HI

1st jan 2024 soul sustenance telugu

January 1, 2024

మీకు మీరు చేసుకునే 5 క్రొత్త సంవత్సర వాగ్దానాలు

  1. ఆత్మ సౌందర్యం,   అందరి ఆత్మ సౌందర్యం మరియు ప్రకృతి యొక్క సౌందర్యాన్ని నేను అనుభూతి చెందుతాను.  ఈ సంవత్సరంలో ప్రతిరోజూ నేను ఈ సంకల్పం చేస్తాను నేను చాలా ప్రత్యేకమైన ఆత్మను, అనేక ప్రత్యేకతలు మరియు గుణాలతో నిండి ఉన్నాను, నేను కలిసే వారందరూ మంచిగా మరియు ప్రత్యేకంగా ఉంటారు. స్వచ్ఛత మరియు సౌందర్యంతో నన్ను ఆశీర్వదించిన ప్రకృతికి నేను కృతజ్ఞుడను.
  2. నేను గత సంవత్సరంలోని మంచి విషయాలను మాత్రమే గుర్తుంచుకొని రాబోయే సంవత్సరంలో ప్రతి క్షణం వాటిని ప్రేమగా ఆనందిస్తాను. నేను చాలా స్థిరంగా మరియు శక్తివంతంగా ఉన్నాను; అడుగడుగునా జీవితం అందంగా ఉంది. నెగెటివ్ సన్నివేశాలు నాకు గురువులు, అవి నన్ను శక్తివంతం చేస్తాయి, నేను వాటిని సులభంగా మరియు కృతజ్ఞతా  భావంతో అంగీకరిస్తాను అని ఎల్లప్పుడూ అనుభూతి చెందుతాను.
  3. ఈ సంవత్సరంలో జరిగే ప్రతి పరస్పర చర్య సానుకూలత, సామరస్యం మరియు లక్ష్యంతో నిండి ఉండనివ్వండి. శాంతి, ప్రేమ, ఆనందం, శక్తి మరియు ఉత్సాహాలను అందరికీ బహుమతిగా ఇవ్వండి. మీ ముఖం మరియు చర్యలు అందరికీ మంచితనం మరియు పరిపూర్ణతను ఇచ్చి వారిని ఆధ్యాత్మికంగా మీకు దగ్గరగా తీసుకువచ్చి మీ సంబంధాలను అందంగా మార్చుకోండి.
  4. రాబోయే సంవత్సరం ఎందుకు, ఎలా, ఎప్పుడు మరియు ఏమిటి అనే ప్రశ్నలు లేకుండా గడపాలి.  ఎందుకు (why) అని వచ్చినప్పుడు ఆనందంతో ఎగిరిపో (fly in joy) అని అనుకోండి. ఎలా(how) అని వచ్చినప్పుడు మనకంటే భగవంతునికి బాగా తెలుసు అని అనుకోండి. ఎప్పుడు (when) అని వచ్చినప్పుడు సరైన సమయంలో సరైనది వచ్చింది అని అనుకోండి. ఏమిటి (what) అని వచ్చినప్పుడు, దీని ప్రయోజనం త్వరలో తెలుస్తుంది అని అనుకోండి. 
  5. ఈ సంవత్సరం భగవంతుడిని మీ బెస్ట్ ఫ్రెండ్‌గా చేసుకోండి. వారితో ప్రతిరోజూ సర్వ సంబంధాలు అనుభూతి చేసుకోండి. భగవంతుడిని తల్లిగా, తండ్రిగా, గురువుగా, మరియు తోడునీడగా కలిగి ఉన్న ప్రపంచంలోనే అత్యంత అదృష్ట ఆత్మను నేను. ఈ నూతన సంవత్సరంలోని ప్రతి సన్నివేశానికి భగవంతుని ప్రియస్మృతుల రంగును వేస్తాను అని మీరు ప్రతిరోజూ వారితో మాట్లాడండి.

 

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

19th feb 2024 soul sustenance telugu

గతం నుండి నేర్చుకుందాం

మీరు మీ జీవితంలో వెనక్కి తిరిగి చూసినప్పుడల్లా నిజాయితీగా గతంలో చేసిన పొరపాట్ల నుండి ఏమైనా నేర్చుకున్నారా లేక కేవలం గతంలోనే ఆగిపోతున్నారా? చివరకు గతాన్ని వృధాగా తలుచుకుంటూ చాలా తక్కువ నేర్చుకోవడం జరుగుతుందా?

Read More »
18th feb 2024 soul sustenance telugu

ఆపేక్షలను విడిచిపెట్టండి

మీ సహోద్యోగి సమయానికి ప్రాజెక్టును పూర్తి చేయడంలో మీరు ఎప్పుడూ సహాయం చేస్తూనే వచ్చారు, కానీ ఒక్కసారి మీరు అతడిని సహాయం అడిగితే అతను నిరాకరించాడు. మీరు ఇంటికి చేరుకునేసరికి బాగా అలసిపోయారు. మీ

Read More »
17th feb 2024 soul sustenance telugu

దూకుడు స్పందనలను సమర్థించవద్దు

కొన్ని సందర్భాలలో మన మాటలను, ప్రవర్తనను నియంత్రించుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది, అలాంటప్పుడు మనం దూకుడుగా స్పందించేస్తుంటాం. అప్పుడు మన పొరపాటును అంగీకరించకపోగా, తరచూ మన స్పందనను సమర్థించుకుంటూ ఉంటాము. ఈరోజుల్లో మన పాత్రలు

Read More »