Hin

12th Nov 2023 Soul Sustenance Telugu

November 12, 2023

నా ఆత్మ జాగృతి అనే దీపాన్ని వెలిగించడము (పార్ట్ 2)

దీపావళి – ఆత్మ జాగృతి అనే దీపాన్ని వెలిగించడము

దీపాలను వెలిగిస్తాము, అలాగే మన మనసులో ఆధ్యాత్మిక జ్ఞాన దీపాన్ని వెలిగిద్దాం. జ్ఞానం మనలో శాంతి, ప్రేమ, ఆనందాలను నింపి ఆ కిరణాలను విశ్వానికి పంచుతుంది.

టపాసులు కాలుస్తాము, అలాగే మన గత గాయాలను కాల్చేద్దాం. ఒక్క దీపం అనేక టపాసులను ఒక్కసారిగా కాల్చివేస్తుంది, అలాగే మనసులో చేసిన ఒక్క మంచి ఆలోచన – గతం గడిచిపోయింది – ఇది ఇప్పటివరకు మనం మోస్తున్న అన్ని భారాలను సమాప్తం చేసేస్తుంది.

మిఠాయిలను పంచుకుంటాం కదా, అలాగే తీయని మాటలు, మంచిని కోరే ఆలోచనలు, జీవితంలో తీపిని పంచే దీవెనలును అందరికీ ఇవ్వండి.

ఈ విధంగా, దీపావళిని నిజమైన అర్థంతో మనం జరుపుకున్నప్పుడు లక్ష్మీదేవిలోని దైవికతనాన్ని మన జీవితంలోకి ఆహ్వానించగలం.

దీపావళి అంటే క్రొత్త సంవత్సర ఆరంభ వేడుక అని కూడా అంటారు. దీపావళిని కేవలం జరుపుకోవడమే కాకుండా నిజమైన అర్థంతో దీపావళిని జీవించినప్పుడు మనం క్రొత్త జీవితానికి నాంది పలుకుతాం, మనమంతా కలిసి క్రొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాం, ఈ క్రొత్త ప్రపంచంలో –

శాంతి మన ధర్మం

ప్రేమ మన భాష

అనురాగం మన బంధం

సత్యం చేతల్లో ఉంటుంది

సంతోషం జీవనశైలిగా అవుతుంది

హెవెన్, పారడైజ్, స్వర్గం… ఎందరో కలలుగనే స్వర్గం అతి కొద్ది కాలంలో వాస్తవంగా మారబోతుంది. స్వర్గం అనేది ఒక దివ్యమైన సత్యం, ఈ స్వర్గాన్ని భగవంతుడు సృష్టిస్తాడు, మన దివ్యత్వంతో మనం కూడా ఈ పరమాత్మ కర్తవ్యంలో మన వంతు సహకారాన్ని అందిస్తున్నాం.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

[drts-directory-search directory="bk_locations" size="lg" cache="1" style="padding:15px; background-color:rgba(0,0,0,0.15); border-radius:4px;"]

రికార్డు

15th June 2025 Soul Sustenance Telugu

వ్యక్తులు మీపై ఆధారపడేలా చేయవద్దు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు కొంతమందికి లేదా కొన్ని పరిస్థితులకు మనమే ఎంతో ముఖ్యమని, మనం లేకుండా వారు జీవితాన్ని గడపలేరనే నమ్మకంతో మనం తరచుగా జీవిస్తుంటాము.

Read More »
14th June 2025 Soul Sustenance Telugu

భగవంతుడు – ఈ సృష్టి యొక్క ఆది బిందువు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు భగవంతుడు సర్వ శక్తివంతుడు. వారు ఉంటేనే ఈ ప్రపంచం ఉంటుంది, ఎందుకంటే ఈ ప్రపంచంలో  మంచితనం మరియు దైవత్వం క్షీణించిన ప్రతిసారీ

Read More »
13th June 2025 Soul Sustenance Telugu

మిమ్మల్ని మీరు ఎలా ఆశీర్వదించుకోవాలి?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన జీవితంలో సాధువులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కుటుంబం మరియు స్నేహితుల ఆశీర్వాదాల శక్తిని మనమందరం పొందాము. ఆశీర్వాదం అంటే వారందరూ మన

Read More »