Hin

25th feb 2025 soul sustenance telugu

February 25, 2025

మిమ్మల్ని మీరు నెగిటివ్ గా లేబుల్ చేసుకోకండి

అందరూ తమ వ్యక్తిత్వం మరియు అవగాహనల ఫిల్టర్ ద్వారా మనల్ని చూసినట్లే, మనం స్వయంపై పెట్టుకొనే కొన్ని లేబుల్‌ల ద్వారా కూడా మనల్ని మనం చూసుకుంటాము. నేను సోమరిని, నాకు అజాగ్రత్త ఉంది వంటి నెగిటివ్ లేబుల్‌లను అంటిస్తే అది మన గుర్తింపులో మరియు నమ్మకంలో భాగం అవుతుంది. మన వైబ్రేషన్స్ మన వాస్తవికతను సృష్టిస్తాయి మరియు మనలో ఆ ప్రవర్తనను తీవ్రం చేస్తాయి. మీరు మీ ప్రదర్శన, నేపథ్యం, వ్యక్తిత్వం లేదా విజయాల ఆధారంగా మీరు ఎవరో – లేదా మీరు ఎవరు కాదనే దాని గురించి మీరే లేబుల్ చేసుకోవాలని ఎంచుకుంటున్నారా? ఇతర వ్యక్తులు మీకు ఇచ్చే  లేబుల్‌ల ద్వారా మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారా? మీరు కాసేపు ఆగి, ఎన్ని లేబుల్‌లు నెగిటివ్ గా ఉన్నాయో చెక్ చేయగలరా? మీపై ఉంచిన లేబుల్‌లు మీ వ్యక్తిత్వం, మీ గుర్తింపు యొక్క విభిన్న కోణాలను జోడిస్తాయి. అంటే మనల్ని మనం నెగిటివ్ గా లేబుల్ చేసుకుంటే, మన మనస్సు మరియు శరీరం ఆ నెగిటివ్ లేబుల్‌తో ప్రతిస్పందిస్తాయి మరియు జీవిస్తాయి. వాటిని పునరావృతం చేయడం వల్ల అవి దృఢమైన సంకల్పాలు గా అవుతాయి, ఆ పదాలను పునరుద్ఘాటిస్తుంది, ఆ వైబ్రేషన్స్ ను ప్రసరింపజేస్తుంది మరియు అవి మన వాస్తవికతగా మారే అవకాశాలు పెరుగుతాయి. మన లేబుల్‌లు మన భాగ్యాన్ని సృష్టిస్తాయి. 

మన దగ్గర ఉన్న ప్రతి నెగిటివ్ లేబుల్‌ను స్వచ్ఛమైన, శక్తివంతమైన, పాజిటివ్ లేబుల్‌తో భర్తీ చేసుకుందాం. మనము వాటిని మన పదజాలంగా చేద్దాం, ఆ పాజిటివ్ లేబుల్‌లు మన గుర్తింపుగా మారే వరకు వాటిని కొన్ని రోజుల పాటు స్థిరంగా రిపీట్ చేద్దాం. మనకు కావలసిన వాస్తవికతను సృష్టించడానికి, పాజిటివ్ స్వీయ-లేబుల్‌లను మాత్రమే కేటాయించడం ప్రారంభిద్దాము. మిమ్మల్ని మీరు గుర్తు చేసుకోండి – నేను నన్ను మాత్రమే మరియు పాజిటివ్ పదాలతో మాత్రమే లేబుల్ చేసుకుంటాను. నా లేబుల్‌లు నా భాగ్యాన్ని తెలియజేస్తాయని  తెలుసుకొని ఉంటాను. మీరు పదేపదే ఆలోచించి, పాజిటివ్ లేబుల్‌ల గురించి మాత్రమే మాట్లాడినప్పుడు, మీరు ఆ క్వాలిటీ వైబ్రేషన్‌లు మాత్రమే సృష్టించి, వాటిని మీ మనస్సు, శరీరం మరియు విశ్వానికి ప్రసరింపజేస్తారు. మీ ప్రతి వైబ్రేషన్ మీ వాస్తవికతను ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఆ లేబుల్‌లు మీ వాస్తవికతగా మారడం ప్రారంభిస్తాయి.

రికార్డు

20th march 2025 soul sustenance telugu

సంబంధాల్లో కలిగే బాధ నుండి విముక్తిని పొందడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలోని వివిధ రంగాలలో వేర్వేరు సంబంధాలలోకి వచ్చినప్పుడు, కొన్నిసార్లు మన అంతర్గత ప్రపంచంలోకి మరొక ఆత్మను అనుమతించినప్పుడు, మనల్ని వారు అర్థం

Read More »
19th march 2025 soul sustenance telugu

జీవితంలోని వివిధ దృశ్యాలలో సాకులు చెప్పడం మానుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలా మంది మన విశ్వసనీయతను కాపాడుకోవడానికి, ఇతరులపై లేదా పరిస్థితులపై నిందలు వేయడానికి సాకులు చెబుతారు. కొన్నిసార్లు మనకు, మన

Read More »
18th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు అంతర్గత బలం యొక్క సానుకూల సంస్కారాలను సృష్టించడానికి, మనం ముందుగా పట్టుదల యొక్క మొదటి అడుగు వేయాలి. పట్టుదల అంటే నేను

Read More »