Hin

21st may 2024 soul sustenance telugu

May 21, 2024

మిమ్మల్ని మీరు మార్చుకోవాలని లోతుగా అనుకుంటున్నారా?

చాలా సార్లు, మనం మన స్వపరివర్తన లక్ష్యాలపై ముందుకు వెనుకకు ఊగిసలాడుతూ ఉంటాము . ఏదైనా తప్పు జరిగినప్పుడు మనం పైపై మార్పులు చేస్తూ ఉత్సాహంగా మొదలుపెడతాము. చాలా వరకు మన దృష్టి ఏమి మార్చాలి, ఎలా మార్చాలి అనే దానిపైనే ఉంటుంది. కానీ ఒక బలమైన కోరిక లేదా మారాలని లోతైన కోరిక ఉంటే తప్ప, పరివర్తన సాధ్యం కాదు. మనం చాలా సార్లు అంటుంటాం – నాలోని ఈ అలవాటును నేను ముగించాలిఈ ప్రవర్తనను మార్చుకోవాలి.… కానీ మన ఉపచేతన మనస్సులో లోతుగా, మనం ఒక సూక్ష్మమైన ఆలోచనను ఇలా చేసి ఉంటాము – నేను ఎలా ఉన్నానో అలా బాగానే ఉన్నాను. కాబట్టి, పరివర్తన కోసం మనస్సులో లోతైన కోరిక ఉండే వరకు, మనం బాగా అభివృద్ధి చెందలేము.

  1. మీరు ఎందుకు మార్చుకోవాలనుకుంటున్నారో మీరే ప్రశ్నించుకోండి. మీ అలవాట్లు లేదా ప్రవర్తనతో మరొకరు సంతోషంగా లేకపోవడమే దీనికి కారణమా? లేదా మీరు పరివర్తన చేసుకోవాలనుకుంటున్నారా? ఇది మీ కోరిక కాకపోతే, సంభవించే మార్పులు తాత్కాలికం మాత్రమే.
  2. మార్చుకోవాలనే మీ కోరికను తీవ్రతరం చేయండి. అన్నింటిలో మొదటిది, పాత ప్రవర్తనలు లేదా అలవాట్లను సమర్థించడం మానేయండి. తర్వాత, అవి మీకు మరియు మీ చుట్టూ ఉన్న ఇతర వ్యక్తులకు ఎలా హాని చేస్తున్నాయో అంచనా వేయండి. మూడవదిగా, పరివర్తన తెచ్చే ప్రయోజనాల లిస్ట్ ను వ్రాయండి. మార్చుకోవాలనే కోరిక ఏర్పడే వరకు ప్రతిరోజూ వాటిని పొందుపరచుకోండి.
  3. ప్రతి ఉదయం ధ్యానం చేయండి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అధ్యయనం చేయండి. మనస్సు సరైన ఆలోచనను పెంపొందిస్తుంది మరియు బుద్ధి జ్ఞానంలో లోతుగా వెళ్తుంది. మీరు పరివర్తన చెందడానికి అవసరమైన అంతర్గత శక్తిని కలిగి ఉంటారు. మీరు నిజంగా మార్చుకోవాలనుకుంటే, ఎందుకు, ఎలా మార్చుకోవాలి అనేది చాలా సులభం అవుతుంది.
  4. మీరు మీలో తీసుకురావాలనుకుంటున్న మార్పును ధృవీకరణను చేసుకోండి. మీ మనస్సు ఆ దిశగా ఆలోచనలను సృష్టించిన తర్వాత, మీ బుద్ధి అంచనా వేసి నిర్ణయం తీసుకుంటుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. చర్యను మళ్లీ మళ్లీ చేస్తూ ఉంటే అది మీ అలవాటు అవుతుంది. ఆ తర్వాత కొత్త అలవాటు లేదా ప్రవర్తన మీ వ్యక్తిత్వంలో భాగమవుతుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

8th feb 2025 soul sustenance telugu

ఇతరులకు నిరంతరం ఇస్తూ ఉండండి (పార్ట్ 1) 

ఎమోషనల్ ఓదార్పు మరియు శక్తిని ఇవ్వడం   మన జీవితమంతా మనకు తెలిసిన వ్యక్తులకు మరియు మనకు తెలియని వ్యక్తులకు కూడా సేవ చేస్తాము. ఎందుకంటే ఇవ్వడం, సేవ చేయడం మన సహజ లక్షణాలు.

Read More »
7th feb 2025 soul sustenance telugu

అంతర్గత శాంతి మరియు ఆనందం కోసం ఇంట్లో ఒక పవిత్ర స్థలాన్ని ఏర్పాటు చేసుకోవటం

ధ్యానం కోసం ఇంట్లో ప్రత్యేకమైన, ఉన్నతమైన తరంగాల గది లేదా చోటును ఏర్పర్చుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. మనము అంతర్గత శాంతి, ఆనందం కోసం ఉన్నత ఆధ్యాత్మిక శక్తి గల ప్రదేశాలకు వెళ్తాము. మనం మానసికంగా

Read More »
6th feb 2025 soul sustenance telugu

మనం స్వీయ నియంత్రణను ఎందుకు కోల్పోతున్నాము?

మనం ఎందుకు, ఎలా స్వీయ నియంత్రణను కోల్పోతామో అన్వేషిద్దాం. గాలిలోని కాలుష్య కారకాల గురించి మనకు తెలుసు, కానీ మరొక సూక్ష్మమైన మరియు కీలకమైన భాగం ఉంది, దానిని మనం చూడలేము కాని మనం

Read More »