Hin

31st oct 2023 soul sustenance telugu

October 31, 2023

మీ విలువలను పట్టుకుని ఉండండి

ఉత్తమమైన వ్యక్తులుగా మనం ఉండాలంటే ఆధ్యాత్మికతతో పాటు మనలో ఉన్న వాటిని వదుల్కోకుండా ఉండాలి – అవే మనలోని సుగుణాలు. సాధారణంగా మనతో వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తారో అలాగే మన ప్రవర్తన కూడా ఉంటుంది. వారు మంచిగా ఉంటే మనమూ మంచిగా ఉంటాము లేకపోతే మనం వారితో ప్రతికూలంగా ప్రవర్తిస్తాము. కానీ ఇతరుల గుణాలను కాపీ చేస్తూ మనలోని సుగుణాలు తగ్గించుకోకూడదు.

  1. ప్రపంచంలో తగ్గుతున్న నైతిక స్థాయిలను చూసి మీరు తరచూ నిరాశ చెందుతున్నారా? మీరు ఎదుటి వ్యక్తితో సుగుణాలతో వ్యవహరించినప్పుడు ఎదుటి వ్కక్తి మాత్రం సానుకూలంగా స్పందించకపోతే వారిలా మీరూ ఉండాలని మీకనిపిస్తుందా? మీ చుట్టూ ఉన్నవారు మంచిగా లేని కారణంగా మీరు మీలోని ఏదైనా సుగుణాన్ని విడిచిపెట్టారా?
  2. వీలైనంత మంచిగా, సహృదయంతో ఉండటానికే ప్రయత్నిస్తాము. అయితే ఎదుటి వ్యక్తి కూడా అంతే మంచిగా (లేక అంతకన్నా ఎక్కువగా) మనతో ఉండాలని మనం ఆశించడమే సమస్యను తెచ్చిపెడుతుంది. అంతకంటే పెద్ద సమస్య ఏంటంటే, ఆ వ్యక్తి మనతో సరిగ్గా లేకపోతే మనం వారిని కాపీ చేస్తాము. ఇతరుల అపసవ్య ప్రవర్తనను మనం కాపీ చేస్తున్న ప్రతిసారీ మనం మనలోని సుగుణాల నుండి దూరంగా వెళ్ళిపోతున్నాము. చివరకు, మన సుగుణాలనే విడిచిపెట్టేస్తున్నాము.
  3. మన విలువలు, సుగుణాలు, సిద్ధాంతాలు మరియు నైతికతే మనకు బలం. వాటితో జీవిద్దాం. మన చుట్టూ ఉన్నవారు వాటిని ఉపయోగించకపోయినా కానీ, విలువలు ఎందుకూ పనికిరావు అని అందరూ అనుకున్నాగానీ మనం మాత్రం వాటిని విడిచిపెట్టకూడదు.
  4. ఇతరులలో ఉన్న సుగుణాలు మీలో ఉండకపోవచ్చు. మీలోని విలువలను ఉపయోగించండి, ప్రతిసారీ, ప్రతి ఒక్కరితో. గుర్తుంచుకోండి – వ్యక్తులకు, పరిస్థితులకు సంబంధం లేకుండా నేను నా సుగుణాలను ప్రతిసారీ, ప్రతి ఒక్కరితో ఉపయోగిస్తాను. నా విలువలు నా శక్తిశాలి వ్యక్తిత్వాన్ని చూపిస్తాయి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

17th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న జీవితంలో మనలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక జ్ఞానంతో మాత్రమే కాకుండా శక్తులతో సిద్ధపరుచుకోవాలి. చాలా సంవత్సరాల పాటు

Read More »
16th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు వివిధ రకాల సంఘటనలతో, కొన్నిసార్లు ప్రతికూలతతో నిండిన వాటితో జీవితాన్ని అనుభవం చేయడం  కష్టతరం కావచ్చు మరియు జీవితాన్ని ఒడిదుడుకుల కష్టతరమైన

Read More »
15th march 2025 soul sustenance telugu

ద్వేషం నుండి మిమ్మల్ని మీరు విముక్తి చేసుకోవడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనం అనేక విభిన్న సంబంధాల ప్రపంచంలో జీవిస్తున్నాం. ఒక అందమైన సంబంధం ఎలాంటి ద్వేషం లేని నిజమైన ఆత్మిక ప్రేమ పై

Read More »