Hin

8th dec 2023 soul sustenance telugu

December 8, 2023

మీ వాస్తవికతలో మీకు ఏమి కావాలో అది మాత్రమే ఆలోచించండి

మన ఆలోచనలు మన వాస్తవికతను సృష్టిస్తాయని మనందరికీ తెలుసు. మన వాస్తవికతలో ఏదైనా మారాలంటే, మన ఆలోచనలను మార్చుకోవాలి. మన ప్రస్తుత వాస్తవికత గురించి ఆలోచిస్తూ ఉంటే, మన ఆలోచనల శక్తి మన వర్తమానానికి ప్రసరించి దానిని తీవ్రతరం చేస్తుంది. మన ఆలోచనలు, వైబ్రేషన్స్ మరియు కర్మలు మన కోరికతో సరిపోలితే, కోరిక తీరుతుంది. మనస్సుకు  యజమానిగా, మీరు మీ కోరిక గురించి మాత్రమే ఆలోచించి మీ భాగ్యాన్ని ఎలా ప్రభావితం చేయాలో చూడండి.

సంకల్పం :

నేను శక్తివంతమైనవాడిని. నేను కోరుకున్నది పొందానికి నా సంకల్పాలను ఉపయోగిస్తాను. నేను చేయాలనుకున్నది ఏదైనా చేయగలను…నా గతం లేదా నా ప్రస్తుత వాస్తవికత ఎలా ఉన్నా…నేను నా వాస్తవికత ఎలా ఉండాలనుకుంటున్నానో దాని గురించి మాత్రమే ఆలోచిస్తానుఈ క్షణం నుండి నా ఆలోచనలు నా భవిష్యత్తును తయారు చేస్తాయి. నాకు కావలసినది ఇప్పటికే జరిగినట్లుగా ఆలోచించి విజువలైజ్ చేస్తాను. నేను ఉండాలి, నాకు కావాలి… అని కాక నేను ఉన్నాను, నేను ఇప్పటికే కలిగి ఉన్నాను వంటి పదాలను ఉపయోగిస్తాను. నేను నాలో ఉన్న ఏదైనా సంస్కారం నాకు నచ్చకపోతే, నేను కొత్త సంస్కారం కలిగి ఉన్నట్లుగా విజువలైజ్ చేస్తాను. నేను అనారోగ్యంతో ఉంటే, నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాననే ఆలోచనలను సృష్టిస్తాను. సంబంధంలో వైరుధ్యం ఏర్పడితే, నేను సామరస్య ఆలోచనలను సృష్టిస్తాను… ఆఫీస్ లో ఏదైనా సమస్య ఉంటే, నేను పరిష్కారం యొక్క ఆలోచనలను సృష్టిస్తాను. నా ఆలోచనలు నా కోరిక నెరవేర్చుకోవడానికి సరైన చర్య తీసుకోవడానికి నాకు సహాయపడతాయి. నా కోరిక యొక్క ప్రకంపనలు నా మనస్సుకు ప్రసరిస్తాయి మరియు నన్ను శక్తివంతంగా చేస్తాయి…అవి నా శరీరానికి ప్రసరించి నా శరీర కదలికలను మెరుగుపరుస్తాయి. అవి నా పరిస్థితికి ప్రసరించి  దానిని ప్రభావితం చేస్తాయి… నా ఆలోచనలు నా కోరికకు తగినట్లుగా  నా వాస్తవికతను మారుస్తాయి….

 

మీ ఆలోచన శక్తిని వెలికి తీయడానికి ఈ సంకల్పాన్ని రిపీట్ చేయండి. క్రమంగా, మీ మనస్సు స్వచ్ఛమైన మరియు సానుకూల ఆలోచనలను మాత్రమే రచిస్తుంది. మీ ఆలోచనలు వ్యక్తులను మరియు పరిస్థితులను ఉత్తేజపరచి ప్రతి సన్నివేశంలో ఉత్తమమైన వాటిని బయటకు తెస్తాయి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

13th jan 2025 soul sustenance telugu 3

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 1)

మనమందరం భగవంతుడి నుండి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకుంటూ ప్రతిరోజూ ధ్యానాన్ని అభ్యసించే ఆధ్యాత్మిక విద్యార్థులం. ధ్యానం అంటే భగవంతునితో ఆధ్యాత్మిక అనుసంధానం. ఆధ్యాత్మిక జీవితంలోని ఈ రెండు అంశాలతో  అనగా ఆధ్యాత్మిక జ్ఞానం మరియు

Read More »
12th jan 2025 soul sustenance telugu

మనం మంచితనపు వైబ్రేషన్లను కలిగి ఉన్నామని తెలిపే 5 గుర్తులు

  మనమందరం ప్రపంచంలో మంచి ఆత్మలం. ఈ ప్రపంచ నాటకంలో ప్రతి ఒక్కరికీ మంచితనాన్ని ప్రసరింపజేసే పాత్ర మనది. మంచితనపు వైబ్రేషన్ అంటే  మనం ఎక్కడికి వెళ్లినా, ఎవరితో సంభాషించినా ప్రతి ఒక్కరూ మన

Read More »
11th jan 2025 soul sustenance telugu

మరింత వినడం ప్రారంభించండి … తక్కువగా తీర్పు చెప్పండి

మనమందరం గొప్ప వక్తలం కావచ్చు, కానీ మనం మంచి శ్రోతలమా? పరిపూర్ణ సంభాషణ అంటే కేవలం మనం బాగా మాట్లాడగలగడం మరియు మన మాటలను ఎవరైనా అర్థం చేసుకునేలా చేయడం మాత్రమే కాదు. ఇతరులు

Read More »