Hin

3rd oct 2023 soul sustenance telugu

October 3, 2023

   మీ శరీరాన్ని గౌరవించే కళ

మన భౌతిక వస్త్రము అయిన మన శరీరం తరచుగా మన లేదా ఇతరుల అంచనాలకు, విమర్శ లేదా తిరస్కరణకు గురవుతుంది. మన శరీరం జీవితాంతం మనకు ఎన్నో రకాలుగా పని చేసినందుకు అది కృతజ్ఞతలు పొందేందుకు  అర్హత కలిగి ఉన్నది . సన్నగా, పొడవుగా లేదా అందంగా కనిపించడంపై కాకుండా సంతోషంగా మరియు ఆరోగ్యంగా ఉండటంపై దృష్టి పెట్టాలి. మన శరీరం గురించిన మన ఆలోచనలు మరియు మాటల అర్థం చేసుకుందాం, అదీ  ముఖ్యంగా మరొకరిని మెచ్చుకునేటప్పుడు. అటెన్షన్ పెట్టి ప్రశంసల శక్తిని ఇతరుల వైపు నుండి మరల్చి మన శరీరానికి పంపుదాము. మనం ఇతరులను విమర్శించడం మానేస్తేనే మన శరీరం పట్ల ప్రేమ మరియు గౌరవాన్ని పెంపొందించుకోవడం సులభం అవుతుంది. ఇతరుల రూపం, డ్రెస్సింగ్, ఆహారం లేదా జీవనశైలిపై అధిక శ్రద్ధ చూపవద్దు. మన శరీరం శుభ్రంగా, మంచి బట్టలు వేసుకొని, సరైన పోషకాహారం, తగినంత వ్యాయామం మరియు తగినంత విశ్రాంతి ఉండేలా చూసుకోవడానికి మనం తగినంత సమయాన్ని షెడ్యూల్ చేసుకోవాలి. సూర్యరశ్మి, కంప్యూటర్/ఫోన్ లైట్, కళ్లద్దాలు/లెన్స్, ఇయర్‌ఫోన్‌లు, సబ్బు, సౌందర్య సాధనాలు, నగలు మొదలైనవి – మన శరీరం చుట్టూ మరియు శరీరంలోకి ఇంకా ఏమి వెళ్తాయో చూసుకుందాం. ఇవి నెగిటివ్ పదార్ధాలను కలిగి ఉంటే, చెక్ చేసుకొని, ఆరోగ్యకరమైన వాటిని మాత్రమే వినియోగిద్దాం. 

మనం మన ఆనందం మన శరీరం ఎలా ఉంటుందో అనే దానిపై ఆధారపడి ఉంటుందని నమ్ముతాము. నేను కనిపిస్తున్న విధానం పై నేను సంతోషంగా లేను అన్న  ఆ సాధారణ మాటలు మనస్సు మరియు శరీరానికి చాలా శక్తివంతమైన నెగిటివ్ సందేశాన్ని పంపుతాయి. నిజం ఏమిటంటే, మీరు ఎలా కనిపిస్తారనేది మిమ్మల్ని సంతోషపెట్టదు, కానీ మీ ఆనందం ఖచ్చితంగా మిమ్మల్ని అందంగా కనిపించేలా చేస్తుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీ శరీరం ఎలా కనిపిస్తుందనే దాని గురించి అభిప్రాయాలను కలిగి ఉండవచ్చు కానీ మీరు మీ శరీరాన్ని విమర్శించకుండా లేదా తిరస్కరించకుండా జాగ్రత్త వహించండి. నేను చాలా లావుగా ఉన్నాను … నేను నల్లగా ఉన్నాను … నేను బలహీనంగా ఉన్నాను … ప్రతి మాట మీరు మీ శరీరాన్ని తిరస్కరిస్తున్నారని చెబుతుంది. మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోండి, దానిని ఫిట్‌గా ఉంచుకోండి, కానీ ప్రేమ మరియు ప్రశంసల శక్తితో నింపండి. మీ శరీరాన్ని అభినందించడానికి మరియు కృతజ్ఞతలు చెప్పడానికి ప్రతీ రోజు కొంత సమయం  కేటాయించండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

గెలుపు, ఓటములపై మీ ఆత్మగౌరవం ఆధారపడుతుందా (పార్ట్ 1)

గెలుపు, ఓటములపై మీ ఆత్మగౌరవం ఆధారపడుతుందా (పార్ట్ 1)

మనం ఒక పోటీలో ఉన్నామని, జీవితం ప్రతి క్షణం గెలవడం గురించెనని మన రోజువారీ జీవితంలో తరచుగా వింటాము. అలాగే, శారీరక స్థాయిలో ఏదైనా విజయం సాధించినప్పుడు చాలా సంతోషపడటం మనకు అలవాటయింది. అది

Read More »
11th dec 2024 soul sustenance telugu

నిజమైన విజయానికి ప్రాథమిక సూత్రాలు

కొన్నిసార్లు మనం మన లక్ష్యాలను సాధించలేనప్పుడు, మనం అంటాము – నేను విజయవంతం కాలేదు, నేను విఫలమయ్యాను. మిమ్మల్ని మీరు వైఫల్యం అని అనుకుంటే మీకు మీరే అన్యాయం చేసుకోవడం. మిమ్మల్ని మీరు నిజంగానే

Read More »
10th dec 2024 soul sustenance telugu

మనతో మంచిగా లేని వ్యక్తులకు కృతజ్ఞత

కొంతమంది వ్యక్తుల ప్రవర్తనలు మనకు దాదాపు భరించలేనివిగా అనిపిస్తాయి. వారు మన జీవితంలోకి వచ్చి వారి మాటలు, ప్రవర్తనలతో గందరగోళాన్ని సృష్టించారని మనం భావిస్తాము. అలాంటి వ్యక్తులు మన సామర్థ్యాన్ని బయటకు తీసుకువస్తారని, మనం

Read More »