Hin

19th jan 2025 soul sustenance telugu

January 19, 2025

మిమ్మల్ని విమర్శించే వ్యక్తులపై దృష్టి పెట్టవద్దు

మనం లేదా మనం చేసే పనికి మనల్ని ఇష్టపడని వ్యక్తులు ఎల్లప్పుడూ ఉంటారు. వారి గురించి మనకు తెలిసినప్పటికీ, వారిపై దృష్టి పెట్టవలసిన అవసరం లేదు. మనకు మద్దతు ఇచ్చి, సానుకూల శక్తిని పంపే వ్యక్తులపై మనం దృష్టి పెట్టాలి.

 

  1. మీ కుటుంబ సభ్యులు చాలా మంది మీ విజయానికి మిమ్మల్ని అభినందిస్తారు, కానీ కొందరికి అసూయగా అనిపిస్తుంది. పది మంది స్నేహితులు మీ కొత్త కారును మెచ్చుకుంటారు, కానీ ఇద్దరు పొరుగువారు దానిని విమర్శిస్తారు. మీ బృంద సభ్యులందరూ మీ కొత్త ప్రాజెక్ట్ ఆలోచనకు మద్దతు ఇస్తారు, కానీ ఎవరో ఒక సహోద్యోగి మాత్రం దానిని ఎగతాళి చేస్తారు. మీ దృష్టి ఎక్కడికి వెళుతుంది-మీకు మద్దతు ఇచ్చే మెజారిటీ వైపా , లేదా మిమ్మల్ని విమర్శించే మైనారిటీ వైపా?

 

  1. అందరూ మనల్ని ఇష్టపడరు. ఇది మన ప్రస్తుత జీవితాల వాస్తవికత. మిమ్మల్ని సంతోషంగా లేదా విజయవంతంగా చూస్తే అసౌకర్యంగా ఉండే కొందరు వ్యక్తులు ఎల్లప్పుడూ ఉంటారు. వారికి వారి కారణాలు ఉంటాయి-వారి అసూయ, అభద్రత, బాహ్య ప్రభావాలు, వైఫల్యాలు లేదా బలహీనతలు మీ పట్ల ప్రతికూల ఆలోచనలను సృష్టించడానికి మరియు మీతో తప్పుగా ప్రవర్తించడానికి వారిని ప్రేరేపిస్తాయి. 

 

  1. మిమ్మల్ని ఆమోదించని వ్యక్తుల గురించి పదేపదే ఆలోచించడం లేదా మాట్లాడటం మీలో భయం, కోపం మరియు బాధని కలిగిస్తుంది. మీరు బలహీనంగా అయ్యి మీరు వారి ప్రతికూలతను వినియోగించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వారిని అర్థం చేసుకుని, వారి కోసం స్వచ్ఛమైన ఆలోచనలను సృష్టించండి. మీ కరుణ మీకు రక్షణ కవచంగా మారుతుంది.

 

  1. కొంతమంది మీకు ప్రతికూల శక్తిని పంపినప్పటికీ, మీకు ఎల్లప్పుడూ ఆశీర్వాదాలు మరియు స్వచ్ఛమైన శక్తిని పంపే వ్యక్తులు చాలా మంది ఉన్నారని గుర్తుంచుకోండి. వారి సానుకూల శక్తిపై మీ దృష్టిని కేంద్రీకరించండి, తద్వారా ఆ కొన్ని ప్రతికూల కంపనాల ప్రభావం వాటంతట అవే రద్దు అవుతుంది.

రికార్డు

10th july 2025 soul sustenance telugu

నా భాగ్యానికి ఎవరు బాధ్యులు?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలామంది భగవంతుడు మన భాగ్యాన్ని వ్రాస్తాడని నమ్ముతాము. ఈ నమ్మకం గురించి  మనం ఆలోచించి ఆత్మపరిశీలన చేసుకోవాలి. భగవంతుడు మన

Read More »
9th july 2025 soul sustenance telugu

ఆరోగ్యకరమైన వర్క్-లైఫ్ బ్యాలన్స్ ను సాధించడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితం ఒక ప్రవాహంవంటిది, కనుక, మనం మన బాధ్యతల ప్రాధాన్యతలను మారుస్తూ ఉండాలి, మనకు మద్దతు ఇచ్చే జీవితంలోని అన్ని అంశాల

Read More »
8th july 2025 soul sustenance telugu

ప్రేమను ఆపేక్షలతో సమానం చేయకండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన స్వభావాలు, విలువలు, లక్ష్యాలకు అనుగుణంగానే ఇతరులు ప్రవర్తించాలని మనం సాధారణంగా కోరుకుంటాం. ఎవరైనా మన అంచనాలకు తగ్గట్లుగా ఉంటే, వారు

Read More »