Hin

17th July 2024 Soul Sustenance Telugu

July 17, 2024

నా మూల స్థితి అయిన మంచితనానికి తిరిగి రావడం (పార్ట్ 2)

మన వ్యక్తిత్వంలోని ఉన్న మంచితనం మన నిజ స్వరూపం, మన తప్పుడు లేదా ప్రతికూల వ్యక్తిత్వ లక్షణాలు పొందబడ్డాయి. నిజానికి తన జీవితమంతా చెడుగా ఉన్న వ్యక్తి వాస్తవానికి చాలా మంచి వారు మరియు తన జీవితమంతా మంచిగా ఉన్న వ్యక్తి ఎంతో ఉన్నతమైన వారు. ఎందుకంటే మనం మన దృష్టిని ఒక జన్మ వాస్తవికతకు పరిమితం చేయము, అది తప్పుడు వాస్తవికత. నిజమైన వాస్తవికత అనేది అనేక జన్మలలో ఒకటి. మానవుడు తాత్కాలికమైనవాడు, కానీ ఒక జీవి శాశ్వతమైనది. కాబట్టి, మనం ఆత్మ అని పిలవబడే ఒక జీవి, జీవితం యొక్క జన్మ-పునర్జన్మ కథలో తన పాత్రను పోషించడం ప్రారంభించినప్పుడు మంచిగా ఉండేది. అది ఏడు గుణాలతో నిండి ఉంది-శాంతి, సంతోషం, ప్రేమ, ఆనందం, పవిత్రత, శక్తి మరియు సత్యత . అది తన పాత్రను పోషించడం ప్రారంభించినప్పుడు, నిండుగా ఉండటమే కాకుండా, ఎల్లప్పుడూ ఈ గుణాలను ఇతరులకు ప్రసరింపజేస్తుంది. దీనిని ఆత్మ ఏదీ ఆశించని దశ అంటారు. ఫలితంగా, అది నిరంతరం సంతోషంగా మరియు సంతృప్తితో నిండి ఉంటుంది.

ఆత్మ తన పాత్రలో కొన్ని జన్మలను దాటినప్పుడు, తాను ఈ గుణాలను కోల్పోయి భగవంతుని నుండి, తన చుట్టూ ఉన్న వారి నుండి ఈ గుణాలను అడగడం ప్రారంభిస్తుంది. నెమ్మదిగా, ఆత్మ ఆశించడం  మొదలుపెడుతుంది. తనలోని ఏడు మూల గుణాలు తగ్గడం ప్రారంభిస్తాయి. అటువంటి ఆత్మ సంబంధాలను సానుకూలంగా నిర్వహించలేకపోతుంది. అనేక రకాల బాధ, దుఃఖము అనుభవిస్తుంది. భగవంతుని ఆరాధన వలన కొన్ని గుణాలను పొందినప్పటికీ, ఆత్మ మరియు పరమాత్మ గురించి, కర్మ సిద్ధాంతం గురించి పూర్తి జ్ఞానం కలిగేంత వరకు తన వాస్తవిక మంచితన స్థితికి వెళ్ళలేకపోతుంది. ఈ జ్ఞానాన్ని ఆధ్యాత్మిక జ్ఞానం అని అంటారు. ఆధ్యాత్మిక జ్ఞానం పూర్తిగా  సత్యంగా కలిగి ఉన్న ఒకే ఒక్కరు భగవంతుడు. భగవంతుని నుండి వచ్చిన ఈ జ్ఞానం మనకు అన్ని గుణాలు మరియు శక్తులతో నిండి ఉండటానికి సహాయపడుతుంది. దాని ఫలితంగా మనము మంచి జీవులు లేదా ఆత్మలుగా అవుతాము.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

[drts-directory-search directory="bk_locations" size="lg" cache="1" style="padding:15px; background-color:rgba(0,0,0,0.15); border-radius:4px;"]

రికార్డు

12th May 2025 Soul Sustenance Telugu

సంఘర్షణల సమయంలో వ్యక్తులతో మాట్లాడండి … వారి గురించి మాట్లాడకండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సంబంధంలో విభేదాలు ఏర్పడినప్పుడు, మనలోని నెగటివ్ భావోద్వేగాలు తరచుగా అవతలి వ్యక్తితో మన సంభాషణలో అవరోధంగా మారతాయి. అవతలి వ్యక్తి గురించి

Read More »
11th May 2025 Soul Sustenance Telugu

మన పోజిటివిటీ కవచాన్ని బలంగా చేసుకోవటం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం కఠినమైన సమయాలను ఎదురవుతున్నాము మరియు జీవితం మనపై వివిధ నెగెటివ్  పరిస్థితుల బాణాలను మళ్లీ మళ్లీ విసురుతుంది. మనందరికీ పాజిటివిటీ

Read More »
10th May 2025 Soul Sustenance Telugu

విసుగు ను(కోపం యొక్క మరో రూపం) అధిగమించండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలో మనం ఎప్పటికీ మార్చలేని రెండు విషయాలు: – గతం మరియు – వ్యక్తులు ఇది మనల్ని ఎదో ఒక రకంగా

Read More »