Hin

16th july 2024 soul sustenance telugu

July 16, 2024

నా మూల స్థితి అయిన మంచితనానికి తిరిగి రావడం (పార్ట్ 1)

మన జీవితంలో చాలా ముఖ్యమైన మరియు ప్రభావవంతమైన అంశం మన చర్యలలోని ప్రతి ఆలోచనను జీవించడం. “మీరు బోధించేదాన్ని ఆచరించండి” అని సాధారణంగా అంటూఉంటాము. మరో మాటలో చెప్పాలంటే, మీకు చాలా ఆదర్శవంతమైన ఆలోచనలు మరియు మంచి దృక్పథాలు ఉంటాయి, మీరు వాటిని అనుసరించడానికి ప్రమాణాలు ఉంచుతారు. కానీ, కొన్నిసార్లు కర్మలు చేసేటప్పుడు, మీరు ఈ ప్రమాణాలకు అనుగుణంగా జీవించరు, ఇది మిమ్మల్ని నిరాశపరచడమే కాకుండా, ఇతరులకు బాధ కలిగించి, ఇబ్బంది పెడుతుంది.

ఉదాహరణ :- ఈ రోజు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ సంతోషంగా ఉండి, అందరికీ సంతోషాన్ని ఇస్తానని నిర్ణయించుకుంటాను. కానీ నేను ఒక కఠిన పరిస్థితిని లేదా సమస్యను ఎదుర్కొన్న అతి తక్కువ సమయంలో చింతించడం ప్రారంభించి, ఆ చింత యొక్క శక్తిని ఇతరులకు ప్రసరింపచేస్తాను. అలాగే, మరొక రోజు నా జీవితంలో నేను ఇతరుల పట్ల శుభ భావనలు మాత్రమే ఉంచుతాను అని ఒక లక్ష్యం పెట్టుకుంటాను. కానీ నేను ఒకరి ప్రతికూల ప్రవర్తనను ఎదుర్కోవలసి వచ్చిన వెంటనే, నేను నా హృదయంలోని ప్రేమను కోల్పోయి అవతలి వ్యక్తి గురించి ప్రతికూలంగా ఆలోచించడమే కాకుండా ఆ వ్యక్తికి వ్యతిరేకంగా ఇతరులతో మాట్లాడతాను. ఇది నా సంబంధాలను దెబ్బతీస్తుంది. కాబట్టి, ఇటువంటి మరెన్నో ప్రమాణాలు మనం మన మనస్సులో ఉంచుకుని, నిత్యం చేరుకోవడానికి ప్రయత్నిస్తాము. కొన్నిసార్లు మనం అలా చేయడంలో విజయవంతమవుతాము మరియు కొన్నిసార్లు అలా చేయలేకపోతున్నాము. దీనికంతటికీ కారణం ఏమిటి? మనమందరం మంచి మనసున్న మనుషులం కాదా? వాస్తవానికి, కొంతమంది మంచివారే. కానీ, ఆధ్యాత్మిక జ్ఞానం ప్రకారం, ప్రతి ఒక్కరూ ప్రాథమికంగా మంచివారే. అలాగే, ప్రతి ఒక్కరూ, వారి జీవితంలో ఏదో ఒక సమయంలో, మంచి వ్యక్తులుగా ఉండాలని కోరుకుంటారు. కొందరు తమ జీవితాల్లో మరియు స్వభావాలలో మంచితనాన్ని తీసుకురావడంలో దృఢంగా ఉంటారు, మరికొందరు మంచిగా మారే దిశగా మార్పు గురించి ఆలోచిస్తారు, కానీ దానిని తమ వ్యక్తిత్వంలో దృఢ సంకల్పంతో తీసుకురారు.

(సశేషం …)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

3rd dec 2024 soul sustenance telugu

ప్రతికూల పరిస్థితులను 3 దశల్లో పరిష్కరించడం (పార్ట్ 2)

స్టెప్ 2 – సానుకూలమైన మరియు శక్తివంతమైన మానసిక స్థితిని సృష్టించడం – ఏదైనా ప్రతికూల పరిస్థితిని పరిష్కరించడంలో తదుపరి దశ ఆధ్యాత్మిక ధృవీకరణలు లేదా ఆంతరిక శక్తి, దృఢత్వంతో నిండిన ఆలోచనల సహాయంతో

Read More »
2nd dec 2024 soul sustenance telugu

ప్రతికూల పరిస్థితులను 3 దశల్లో పరిష్కరించడం (పార్ట్ 1)

మనం అనూహ్యమైన జీవితాన్ని గడుపుతున్నాము. మన జీవితంలో తరచూ ఊహించని పరిస్థితులు వస్తున్నాయి. దీనికంతటికీ కారణం ఏమిటి? ఈ రోజు మన జీవితాలలో క్లిష్ట పరిస్థితులు ఎందుకు పెరుగుతున్నాయి? భగవంతుడు వెల్లడించిన ప్రపంచ నాటకం

Read More »
1st dec 2024 soul sustenance telugu

దివ్యమైన ఆత్మ యొక్క 12 లక్షణాలు (పార్ట్  2)

స్వయంలోని బలహీనతలను, లోపాలను సులభంగా పరిశీలించుకోగలిగే అద్దం లాంటి వారు దివ్యమైన ఆత్మ. వారిలో భగవంతుని మంచితనాన్ని, శక్తులను చూడగలుగుతాము. వారు భగవంతునితో స్వచ్ఛంగా, సత్యంగా ఉంటారు. వారు ప్రతిదీ ఎలా ఆచరణలోకి తీసుకురావాలనే

Read More »