Hin

17th march 2025 soul sustenance telugu

March 17, 2025

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 2)

కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న జీవితంలో మనలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక జ్ఞానంతో మాత్రమే కాకుండా శక్తులతో సిద్ధపరుచుకోవాలి. చాలా సంవత్సరాల పాటు కష్టమైన పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో చెప్పే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మీరు చదవి ఉండవచ్చు, అయినప్పటికీ అవి వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవటానికి తగినంత బలంగా ఉండకపోవచ్చు.  ఆధ్యాత్మిక జ్ఞానం మనకు శక్తివంతంగా మారడానికి మార్గాన్ని చూపుతుంది. కానీ ఒకరి స్వంత ఆలోచనను మార్చడానికి మరియు ఈ ఆలోచనకు మూలమైన సంస్కారాలను మార్చడానికి నిజమైన ఆధ్యాత్మిక శక్తి అనేది శక్తివంతమైన ఆలోచనలు మరియు అనుభవాలతో మనస్సును బలోపేతం చేయడం ద్వారా వస్తుంది.

 

మీ ముందు కష్టమైన పరిస్థితి ఉన్నప్పుడు సరైన ఆలోచనకు ప్రత్యామ్నాయం లేదు. మీరు ఒకవైపు ప్రతికూలంగా ఆలోచిస్తారు కానీ మరోవైపు మీరు చదివిన ఆధ్యాత్మిక జ్ఞానం ప్రకారం వ్యవహరించడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు ఆ పరిస్థితిని అధిగమించడంలో మీరు విజయవంతం కాలేరు. అలాగే, మీరు చదివిన లేదా నేర్చుకున్న వాటి ఆధారంగా మీరు తాత్కాలికంగా సానుకూలంగా భావించినప్పటికీ, భయం, నిరాశావాదం, నిస్సహాయత మరియు అసహనం వంటి ఆలోచనలను సృష్టించే మీ అంతర్గత అలవాట్లు తగ్గవు. అంతర్గత అలవాట్లు చాలా లోతైనవి, ఇవి చాలా జన్మల నుండి అంతర్గత ఆధ్యాత్మిక జీవం లేదా ఆత్మ లోపల ఉన్నాయి. మనం ప్రతికూల చర్య చేసినప్పుడు లేదా ప్రతికూల ఆలోచనను సృష్టించిన ప్రతిసారీ, ఆ ఆలోచన, పదం లేదా చర్య ఆధారంగా ప్రతికూల సంస్కారం సృష్టించబడింది. ఆ సంస్కారం అప్పుడు నేను సృష్టించిన అదే విధమైన ఆలోచనను మరియు చర్యను ప్రేరేపించి, మళ్లీ సంస్కారాన్ని బలోపేతం చేసింది. ఇది పునరావృత చక్రం. మరియు ఈ చక్రం ఎంతగా ఎక్కువ సార్లు పునరావృతమవుతుందో అంతగా మనపై మరింత శక్తివంతమైన ప్రతికూల ప్రభావాన్ని కలిగి ఉంటుంది. మనం ఇప్పుడు ఈ ప్రతికూల చక్రాలను సానుకూల చక్రాలుగా మార్చాలి. మనం అలా ఎలా చేయాలి? రేపటి సందేశంలో దానిని వివరిస్తాము.

(సశేషం…)

రికార్డు

11th july 2025 soul sustenance telugu

చెడు శకునాలు మరియు మూఢనమ్మకాల ప్రభావం నుండి అతీతంగా అవ్వండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు కొన్ని గ్రహాలు, ప్రదేశాలు, సంఖ్యలు, రంగులు, వస్తువులు, వ్యక్తులు మరియు భౌతిక శరీరాల వెలుపల సూక్ష్మ శరీరాలలో ఉండే కొన్ని ఆత్మల

Read More »
10th july 2025 soul sustenance telugu

నా భాగ్యానికి ఎవరు బాధ్యులు?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలామంది భగవంతుడు మన భాగ్యాన్ని వ్రాస్తాడని నమ్ముతాము. ఈ నమ్మకం గురించి  మనం ఆలోచించి ఆత్మపరిశీలన చేసుకోవాలి. భగవంతుడు మన

Read More »
9th july 2025 soul sustenance telugu

ఆరోగ్యకరమైన వర్క్-లైఫ్ బ్యాలన్స్ ను సాధించడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితం ఒక ప్రవాహంవంటిది, కనుక, మనం మన బాధ్యతల ప్రాధాన్యతలను మారుస్తూ ఉండాలి, మనకు మద్దతు ఇచ్చే జీవితంలోని అన్ని అంశాల

Read More »