Hin

1st june 2025 soul sustenance telugu

June 1, 2025

 మీ శరీరాన్ని గౌరవించే కళ

మన భౌతిక వస్త్రము అయిన మన శరీరం తరచుగా మన లేదా ఇతరుల అంచనాలకు, విమర్శ లేదా తిరస్కరణకు గురవుతుంది. మన శరీరం జీవితాంతం మనకు ఎన్నో రకాలుగా పని చేసినందుకు  దానికి కృతజ్ఞతలు తెలపడం అవసరం. సన్నగా, పొడవుగా లేదా అందంగా కనిపించడంపై కాకుండా సంతోషంగా మరియు ఆరోగ్యంగా ఉండటంపై దృష్టి పెట్టాలి. మన శరీరం గురించిన మన ఆలోచనలు మరియు మాటలపై అవగాహన కలిగి ఉందాం, అదీ  ముఖ్యంగా మరొకరిని మెచ్చుకునేటప్పుడు. అటెన్షన్ పెట్టి ప్రశంసల శక్తిని ఇతరుల వైపు నుండి మరల్చి మన శరీరానికి పంపుదాము. మనం ఇతరులను విమర్శించడం మానేస్తేనే మన శరీరం పట్ల ప్రేమ మరియు గౌరవాన్ని పెంపొందించుకోవడం సులభం అవుతుంది. ఇతరుల రూపం, డ్రెస్సింగ్, ఆహారం లేదా జీవనశైలిపై అధిక శ్రద్ధ చూపవద్దు. మన శరీరం శుభ్రంగా, మంచి బట్టలు వేసుకొని, సరైన పోషకాహారం, తగినంత వ్యాయామం మరియు తగినంత విశ్రాంతి ఉండేలా చూసుకోవడానికి మనం తగినంత సమయాన్ని షెడ్యూల్ చేసుకోవాలి. సూర్యరశ్మి, కంప్యూటర్/ఫోన్ లైట్, కళ్లద్దాలు/లెన్స్, ఇయర్‌ఫోన్‌లు, సబ్బు, సౌందర్య సాధనాలు, నగలు మొదలైనవి – మన శరీరం చుట్టూ మరియు శరీరంలోకి ఇంకా ఏమి వెళ్తాయో చూసుకుందాం. ఇవి నెగిటివ్ పదార్ధాలను కలిగి ఉంటే, చెక్ చేసుకొని, ఆరోగ్యకరమైన వాటిని మాత్రమే వినియోగిద్దాం. 

మనం తరచుగా మన సంతోషం మన శరీరం ఎలా కనిపించేదానిపైనే ఆధారపడి ఉంటుందని నమ్ముతాము. నాకు నా రూపం నచ్చలేదు అనే సాధారణ మాటలు మన మనస్సు మరియు శరీరానికి చాలా శక్తివంతమైన ప్రతికూల సందేశాన్ని పంపుతాయి. నిజం ఏమిటంటే, మీరు ఎలా కనిపిస్తారనేది మిమ్మల్ని సంతోషపెట్టదు, కానీ మీ సంతోషం ఖచ్చితంగా మిమ్మల్ని అందంగా కనిపించేలా చేస్తుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీ శరీరం ఎలా కనిపిస్తుందనే దాని గురించి అభిప్రాయాలను కలిగి ఉండవచ్చు కానీ మీరు మీ శరీరాన్ని విమర్శించకుండా లేదా తిరస్కరించకుండా జాగ్రత్త వహించండి. నేను చాలా లావుగా ఉన్నాను … నేను నల్లగా ఉన్నాను … నేను బలహీనంగా ఉన్నాను … ప్రతి మాట మీరు మీ శరీరాన్ని తిరస్కరిస్తున్నారని చెబుతుంది. మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోండి, దానిని ఫిట్‌గా ఉంచుకోండి, కానీ అది ప్రేమ మరియు కృతజ్ఞతా శక్తితో చేయండి. మీ శరీరాన్ని అభినందించడానికి మరియు కృతజ్ఞతలు చెప్పడానికి ప్రతీ రోజు కొంత సమయం కేటాయించండి.

రికార్డు

16th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మెడిటేషన్ ని మీ ఔషధంగా చేసుకొని ఆ ఔషధాన్ని ప్రతి రోజు తీసుకోండి మెడిటేషన్ మన మనస్సును మరింత శక్తివంతంగా చేసి

Read More »
15th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు రోజంతా మీ ఆలోచనలను జాగ్రత్తగా పరిశీలించుకోండి   మన భావోద్వేగ ఆరోగ్యం అనేది ముఖ్యంగా మన ఆధ్యాత్మిక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది.

Read More »
14th july 2025 soul sustenance telugu

ఆధ్యాత్మికతతో మన భావోద్వేగ మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం మానవాత్మలం అనగా మొదట ఆత్మలం, ఇది మన ఆధ్యాత్మిక గుర్తింపు. మనం మన భౌతిక శరీరం ద్వారా మన పాత్రను

Read More »