11th Nov 2023 Soul Sustenance Telugu » Brahma Kumaris | Official

November 11, 2023

నా ఆత్మ జాగృతి అనే దీపాన్ని వెలిగించడము (పార్ట్ 1)

దీపావళి – ఆత్మ జాగృతి అనే దీపాన్ని వెలిగించడము

ఒక దీపంలో అద్వితీయమైన అందం ఇమిడి ఉంటుంది. దీపావళి అనేది చెడు లేదా చీకటిపై సాధించిన విజయానికి సంకేతం మరియు రానున్న నూతన సంవత్సరానికి ఉత్సవం. అయితే మనం తొలగించాలనుకుంటున్న చీకటి ఏమిటి?

మనం దీపావళిని కేవలం ఒక్కరోజు జరుపుకోవడం కాదు, మొత్తం జీవితాన్నే దీపావళి అనుభూతిగా మార్చుకుందాం.

మనం మన ఇళ్ళను శుభ్రం చేసుకుంటాం, అలాగే మన మనసులో ఉన్న అన్ని భావోద్వేగ అడ్డంకులను అంటే ఎమోషనల్ బ్లాకులను  కూడా శుభ్రం చేసుకుందాం. మనసులోని ప్రతి మూలన బాగా పరిశీలించి, పరుష పదాలు, చేదు జ్ఞాపకాలు, మోసం, గత బాధల గాయాల మరకలను మనసు నుండి తీసివేద్దాం.

క్రొత్త బట్టలు ధరిస్తాము, అలాగే మనసులో ఉన్న పాత, అనవసరమైన, కలవరపరిచే అలవాట్లు అంటే కోపం, ఈర్ష్య, చింత వంటివాటిని తీసివేసి క్రొత్తవైన, మన నిజ గుణాలైన శాంతి, ప్రేమ మరియు ఆనందాలను తీసుకువద్దాం. నూతన ఆలోచనా విధానాన్ని, పరిస్థితులకు స్పందించే క్రొత్త విధిని, నూతన జీవన శైలిని తీసుకువద్దాం.

పాత లెక్కల పుస్తకాలను సమాప్తం చేసి క్రొత్త పుస్తకాలను మొదలు పెడతాము, అలాగే మన పాత కర్మల లెక్కలను, సంబంధాలలో ఉన్న చికాకులను సమాప్తం చేసి మన సంబంధాలకు ఒక క్రొత్త ప్రారంభాన్ని ఇద్దాం. ఇలాంటి పాతవేవైనా ఇంకా పట్టుకుని కూర్చుంటే వాటిని విడిచి పెట్టేద్దాం. తప్పు చేసిన వారిని క్షమించండి, సమస్యలను పరిష్కరించుకోండి. ఇది పరిష్కారం చేసుకునే సమయం.

(రేపు కొనసాగుతుంది)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

10th Dec 2023 Soul Sustenance Telugu » Brahma Kumaris | Official

ప్రశంసలు మరియు విమర్శలలో స్థిరత్వం

ప్రశంసలు మన అహాన్ని పెంచితే, విమర్శలు వచ్చినపుడు మనం కలత చెందడం ఖాయం. ప్రశంసలు లేదా విమర్శల ద్వారా ప్రభావితం కాకుండా మన చర్యలపై దృష్టి పెట్టాలని ఆధ్యాత్మిక జ్ఞానం మనకు బోధిస్తుంది. ఏదైనా

Read More »
9th Dec 2023 Soul Sustenance Telugu » Brahma Kumaris | Official

టీం మీటింగ్స్ లో ఎలా భాగం కావాలి

టీం మీటింగ్ ఒక ఉమ్మడి లక్ష్యం కోసం పని చేయడానికి, నేర్చుకోవడానికి, అభిప్రాయాలు పంచుకొని భాగస్వామ్యం కావడానికి అవకాశాన్ని అందిస్తుంది. తరచుగా, మనం మన అహం మరియు అసహనాన్ని మనతో పాటు మీటింగ్ కు

Read More »
8th Dec 2023 Soul Sustenance Telugu » Brahma Kumaris | Official

మీ వాస్తవికతలో మీకు ఏమి కావాలో అది మాత్రమే ఆలోచించండి

మన ఆలోచనలు మన వాస్తవికతను సృష్టిస్తాయని మనందరికీ తెలుసు. మన వాస్తవికతలో ఏదైనా మారాలంటే, మన ఆలోచనలను మార్చుకోవాలి. మన ప్రస్తుత వాస్తవికత గురించి ఆలోచిస్తూ ఉంటే, మన ఆలోచనల శక్తి మన వర్తమానానికి

Read More »