Hin

18th july 2024 soul sustenance telugu

July 18, 2024

నా మూల స్థితి అయిన మంచితనానికి తిరిగి రావడం (పార్ట్ 3)

మన అసలైన మంచితన స్థితికి తిరిగి రావాలంటే, మనం ఆధ్యాత్మిక శక్తి మరియు సానుకూలత యొక్క ఉన్నత మూలం వైపు చూడాలి. ఇతరుల నుండి ప్రేమ, ఆనందం కోసం అడగడం అనేది కస్తూరి జింక లాంటిది, ఇది దాని నాభిలో తాను బయట వెతుకుతున్న సువాసనను కలిగి ఉంటుంది. ఈ సంపదలన్నీ మన లోపల ఉన్నాయి. అసలైన సద్గుణ స్వభావానికి తిరిగి వెళ్లడం అంటే దాన్ని పూర్తిగా గ్రహించి, ఆపై ఈ సంపదను ఎప్పటికీ కోల్పోని భగవంతుని నుండి వచ్చిన సంపదతో మనల్ని మనం నింపుకునే జ్ఞానాన్ని మరియు శక్తిని తీసుకోవడం.  అలాగే, అనేక జన్మల కాలంలో ఈ సంపదలు మనలో ఎంతైతే తగ్గాయో, అంతగానే మనం మన ఆనందాన్ని కోల్పోయాము. అలాగే, మనం చాలా తప్పుడు సంస్కారాలతో భారంగా మారాము. మనం అనేక జన్మలు నిచ్చెన నుండి దిగివచ్చినప్పుడు మనం చేసిన తప్పుడు చర్యల కారణంగా ఈ లక్షణాలు మన స్వభావంలో ఒక భాగంగా మారాయి.

కాబట్టి ఇప్పుడు, సమయం యొక్క పిలుపు ఏమిటంటే, ప్రపంచంలోని ప్రతి ఆత్మకు సర్వోన్నతమైన తల్లితండ్రి అయిన పరమాత్మ లేదా సర్వోన్నతమైన ఆత్మ- భగవంతుడుతో కనెక్ట్ అయ్యి,  ఆ సానుకూల లక్షణాలన్నింటినీ తిరిగి పొందడం.  ఇది మనల్ని అంతర్గతంగా, ఆధ్యాత్మిక స్థాయిలో ధనవంతులుగా చేస్తుంది. మనం ఎంత ఎక్కువగా దీన్ని చేస్తే, అంత ఈ ప్రపంచంలోకి పరంధామం నుండి వచ్చినప్పుడు మనకు ఒక్కపుడు ఉన్న అసలైన దశకు తిరిగి వస్తాము. అలాగే, ఇది మళ్లీ స్వచ్ఛంగా మరియు సానుకూలంగా మారడానికి, కొత్త జీవితాన్ని ప్రారంభించే సమయం మాత్రమే కాదు, కొంతకాలం వరకు పరంధామానికి తిరిగి వెళ్లే సమయం కూడా. ఆ తరువాత, మనం ఈ ప్రపంచంలో అనేక జన్మ – పునర్జన్మల కొత్త చక్రాన్ని ప్రారంభిస్తాము. కర్మలు మరియు  సంబంధాలతో నిండిన ప్రపంచంలో దిగివచ్చే ముందు ఆత్మకు అవసరమైన విశ్రాంతి ఇదే. అందువల్ల, మనం తిరుగు ప్రయాణంలో ఉన్నాము మరియు జన్మ – పునర్జన్మల చక్రం పునరావృతమవుతుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

16th feb 2025 soul sustenance telugu

చక్కటి సంబంధాలను బలపరుచుకోవడానికి అహంకారాన్ని త్యాగం చేయడం (పార్ట్ 2)

మీరు మరొక వ్యక్తిని కలిసినప్పుడల్లా, మీరు మీలాగే ఉండాలి అని నిర్ధారించుకుంటూ, అదే సమయంలో ఎదుటి వ్యక్తిని కూడా వారిని వారిలానే ఉండనివ్వడం ద్వారా మీరు వారికీ ఒక స్వేచ్చని కలిపిస్తారు. దాని అర్థం

Read More »
15th feb 2025 soul sustenance telugu

చక్కటి సంబంధాలను బలపరుచుకోవడానికి అహంకారాన్ని త్యాగం చేయడం (పార్ట్ 1)

సంబంధాలు జీవితానికి ప్రాధమిక నిధి, కానీ సంబంధంలో ఏ వ్యక్తిలోనైనా అహం పెరిగినప్పుడు అవి తప్పుడు మార్గంలో వెళ్తాయి. వ్యక్తులు ఎల్లప్పుడూ వినయపూర్వకమైన వారితో సంతృప్తి చెందుతారని మీరు కనుగొంటారు. అలాగే అహంకారం లేని

Read More »
14th feb 2025 soul sustenance telugu

విశ్వసించండి. ఇక మీరు విజయం సాధిస్తారు

మీరు మీ పెద్ద లేదా చిన్న లక్ష్యాల గురించి చాలా ఉత్సాహంగా ఉంటూ వాటిని చేరుకోవడానికి చాలా కష్టపడ్డారా… కానీ ఎక్కడో ఒక చోట విజయం సందేహాస్పదంగా అనిపించిందా? అది ఫలితాన్ని ఎలా ప్రభావితం

Read More »