Hin

20th-nov-2023-soul-sustenance-telugu-

November 20, 2023

నా కమ్యూనికేషన్‌ను స్పష్టంగా మరియు అందంగా చేయడం

అనేక బాహ్య ప్రభావాలు, వాటి వలన ఏర్పడ్డ ప్రతికూల నమ్మకాలు మరియు గత చేదు అనుభవాలు మనసుపై పొరలుగా ఏర్పడి మనసును అస్పష్టంగా చేసేసాయి. తనకు తానే అస్పష్టంగా అయిపోయింది మనసు. ఆధ్యాత్మిక వెలుగు మనసుకు స్వయం గురించి ఒక స్పష్టతను తీసుకువస్తుంది. దీని ద్వారా నేను ఇతరులతో ఎంతో స్పష్టంగా వ్యవహరించగలుగుతాను. నాలో ఏమి జరుగుతుందో అన్న అస్పష్టత మునుపటి వలె ఇప్పుడు లేదు. ఆలోచనలు మరియు భావాల రూపంలో నా లోపల జరిగే సూక్ష్మ కర్మలకు మరియు బాహ్యంగా ఇతరులతో జరిగే నా కమ్యునికేషన్‌కు చక్కని సంబంధం ఉంది.

అతి ముఖ్యమైన విషయం, సంబంధాలు కూడా వైఖరి మరియు దృష్టితో అనుసంధానించబడి ఉంటాయి. కొన్నిసార్లు, నేను ఇతరులతో సరిగ్గానే మాట్లాడాను, సరిగ్గానే వ్యవహరించాను అనిపిస్తుంది, అయినాగానీ వారు నేను ఆశించిన విధంగా నాతో ప్రవర్తించడం లేదు. అటువంటి సందర్భాలలో, ఆ వ్యక్తి పట్ల నా వైఖరిని, అతనిని నేను ఏ దృష్టితో చూస్తున్నాను అన్న విషయాన్ని కూడా గమనించుకోవాలి. నా లోపల ఆ వ్యక్తిపట్ల స్వల్పంగా అనంగీకారం ఉండవచ్చు, ఒక రకమైన అసౌకర్యం, వారి వ్యక్తిత్వంలో ఏదో ఒకటి నచ్చకపోవడం ఉండవచ్చు. ఈ విషయం ఇరువురికీ తెలియకపోవచ్చు, కానీ నాలో ఉన్న నెగిటివ్ భావనలు ఇతరులపై ప్రతిబింబిస్తాయి. బాహ్యంగా నేను వారికి ఎంతో గౌరవాన్ని ఇస్తున్నాగానీ నా నుండి అందాల్సిన అంగీకారం, గౌరవం వారికి అందడం లేదు (సూక్ష్మ స్థాయిలో). ఈ సూక్ష్మ లోటు వలన వారు నేను చెప్పేది స్పష్టంగా వినరు (సూక్ష్మ స్థాయిలో), నా పట్ల వారి వ్యవహారం కూడా మారుతుంది. నా ఆలోచనలు, భావాలు, వైఖరులు మరియు దృష్టిని శుభ్రపరచడానికి ధ్యానాభ్యాసం నాకు వెసులుబాటును ఇస్తుంది, నేను భౌతికంగా మరియు సూక్ష్మ స్థాయిలో ఇతరులతో పంచుకునేది సానుకూలంగా ఉండేలా చూసుకుంటుంది. అప్పుడు నేను ఇతరులతో కనెక్ట్ అవ్వడం మరియు ఇతరులు నాతో సానుకూలంగా కనెక్ట్ కావడం చాలా సులభం. ఇది నా కమ్యూనికేషన్‌ను స్పష్టంగా మరియు అందంగా చేస్తుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

24th april 2025 soul sustenance telugu

వెళ్ళిపోయిన ప్రియమైన వ్యక్తికి శాంతిని, ప్రేమను ప్రసరింపజేయండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో ప్రతి ఒక్కరూ కూడా వేరు వేరు జన్మల ప్రయాణంలో ఉన్నారు, అలాగే మన చుట్టూ ఉన్న ఆత్మలు కూడా. బంధువు,

Read More »
23rd april 2025 soul sustenance telugu

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు   మంచి కర్మలు మరియు చెడు కర్మలు రెండూ ఈ సమాజంలో ఉన్నాయి. మన జీవితంలో అనేక కర్మలు చేస్తూ ఉంటాము,

Read More »
22nd april 2025 soul sustenance telugu

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు   మంచి కర్మలు మరియు చెడు కర్మలు అనేవి జీవితమనే నాణానికి ఉన్న రెండు వైపుల వంటివి.  మన కర్మలు ఎంత

Read More »