Hin

18th march 2025 soul sustenance telugu

March 18, 2025

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 3)

అంతర్గత బలం యొక్క సానుకూల సంస్కారాలను సృష్టించడానికి, మనం ముందుగా పట్టుదల యొక్క మొదటి అడుగు వేయాలి. పట్టుదల అంటే నేను నా ఆలోచనా విధానాలను నెగటివ్ నుండి పాజిటివ్ గా మారుస్తానని స్వయానికి చేసుకునే ఒక బలమైన వాగ్దానం. అదే మొదటి జాగృతి. అప్పుడు, మనల్ని కలవరపెట్టే మరియు శక్తివంతంగా ఉండనివ్వని బలహీనత యొక్క ఒక నిర్దిష్ట సంస్కారాన్ని మనం ఎంచుకోవాలి. ఉదాహరణకి కష్టమైన పరిస్థితులలో అసహనంగా ఉండే అలవాటు నాకు ఉంటే, మొదట నేను స్వీయ ప్రయత్నం ద్వారా ఆ గుణంతో నన్ను నేను నింపుకోవాలి. నేను అలా చేసే వరకు, ఏ పరిస్థితిలోనైనా నేను ఎంత ఓపికగా ఉండటానికి ప్రయత్నించినా, నాకు సంస్కార స్థాయిలో ఆ గుణము లేదు కాబట్టి, బలహీనత పూర్తిగా తొలగించబడలేదు కాబట్టి, నేను ఓపికగా ఉండటం కష్టం అవుతుంది. ఒక నిర్దిష్ట రోజున, నేను ట్రాఫిక్ జామ్ మధ్యలో ఉన్నానని అనుకుందాం, నా దారిలో ఉన్న ఈ వాహనాలన్నీ కూడా ఒక ఐదు నిమిషాల్లో క్లియర్ అవుతాయని అనుకుందాం, కానీ వాటికి అరగంట సమయం పడితే, నేను ఊహించని లేదా అనుకోని ఆ అదనపు ఇరవై ఐదు నిమిషాల్లో నేను ప్రశాంతంగా ఉండగలనా? కాబట్టి, నాకు సహనం అవసరం. ఆ ఇరవై ఐదు నిమిషాల్లో నేను ఓపికగా ఉండాలని నాకు నేను చెప్పుకుంటే, నేను ఆ గుణాన్ని అనుభవం చేస్తానా? ఆ గుణం నా సంస్కారంలో లేదా నా వ్యక్తిత్వంలో భాగం కాకపోతే నేను అది చేయలేను. అది చాలా సంతోషంతో నన్ను నేను నింపుకుంటే, నేను ఆ లక్షణాన్ని అనుభవిస్తాను అని అనడం లాంటిది. కానీ, నేను చాలా సంతోషకరమైన వ్యక్తిని అనుకుంటూ, సంతోషాన్ని అనుభవం చేయలేను. నేను మొదట ఆ గుణంతో నన్ను నేను నింపుకోవాలి, అప్పుడు నాకు సంతోషం సహజంగా వస్తుంది.


కాబట్టి, ఇది చాల సహజమైనది, కేవలం సిద్ధాంతపరమైనది కాదు. అనగా, నేను ప్రతి గుణము మరియు శక్తి యొక్క అవతారం లేదా ఆచరణాత్మక రూపంగా ఉండాలి, అంతేకాని నాకు ఆ గుణం లేదా శక్తి ఉందని నా మనస్సులో రిపీట్ చేయడం కాదు. ప్రతికూల పరిస్థితులను అధిగమించడానికి అవసరమైన అన్ని విభిన్న గుణాలకు మరియు శక్తులకు ఇది వర్తిస్తుంది. మెడిటేషన్ మనలను ఈ గుణాలతో మరియు శక్తులతో చాలా సులభంగా నింపుతుంది. ఎందుకంటే మెడిటేషన్ అనేది ఆధ్యాత్మిక ఎనర్జీ మరియు శక్తి యొక్క అత్యున్నత మూలమైన భగవంతునితో ఒక అందమైన సంబంధం. భగవంతుడు ఆ గుణాలతో మరియు శక్తులతో నిండి ఉంటారు మరియు వాటిని మనలాగా ఎప్పుడూ కోల్పోరు, మనం వాటిని కోల్పోయినప్పుడు మనల్ని మనం నింపుకోవాలి.

రికార్డు

22nd april 2025 soul sustenance telugu

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు   మంచి కర్మలు మరియు చెడు కర్మలు అనేవి జీవితమనే నాణానికి ఉన్న రెండు వైపుల వంటివి.  మన కర్మలు ఎంత

Read More »
21st april 2025 soul sustenance telugu

జీవితంలోని ప్రతి రంగంలో మీ కర్మలను సరిగ్గా ఎంచుకోండి (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితం అనేది అనేక మలుపులు మరియు మార్పులతో కూడిన ఒక అందమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో వచ్చే అనేక దృశ్యాలు మనలోని

Read More »
20th april 2025 soul sustenance telugu

మెడిటేషన్ ఎలా చేయాలి? ఒక ప్రాథమిక మెడిటేషన్ కామెంటరీ (పార్ట్ 2)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు (నిన్నటి సందేశం నుండి మెడిటేషన్ కామెంటరీ కొనసాగుతుంది…)   ఇది నా వాస్తవిక ఇల్లు, శాంతిధామం, భూమిపై వివిధ భౌతిక శరీరాల

Read More »