Hin

23rd may 2024 soul sustenance telugu

May 23, 2024

మీకు భగవంతునితో బలమైన సన్నిహిత సంబంధం ఉందా?

భగవంతుడు శాంతి, ప్రేమ మరియు ఆనంద సాగరులు. ఈ అసలైన సుగుణాలు కలిగి ఉన్న ఆత్మలమైన మనం వారి పిల్లలం. మనం భగవంతునితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు, వారి నుండి ఈ సుగుణాలతో మనల్ని మనం నింపుకోవచ్చు. అందమైన సంబంధం రెండు పంక్తుల ద్వారా నిర్వచించబడింది – నేను మీవాడిని. మీరు నా వారు అని . అలాగే – నా సర్వస్వం మీదే. మీది అంతా నాదే అని . మనం నిజంగా భగవంతునికి దగ్గరగా ఉండి, వారిని చాలా దగ్గరగా అనుభవం చేసుకున్నట్లయితే, భగవంతునితో సంబంధం కూడా ఈ నాలుగు పంక్తులపై ఆధారపడి ఉంటుంది. మామూలుగా మీకు అత్యంత సన్నిహితులు ఎవరు అని ఎవరినైనా అడిగితే, చాలా మంది – నా బిడ్డ, నా జీవిత భాగస్వామి, నా తల్లిదండ్రులు, నా గురువు, నా తోబుట్టువు.. అని అంటారు. చాలా తక్కువ మంది మాత్రమే భగవంతుడు నాకు అత్యంత సన్నిహితుడు అని చెబుతారు. ఎందుకు? మన భౌతిక నేత్రాలకు వారు కనిపించకపోవడమే కారణమా? వారి ప్రేమను మనం దగ్గరుండి రుచి చూడనందుకా? వారిని ఎలా స్మరించుకోవాలో తెలియకపోవడమే కారణమా? లేక శారీరక సంబంధాలలో సులభంగా కనెక్ట్ అవగలగడం  వలనా?

భగవంతునితో బలమైన సన్నిహిత సంబంధాన్ని ఎలా నిర్మించుకోవాలి? మనం పరిశీలించుకుందాం –

  1. మన ఆధ్యాత్మిక రూపం, అసలైన ఆధ్యాత్మిక గృహం, అసలైన మరియు సహజ సుగుణాలు మరియు ప్రపంచ నాటకంలో మన పాత్ర గురించి జ్ఞానాన్ని పొందుదాం.
  2. భగవంతుని పేరు, ఆధ్యాత్మిక రూపం, ఇల్లు, గుణాలు మరియు విశ్వనాటకంలో పాత్ర యొక్క జ్ఞానాన్ని స్వీకరించి లోతుగా అర్థం చేసుకుందాం.
  3. పైన పేర్కొన్న రెండు జ్ఞాన పాయింట్ల ఆధారంగా మరియు అపారమైన ప్రేమతో మీరు భగవంతునికి, భగవంతుడు మీకు చాలా సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నట్టు లోతుగా అనుభవం చేసుకోవటం మూడవ దశ.
  4. తదుపరి దశ మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యలను భగవంతుని కోరిక ప్రకారం ఉంచటం. ఇది మీ వద్ద ఉన్నదంతా వారికి ఇవ్వడం అవుతుంది. వారు తిరిగి శాంతి, ప్రేమ మరియు సంతోషం యొక్క బహుమతులతో మిమ్మల్ని నింపుతారు. ఇది వారితో మీ సంబంధాన్ని అందంగా మరియు సన్నిహితంగా చేస్తుంది.
  5. చివరి దశ శాంతి, ప్రేమ మరియు ఆనందాన్ని ప్రసరింపజేయడం మరియు మీ ప్రతి మానవ సంబంధానికి, పాత్రకు భగవంతుని సుగుణాలతో రంగులు వేయడం.

 

బ్రహ్మా కుమారీలు ఈ ఈశ్వరీయ జ్ఞానాన్ని ఇస్తారు, ఈ జ్ఞానం మీ జీవితంలో భగవంతునితో బలమైన సన్నిహిత సంబంధం ఏర్పడటానికి ముఖ్య భూమికను పోషిస్తుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

8th october 2024 soul sustenance telugu

ఆలోచనలపై ప్రతికూల ప్రభావాలను అధిగమించడం (పార్ట్ 1)

మన ఆలోచనలు వివిధ రకాలు, వివిధ తీవ్రతలను కలిగి ఉంటాయి. వాటి సంఖ్య  కూడా మెలకువగా ఉన్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఆ నిర్దిష్ట సమయంలో మనం ఏ చర్య చేస్తున్నాం లేదా

Read More »
7th october 2024 soul sustenance telugu

వైఫల్యాలను సులభంగా అంగీకరించడం

మనం ఎంత కష్టపడినా కొన్నిసార్లు విఫలమవుతాము అనేది జీవితంలో ముఖ్యమైన పాఠాలలో ఒకటి. మనం వైఫల్యాలు, లోపాలను మన ప్రయాణంలో భాగంగా పరిగణించి అంగీకరించాలి. మనలో చాలా మంది జీవితంలో వైఫల్యాలకు భయపడతాము .

Read More »
6th october 2024 soul sustenance telugu

నిర్లిప్తంగా ఉండి, గమనించి మరల్చుకోండి

మన జీవితాలు ఎప్పటికప్పుడు వివిధ రకాల పరిస్థితులతో నిండి ఉంటాయి. మనం తరచుగా పరిస్థితుల వల్ల ప్రతికూలంగా ప్రభావితమవ్వడంతో మన ఆంతరిక శక్తి తగ్గుతుంది. నిర్లిప్తంగా ఉండి, గమనించి మరల్చుకోవటం అనేది ఆధ్యాత్మికత యొక్క

Read More »