Hin

16th march 2025 soul sustenance telugu

March 16, 2025

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 1)

వివిధ రకాల సంఘటనలతో, కొన్నిసార్లు ప్రతికూలతతో నిండిన వాటితో జీవితాన్ని అనుభవం చేయడం  కష్టతరం కావచ్చు మరియు జీవితాన్ని ఒడిదుడుకుల కష్టతరమైన ప్రయాణంగా మార్చవచ్చు. జీవితం స్థిరత్వంతో నిండి ఉండాలని కోరుకునే వారు కొందరు ఉన్నారు ఇక కొంచెం అస్థిరత కూడా వారికి బాధ కలిగించి, వారిని కలవరపెడుతుంది. ఒకప్పుడు, సుదూర ప్రాంతంలో ఒక సాధువు ఉండేవాడు, అతను అందరికి శాంతియుతమైన మరియు సానుకూలమైన జీవన విధానాన్ని నేర్పించేవాడు. ఆయనను గౌరవించే వారు, ఆయన నుండి సరైన ఆలోచనా విధానాన్ని, జీవించే విధానాన్ని నేర్చుకోవడానికి ఆయనను సంప్రదించిన వారు చాలా మంది ఉన్నారు. ఒకసారి ఒక వ్యక్తి అతని వద్దకు వచ్చి, అతన్ని ఒక సాధారణ ప్రశ్న అడిగాడు – సానుకూలంగా ఆలోచించడానికి మరియు జీవితంలో కష్టమైన పరిస్థితులను తాకకుండా ఉండటానికి మనం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, రోజువారీ జీవితంలో ఆ పరిస్థితులు మనకు ఎందుకు చాలా ఇబ్బంది కలిగిస్తాయి? ప్రతికూలత మరియు జీవితం యొక్క అస్థిరత మధ్యలో మన మనస్సును సానుకూల దిశలో మార్చుకునే మార్గాన్ని మాకు చెప్పండి. ఆ సాధువు అతనికి చాలా సరళమైన సమాధానం ఇచ్చాడు – మీరు సమస్యలకు పరిష్కారాలను బయట వెతుకుతారు, అయితే పరిష్కారాలు మీ ఆలోచనలో మరియు కొంత కాలానికి మీరు అందులో తీసుకువచ్చే మార్పులో ఉంటాయి. ప్రతికూలంగా ఆలోచించవద్దు అని మీకు మీరు చెప్పుకోవడం చాలా సులభం కానీ వాస్తవానికి అలా చేస్తూ, చేస్తున్నప్పుడు ఒత్తిడికి గురి అవ్వకుండా ఉండటం మరొక విషయం. అనుచరుడు గందరగోళానికి గురై, ప్రతికూల పరిస్థితుల ఒత్తిడి లేని జీవితం నీరు లేని సముద్రం లాంటిదని, అసాధ్యం అని తనలో తాను అనుకున్నాడు.

 

అలాగే మనం పరిస్థితులను తట్టుకోగలమని, సహించగలమని కూడా మనం గ్రహిస్తాము మరియు ఇది కొంతమంది వ్యక్తులు మాత్రమే కాదు, మనమందరం ఎంతో కొంతవరకు ప్రయత్నిస్తాము. అవును మరి, మనలో కొందరు పూర్తిగా విఫలమవుతారు కూడా. కానీ మనలో చాలా మంది ప్రతికూల పరిస్థితులు మన చుట్టూ ఉన్నప్పుడు ఆనందంగా మరియు తేలికగా అనుభూతి చెందడంలో వివిధ స్థాయిలలో విజయవంతమవుతారు. అలాగే, కొంతమంది కష్టమైన పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు చాలా ఆనందంగా ఉండకపోవచ్చు, అయినప్పటికీ స్థిరంగా, సంతృప్తిగా ఉండవచ్చు, ఎన్నో ప్రతికూల ఆలోచనలు మరియు బలహీన స్వభావం గల ఆలోచనల నుండి కూడా విముక్తి పొందవచ్చు.

(సశేషం…)

రికార్డు

22nd april 2025 soul sustenance telugu

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు   మంచి కర్మలు మరియు చెడు కర్మలు అనేవి జీవితమనే నాణానికి ఉన్న రెండు వైపుల వంటివి.  మన కర్మలు ఎంత

Read More »
21st april 2025 soul sustenance telugu

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితం అనేది అనేక మలుపులు మరియు మార్పులతో కూడిన ఒక అందమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో వచ్చే అనేక దృశ్యాలు మనలోని

Read More »
20th april 2025 soul sustenance telugu

మెడిటేషన్ ఎలా చేయాలి? ఒక ప్రాథమిక మెడిటేషన్ కామెంటరీ (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు (నిన్నటి సందేశం నుండి మెడిటేషన్ కామెంటరీ కొనసాగుతుంది…)   ఇది నా వాస్తవిక ఇల్లు, శాంతిధామం, భూమిపై వివిధ భౌతిక శరీరాల

Read More »