Hin

21st May 2025 Soul Sustenance Telugu

May 21, 2025

మీ వాస్తవిక సత్య గుణానికి తిరిగి వెళ్లడం

సత్యం మన వాస్తవిక గుణం, కానీ ఎప్పటికప్పుడు మన సౌలభ్యం కోసం లేదా స్వల్పకాలిక లాభాల కోసం అబద్ధాలు చెబుతాము. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మనం అబద్ధం చెప్పిన ప్రతిసారీ, మనం అసౌకర్యాన్ని అనుభవిస్తాము, ఎందుకంటే మన అంతరాత్మ మన నిజమైన స్వభావానికి వ్యతిరేకంగా మనం సాగుతున్నామని హెచ్చరిస్తుంది. సత్యాన్ని దాచడానికి మనం ఏమి చేసినా, అది దానంతట అదే బహిర్గతం అవుతుంది మరియు ఎల్లప్పుడూ గెలుస్తుంది. నిజాయితీ అంటే మనకు మరియు ప్రపంచానికి ప్రామాణికంగా ఉండటం. అబద్ధం చెప్పడం పాపం అని మీకు ఎప్పుడూ నేర్పించేవారు. అయినప్పటికీ, మీకు కావాల్సినదాన్ని పొందడం కోసం, ఇబ్బందులను నివారించడం కోసం  లేదా ఎవరినైనా సంతోషపెట్టడం కోసం మీరు అబద్ధాలు చెప్పారా? అవి ఎటువంటి హానిచేయవని మీరు నమ్ముతారా? నిజం మాట్లాడటం నుండి తప్పుడు కథను సృష్టించడం వరకు, మనలో చాలా మంది ఎప్పటికప్పుడు మన ప్రామాణికతకు దూరంగా వెళ్తున్నాము. సత్యం మరియు నిజాయితీ మన నిజమైన గుణాలు. ప్రతి అబద్ధం మన అంతర్గత శక్తిని తగ్గిస్తుంది మరియు అబద్ధం చెప్పుటను ఒక అలవాటుగా చేస్తుంది. ప్రతి పరిస్థితిలోనూ వాస్తవాలను మాట్లాడే ధైర్యాన్ని కలిగి ఉందాం. తాత్కాలికంగా కష్టం అనిపించినప్పటికీ సత్యం మనకు దీర్ఘకాలిక ప్రయోజనాలను ఇస్తుంది. ఒకరిని సంతోషపెట్టడానికి ఆ వ్యక్తికి అబద్ధం చెప్పడం కంటే నిజాయితీగా అభిప్రాయాన్ని పంచుకోవడం మంచిది. మనం నిజాయితీగా ఉన్నప్పుడు, స్వయానికి విశ్వసనీయతను, సంబంధాలలో బలాన్ని జోడించుకుంటాము.

 

మీరు నిజాయితీపరులని ప్రతిరోజూ మీకు మీరే గుర్తు చేసుకోండి. ప్రతి పరిస్థితిలోనూ, ప్రతి ఒక్కరితోనూ నిజం మాట్లాడటం మీకు సహజంగా రావాలి. మీ మనస్సును పరిశుభ్రంగా ఉంచుకోండి. సత్యం మరియు సమగ్రత యొక్క నియమాలను నమ్మండి. మీ ఉద్దేశాలు, ఆలోచనలు, మాటలు మరియు ప్రవర్తనలు పూర్తిగా నిజాయితీగా ఉండాలి. మీ చర్యలు మీ అసలైన స్వభావాన్ని సూచిస్తాయి. మీ సంబంధాలు, పరస్పర చర్యలు మరియు లావాదేవీలను సత్యతపై ఆధారం చేసుకోండి. దేనికీ భయపడవద్దు, దేనినీ దాచిపెట్టవద్దు మరియు వాస్తవాలను తప్పుగా చూపవద్దు. సత్యమే విజయం, సత్యమే శక్తి, అది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. ఇది పారదర్శకతను ప్రోత్సహిస్తుంది మరియు ఇతరులు నిజాయితీగా ఉండటానికి ప్రేరేపిస్తుంది. నిజాయితీగా ఉండటం జీవితంలోని ప్రతి అంశాన్ని సులభతరం చేస్తుంది. నిజం మాట్లాడటం కొన్నిసార్లు కష్టంగా అనిపించినప్పటికీ, అబద్ధం చెప్పకండి, సత్యాన్ని జీవించండి, కానీ మీరు నిరూపించాల్సిన అవసరం లేదు. అవతలి వ్యక్తి మీకు అబద్ధం చెప్పినా, నిజం మాట్లాడండి. మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి కానీ మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి శక్తిని వృథా చేయకండి. సత్యాన్ని బహిర్గతం చేయవలసిన అవసరం లేదు, అది దానంతట అదే బహిర్గతం చేసే శక్తిని కలిగి ఉంటుంది.

రికార్డు

15th June 2025 Soul Sustenance Telugu

వ్యక్తులు మీపై ఆధారపడేలా చేయవద్దు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు కొంతమందికి లేదా కొన్ని పరిస్థితులకు మనమే ఎంతో ముఖ్యమని, మనం లేకుండా వారు జీవితాన్ని గడపలేరనే నమ్మకంతో మనం తరచుగా జీవిస్తుంటాము.

Read More »
14th June 2025 Soul Sustenance Telugu

భగవంతుడు – ఈ సృష్టి యొక్క ఆది బిందువు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు భగవంతుడు సర్వ శక్తివంతుడు. వారు ఉంటేనే ఈ ప్రపంచం ఉంటుంది, ఎందుకంటే ఈ ప్రపంచంలో  మంచితనం మరియు దైవత్వం క్షీణించిన ప్రతిసారీ

Read More »
13th June 2025 Soul Sustenance Telugu

మిమ్మల్ని మీరు ఎలా ఆశీర్వదించుకోవాలి?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన జీవితంలో సాధువులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కుటుంబం మరియు స్నేహితుల ఆశీర్వాదాల శక్తిని మనమందరం పొందాము. ఆశీర్వాదం అంటే వారందరూ మన

Read More »