Hin

24th-sept-2023-soul-sustenance-telugu

September 24, 2023

నెగిటివ్ పరిస్థితుల్లో పాజిటివ్ గా ఉండటానికి 5 మార్గాలు

  1. మన జీవితంలో ఏదైనా పరిస్థితి నెగిటివ్ ఫలితాన్ని కలిగి ఉండవచ్చు. కానీ చాలా సార్లు  మనము నెగిటివ్ ఫలితం గురించి ఆలోచించడం ప్రారంభిస్తాము ఇంకా అది జరగడానికి ముందే భయపడతాము. వివేకంతో నిండిన బుద్ధి మరియు సానుకూలతతో నిండిన మనస్సు విజయాన్ని పొందడానికి ఏ పరిస్థితిలోనైనా పాజిటివ్ ఫలితాలను పదేపదే విజుయలైజ్  చేస్తుంది.
  2. లా ఆఫ్ అట్రాక్షన్ చెబుతుంది చింతించడం అనేది మనం విశ్వానికి పంపే నెగిటివ్ శక్తి అని, ఇది ఆరోగ్యం, సంబంధాలు, పాత్రలు మరియు సంపద యొక్క నెగిటివ్ భాగ్యాన్ని ఆకర్షిస్తుంది. పాజిటివ్ జ్ఞానం మరియు బలంతో నిండిన సంకల్పాలను చేసే అభ్యాసం చేయటం విశ్వానికి పాజిటివ్ శక్తిని పంపుతుంది, ఇది విజయంతో నిండి ఉన్న పాజిటివ్ భాగ్యాన్ని సృష్టించడంలో సహాయపడుతుంది.
  3. ప్రతి నెగిటివ్ పరిస్థితి మొదట పెద్దదిగా కనిపిస్తుంది, కానీ మనం ముందుకు సాగుతున్నప్పుడు, త్వరగా పరిష్కరించుకునేందుకు మన స్వంత పోజిటివిటీ, భగవంతుని శక్తి మరియు సహాయం, స్వచ్ఛమైన బుద్ధిని ఉపయోగించడం అవసరం. కొంత సమయం తరువాత, పరిస్థితులు చిన్నవిగా అనిపిస్తాయని ప్రాక్టికల్ అనుభవం చెబుతుంది. కాబట్టి, అవి మీ జీవితంలో మొదటిసారి వచ్చినప్పుడు ఎప్పుడూ నెగిటివ్ గా ఆలోచించండి, కానీ వాటిని పరిష్కరించడానికి చూడండి.
  4. జ్ఞానం యొక్క చాలా శక్తివంతమైన బోధన ఏమిటంటే, ప్రతి పరిస్థితి దాటిపోతుంది. ఏ పరిస్థితి శాశ్వతం కాదు. స్థిరంగా మరియు బలంగా ఉండటము, త్వరగా వదిలేయకుండా ఉండటమే విజయానికి కీలకం. అలాగే, పరిస్థితులు ముందో వెనుకో ఎలా వెళ్లి పోతాయో మన జీవితాలు మనకు చాలా అనుభవాన్ని అందించాయి. అవి వచ్చినప్పుడు మనం దృఢంగా, ఓపికగా ఉండాలి మరియు అయోమయం కాకుండా ఉండాలి.
  5. ప్రతి పరిస్థితిలో మనకు ఎప్పుడూ ఏదో ఒక ప్రయోజనం దాగి ఉంటుందని కూడా మనం చాలా లోతుగా గ్రహించాలి. నెగిటివ్ పరిస్థితులు మనల్ని మరింత శక్తివంతంగా మరియు వివేకవంతులుగా చేయడమే కాకుండా, అవి మనల్ని విభిన్నంగా ఆలోచించేలా చేస్తాయి.  ఇది మన జీవితంలో కొత్త వాస్తవాలను సృష్టిస్తుంది. ఒక వేళ ఆ పరిస్థితి జరగకపోతే మనం ఎన్నడూ వెళ్ళని ఆ విజయాల కొత్త మార్గాల్లోకి తీసుకువెళుతుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

17th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 5)

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు భారతదేశంలోని వివిధ నగరాలు, పట్టణాలు మరియు గ్రామాలలోని అన్ని బ్రహ్మా కుమారీల కేంద్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా 120 కి పైగా దేశాలలో ఉన్న కేంద్రాలలో నిర్వహించబడుతుంది. ఈ

Read More »
16th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 4)

ప్రపంచ నాటకం యొక్క తదుపరి 2 యుగాలు అనగా తదుపరి 2500 సంవత్సరాలలో స్వర్గంలో దైవిక మానవుల చేతనంలో ఉన్న దేవతలు,  ఆత్మిక స్మృతి  నుండి శారీరిక స్మృతికి  మారినప్పుడు, వారు స్వయాన్ని దేవి

Read More »
15th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 3)

ఆత్మ మరియు భగవంతుని జ్ఞానాన్ని పంచుకున్న తరువాత, బ్రహ్మా కుమారీల 7 రోజుల పరిచయ కోర్సు ప్రపంచ నాటకం అంటే ఏమిటి మరియు అది 4 యుగాలతో ఎలా రూపొందించబడిందో మనకు బోధిస్తుంది –

Read More »