Hin

30th jan 2025 soul sustenance telugu

January 30, 2025

మీరు ఏ అలవాటునైనా మార్చుకోవచ్చు

మీకు చిన్నప్పటి నుండి ఈ అలవాటు ఉంది, మీరు ఇక ఎప్పటికీ మారరు అని మీరు ఎవరినైనా అన్నారా? లేదా ఎవరైనా మిమ్మల్ని అన్నారా? ఒక అలవాటును మార్చడం కష్టం లేదా అసాధ్యం అని మీరు నమ్ముతున్నారా, ముఖ్యంగా అది బలమైనది, పాతది అయితే? మొదట, నేను అలవాట్లను మార్చుకోలేను అని చెప్పే మన అలవాటును మార్చుకోవాలి. ఏదైనా అనారోగ్యకరమైన లేదా అసౌకర్యకరమైన అలవాటును ఖచ్చితంగా మార్చవచ్చు. ఆలస్యంగా వచ్చే అలవాటు … గాసిప్ చేసే అలవాటు… చిరాకుగా ఉండే అలవాటు… అల్పాహారాన్ని తీసుకోకుండా ఉండే పాత అలవాట్లున్నాయి, కాబట్టి నేను మార్చుకోలేను అని చెప్పకండి. మనం పదే పదే చేసే ప్రతిదీ మన అలవాటు అవుతుంది. ఇప్పుడు కొన్ని సార్లు నివారించడం లేదా మార్చడం ద్వారా, పాత అలవాటు ముగుస్తుంది. మనం ఇంతకుముందు విఫలమైనప్పటికీ దానిపై నిరంతరం కృషి చేయాలి. మనం వదిలేస్తే, అది బలంగా మారి మన సంకల్ప శక్తి బలహీనపడుతుంది. మన అసౌకర్య అలవాట్లను ఎదుర్కొందాం, మనల్ని మనం ప్రశ్నించుకుందాం – నేను ఈ అలవాటును ఎందుకు మార్చుకోవాలి? ఎలా మార్చాలి? నేను మారాలనుకుంటున్నానా?  ఒకసారి మనం మారాలనే కోరిక బలంగా ఉందంటే, మార్పు సులభం అవుతుంది. 

 

ఒక్క అలవాటును కూడా ఎన్నడూ మార్చుకోని వ్యక్తి ఎవరైనా మీకు తెలుసా? ఖచ్చితంగా ఆలా ఎవరూ లేరు కదా. మనలో ప్రతి ఒక్కరూ కొన్ని అలవాట్లు చేసుకొని, కొన్ని కారణాల వల్ల వాటిని మార్చుకున్నారు. మనం అలవాట్లను మార్చలేము అనే తప్పుడు నమ్మకం ప్రతికూల అలవాట్లను బలోపేతం చేస్తూ మన పరివర్తనను అడ్డుకుంటుంది. ప్రశాంతంగా కూర్చొని మీరు మీ అలవాట్లను ఎలా నియంత్రిస్తారో చెక్ చేసుకోండి, మీ అలవాట్లు ఇకపై మిమ్మల్ని నియంత్రించవు. మీరు పదేపదే పరిశీలించుకొని, మీ వాస్తవికత ఎలా ఉండాలనుకుంటున్నారో అనే ఆలోచనలను సృష్టించినప్పుడు, మీ సంకల్ప శక్తి పెరుగుతుంది. అప్పుడు మీరు అసౌకర్య అలవాట్లు, ఆధారపడటాన్ని మరియు వ్యసనాలను వదిలివేస్తారు. మీ మనసులో ఏముందో మీరు సులభంగా ఎంచుకోగలుగుతారు. మీరు మార్చుకోలేని అలవాటు మీలో ఉండదు. ఎక్కువ టీ, కాఫీ తాగడం లేదా తినేటప్పుడు టీవీ చూడటం వంటి చిన్న అలవాట్లు మాత్రమే కాకుండా మీరు లోతైన వ్యసనాలను అధిగమించవచ్చు. చివరికి మీరు ఎలా కావాలనుకుంటున్నారో మీరు అలా అవుతారు.

రికార్డు

20th march 2025 soul sustenance telugu

సంబంధాల్లో కలిగే బాధ నుండి విముక్తిని పొందడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలోని వివిధ రంగాలలో వేర్వేరు సంబంధాలలోకి వచ్చినప్పుడు, కొన్నిసార్లు మన అంతర్గత ప్రపంచంలోకి మరొక ఆత్మను అనుమతించినప్పుడు, మనల్ని వారు అర్థం

Read More »
19th march 2025 soul sustenance telugu

జీవితంలోని వివిధ దృశ్యాలలో సాకులు చెప్పడం మానుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలా మంది మన విశ్వసనీయతను కాపాడుకోవడానికి, ఇతరులపై లేదా పరిస్థితులపై నిందలు వేయడానికి సాకులు చెబుతారు. కొన్నిసార్లు మనకు, మన

Read More »
18th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు అంతర్గత బలం యొక్క సానుకూల సంస్కారాలను సృష్టించడానికి, మనం ముందుగా పట్టుదల యొక్క మొదటి అడుగు వేయాలి. పట్టుదల అంటే నేను

Read More »