తుల ప్రవర్తనలు అనేవి తిరిగి వచ్చే శక్తి, ఇది మన విధి. ప్రతి కర్మ

Read More »
4th dec 2024 soul sustenance telugu

ప్రతికూల పరిస్థితులను 3 దశల్లో పరిష్కరించడం (పార్ట్ 3)

స్టెప్ 3 – పరిష్కారానికి సానుకూల చర్యలు తీసుకోవడం – మూడవ దశ మరియు చాలా ముఖ్యమైనది పరిస్థితిని సరిచేయడానికి భౌతిక స్థాయిలో సానుకూలంగా ఏదైనా చేయడం. కొన్నిసార్లు, మనం సానుకూలంగా ఆలోచించి భగవంతుడిని

Read More »
3rd dec 2024 soul sustenance telugu

ప్రతికూల పరిస్థితులను 3 దశల్లో పరిష్కరించడం (పార్ట్ 2)

స్టెప్ 2 – సానుకూలమైన మరియు శక్తివంతమైన మానసిక స్థితిని సృష్టించడం – ఏదైనా ప్రతికూల పరిస్థితిని పరిష్కరించడంలో తదుపరి దశ ఆధ్యాత్మిక ధృవీకరణలు లేదా ఆంతరిక శక్తి, దృఢత్వంతో నిండిన ఆలోచనల సహాయంతో

Read More »