Hin

30th nov 2023 soul sustenance telugu

November 30, 2023

మిమ్మల్ని మీరు ఎలా ఆశీర్వదించుకోవాలి?

మన జీవితంలో సాధువులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కుటుంబం మరియు స్నేహితుల ఆశీర్వాదాల శక్తిని మనమందరం పొందాము . ఆశీర్వాదం అంటే వారందరూ మన ఆనందం, ఆరోగ్యం, సామరస్యం మరియు విజయం కోసం చేసిన స్వచ్ఛమైన ఆలోచనలు, ఉపయోగించిన పదాలు. వారి వైబ్రేషన్స్ మన మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి, మన వైబ్రేషన్స్ ను ఉన్నతంగా చేసి మన భాగ్యాన్ని మారుస్తాయి. ఇతరుల ఆశీర్వాదం మన జీవితంలో అద్భుతాలను సృష్టించగలిగితే, మనల్ని మనం ఎందుకు ఆశీర్వదించుకోకూడదు?

 

మీరు చిన్నప్పటి నుండి భగవంతుడు నిన్ను ఆశీర్వదిస్తున్నారు, ఆల్ ది బెస్ట్, మీరు కోరుకున్నవి జరుగాలని  ఆశీర్వదిస్తున్నాము అని ఆశీస్సులు పొంది ఉండవచ్చు. పెద్దలు, సాధువులు లేదా మీరు ఎంతో గౌరవించే వారి ఆశీర్వాదం కోసం మీరు చాలా దూరం ప్రయాణించి ఉండవచ్చు. మీకు మీరు దీవెనలు అందించుకోగలరని ఎప్పుడైనా ఆలోచించారా? మనమందరం ఆశీర్వాదాలను పొందాము మరియు దాని శక్తిని అనుభవం చేసుకున్నాము. ఆశీర్వాదం దానంతట అదే మన పరిస్థితుల్లో అద్భుతాలను సృష్టించదు. ఇది మొదట మన మనస్సును అధిక వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీకి మార్చడం ద్వారా మన మనస్సులో ఒక అద్భుతాన్ని సృష్టిస్తుంది. ఇలా ఇప్పుడే శక్తివంతమైన మన మనసు ఆశీర్వాదాన్ని కార్యం లోకి వస్తుంది. మనలో చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, మనల్ని మనం (మరియు ఇతరులను) ఆశీర్వదించుకోవడానికి మనం అర్హులము. మన ప్రతి ఆలోచన మరియు మాట, అయితే అది మనకు ఆశీర్వాదం కావచ్చు లేదా శాపం కావచ్చు. సందేహం, భయం, వైఫల్యం లేదా ఆందోళన వంటి తక్కువ శక్తితో కూడిన ఆలోచనలు, పదాలు మనకు శాపాల్లా అయ్యి విజయాన్ని అడ్డుకుంటాయి. ఆశీర్వాదాల భాషకు మారుదాం. మీ అంతర్గత మరియు బాహ్య సంభాషణలలో స్వయం గురించి ఏదైనా తక్కువ వైబ్రేషన్ ఆలోచన మరియు మాటను చెక్ చేసుకొని, దానిని ఆశీర్వాదంగా మార్చండి. మీకు మీరే గుర్తు చేసుకోండి – నన్ను నేను ఆశీర్వదించుకుంటాను. నేను కోరుకున్న వాస్తవికత యొక్క శక్తిని నేను ప్రసరిస్తాను. నా ఆలోచన మరియు మాట నాకు మరియు నేను చేసే పనికి ఒక ఆశీర్వాదం.

 

మిమ్మల్ని మీరు ఆశీర్వదించుకోవడానికి, మీరు ఎవరో గుర్తించడానికి, మీరు ఎలా తయారు అవుతున్నారని సంతోషించడానికి ఈ పాజిటివ్ సంకల్పాన్ని కొన్ని సార్లు రిపీట్ చేయండి. మీరు మెళ్లిగా మరింత స్వయం-సమృద్ధిగా, ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మీ ఆశీర్వాదాలు మీలోని ప్రతికూలతను తొలగిస్తాయి మరియు మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తుల నుండి మిమ్మల్ని రక్షిస్తాయి. మీకు మీరే గుర్తు చేసుకోండి – నా రోజువారీ ఆధ్యాత్మిక సాధనలో నన్ను నేను ఆశీర్వదించుకోవడం ఒక ముఖ్యమైన భాగం. నన్ను నేను ఎంతగా ఆశీర్వదించుకుంటున్నానో, నన్ను నేను ఆశీర్వదించే వాటిని నేను ఎక్కువగా ఆకర్షిస్తాను.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

17th june2024 soul sustenance telugu

పోటీ పడటం మానండి… ఈ క్షణాన్ని ఆస్వాదించండి (పార్ట్ 1)

ప్రతి ఆత్మ సంతోషాన్ని కోరుకుంటుంది. సంతోషంగా ఉండటం కోసం సంతోషాన్ని వెతుకుతుంటాము. ఆరోగ్యం, అందం, ధనము, పాత్ర వంటి ఇతర గమ్యాలు కూడా విలువైనవే ఎందుకంటే అవి మనకు సంతోషాన్నిస్తాయి అని మనం భావిస్తాము.

Read More »
16th june2024 soul sustenance telugu

 దేవీ దేవతల 36 దివ్య గుణాలు

నిన్నటి సందేశంలో, దేవీ దేవతలలో ఉన్న 36 దివ్య గుణాలను ప్రస్తావించాము. మనం పరిపూర్ణంగా, స్వచ్ఛంగా మరియు ప్రశంసనీయంగా తయారవ్వటానికి మనలో ప్రతి గుణం చెక్ చేసుకొని ధారణ చేద్దాము. ఈ గుణాలన్నింటినీ మనం

Read More »
15th june2024 soul sustenance telugu

దేవి దేవతల 5 అర్హతలు

కలియుగం (ఇనుప యుగం) చివరిలో మరియు సత్యయుగం (స్వర్ణయుగం) ప్రారంభానికి ముందు, మానవాళికి రాత్రి మరియు మానవాళికి పగలు మధ్య ఉన్న ప్రస్తుత సంగమయుగంలో భగవంతుడు మానవులను దేవీ దేవతలుగా మారుస్తున్నారు. దేవీ దేవతలకు

Read More »