Hin

30th jan 2024 soul sustenance telugu

January 30, 2024

మీరు ఏది విశ్వసిస్తారో అది సాధిస్తారు

జీవిత ప్రయాణంలోని నమ్మకాలన్నీ ఎక్కడ నుండి వచ్చాయని మీరు ఆశ్చర్యపోతున్నారా? మీరు సంతోషం, ప్రేమ, గౌరవం, కోపం లేదా ఒత్తిడి గురించి ఏది నమ్మినా అవి ఎక్కువగా మీ సామాజిక కండిషనింగ్ ఆధారంగా మీపై తయారు చేసుకున్నవి. మీరు ఎప్పుడైనా కాసేపు ఆగి, సరైనది అంగీకరించడానికి , సరికానిది వదిలేయడానికి పరిశీలించారా? ప్రతి పరిస్థితిని మన నమ్మకాలను బట్టి గ్రహిస్తుంటాము. మన ఆలోచనలు, భావాలు, వైఖరి, అలవాట్లు, వ్యక్తిత్వం మరియు చివరకు మన భాగ్యం మన జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. దీని అర్థం, మన నమ్మకాల ఆధిపత్య ప్రభావం మన భాగ్యం పై ఉంటుంది.

 

మనం ఒక్క తప్పుడు నమ్మకాన్ని కూడా కలిగి ఉండకూడదు. సమాజం పరిమితం చేసే నమ్మకాలను వ్యాప్తి చేస్తుంది: కోపం అవసరం, విజయం సాధించడంలో ఆనందం ఉంది, ఒత్తిడి సహజం, వ్యక్తులు మరియు పరిస్థితులు నేను ఎలా భావిస్తున్నానో నిర్ణయిస్తాయి మొదలైనవి. కోపం అవసరమని నమ్మి, కోపాన్ని పదే పదే ఉపయోగించాము. కాబట్టి మనం శాంతియుతంగా ఉండాలనుకున్నా అది తాత్కాలికమే. కొత్త నమ్మకంతో ప్రయోగాలు చేయండి: కోపం హానికరం, పనిని పూర్తి చేయించడానికి మార్గం ప్రేమనే. ఈ నమ్మకం ప్రేమ మరియు ఆనందాన్ని సహజం చేస్తుంది. తప్పుడు నమ్మకాల పొరలను సాధికారతతో భర్తీ చేద్దాం. మీకు మీరు గుర్తు చేసుకోండి: నేను ప్రతి నమ్మకం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని, ప్రయోజనకరమైన వాటిని స్వీకరిస్తాను. నా నమ్మకాలన్నీ నన్ను సంతోషంగా, ఆరోగ్యంగా మరియు నా ప్రపంచంతో సామరస్యంగా ఉంచుతాయి.

మీరు చిన్నతనం నుండి ఎన్ని నమ్మకాలను స్వీకరించి జీవించారో ఎప్పుడైనా ఆగి పరిశీలించుకున్నారా? మీరు మీ గురించి, ఇతరుల గురించి లేదా ప్రపంచం గురించిన నమ్మకాలను, వాటిని సొంతం చేసుకునే ముందు వాటి ప్రాముఖ్యతను తెలుసుకున్నారా? లేదా మీరు మీ కుటుంబం, విద్య, సమాజం లేదా మీ గత అనుభవాల ద్వారా మీ మనస్సులో నింపిన నమ్మకాలను అంగీకరిస్తారా? మన నమ్మకాలే మనకు పరమ సత్యాలు. నమ్మకాలను కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పోల్చవచ్చు. అవి మన జీవితాన్ని నడిపిస్తున్నాయి – మన ఆలోచనలు, మాటలు మరియు ప్రవర్తన. ఒక్క తప్పుడు నమ్మకం ఉన్నా అది చాలా హాని చేయగలదు. అందమైన జీవితాన్ని గడపకుండా మనల్ని అడ్డుకునే పరిమిత, తప్పుడు నమ్మకాలను మనం మనసులో పరిశీలించుకుని మార్చుకుందాం. కాసేపు కూర్చుని, మీ స్వంత ఎదుగుదల, శ్రేయస్సు మరియు విజయానికి అడ్డంకులుగా ఉన్న నమ్మకాలను పరిశీలించుకుని తొలగించుకోవడానికి  మీ మనస్సును సిద్ధం చేసుకోండి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

24th jan 2025 soul sustenance telugu

ఇతరుల సంతోషాన్ని ఆనందించడం

ఇతరులు మీ కంటే మెరుగ్గా పనిచేస్తున్నప్పుడు, మీరు ఇంకా అక్కడికి చేరుకోనప్పుడు మీరు వారి కోసం నిజంగా సంతోషిస్తారా లేదాపై పైన సంతోషిస్తారా  లేదా అస్సలు సంతోషించరా? లోలోపల  మీరు సంతోషంగా ఉండాలని కోరుకున్నా

Read More »
23rd jan 2025 soul sustenance telugu

పరీక్షలను ఎదుర్కోవడంలో విజయానికి 8 సూత్రాలు (పార్ట్ 3)

పరీక్షలను ఎదుర్కొంటున్నప్పుడు, చదివే సమయంలో దృష్టి కేంద్రీకరించే మీ సామర్థ్యాన్ని మరియు ఏకాగ్రతని ఎల్లప్పుడూ తనిఖీ చేయండి. నేను అధ్యయనం పూర్తి చేయడానికి లేదా నా కోర్సులో ఒక అధ్యాయాన్ని సవరించడానికి చాలా సమయం

Read More »
22nd jan 2025 soul sustenance telugu

పరీక్షలను ఎదుర్కోవడంలో విజయానికి 8 సూత్రాలు (పార్ట్ 2)

పరీక్షల సమయంలో  లేదా జీవితంలో ఏదైనా సవాలును ఎదుర్కొంటున్నప్పుడు స్థిరంగా ఉండటానికి చాలా ముఖ్యమైన మార్గం అంతర్గత శాంతి, శక్తి , స్థిరత్వంతో నిండిన కొన్ని సానుకూల ఆలోచనలను చేస్తూ రోజులో కొన్ని సార్లు

Read More »