Hin

25th nov 2023 soul sustenance telugu

November 25, 2023

నెగిటివ్ శక్తి మార్పిడిల చక్రాన్ని బ్రేక్ చేయడం (పార్ట్ 1)

మన జీవితంలో ఎప్పుడూ ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులు ఉంటారు, వారి సాంగత్యంలో ఉండటం వల్ల మనకు అసౌకర్యం కలుగుతుంది.  వారు దాదాపు అన్ని సమయాలలో ఏదో ఒకటి చేస్తారు లేదా వారు చేసే పనిని, మనల్ని చికాకు పెట్టే విధంగా మనం గ్రహిస్తాము. కొన్నిసార్లు అవతలి వ్యక్తి యొక్క ఉద్దేశ్యం ఆలా కాకపోవచ్చు. అయినప్పటికీ, అవతలి వ్యక్తి యొక్క స్వభావానికి అనుగుణంగా ఉండే బదులు, వారి స్వభావం మరియు ఆ స్వభావంపై ఆధారపడిన చేతలతో మనల్ని మనం పదే పదే గుర్తించుకున్నాము.  ప్రతిచర్యల రూపంలో మనం బదులిచ్చిన ఈ నెగిటివ్ భావాల ప్రభావాలు, మన వరకే పరిమితమైనట్లైతే, అవి మనకు మాత్రమే అసౌకర్యాన్ని కలిగిస్తాయి.  కానీ ఈ భావాలు మనలో నెగిటివ్ చర్య మరియు ప్రతిచర్యల చక్రాన్ని ప్రారంభిస్తాయి, తద్వారా అలాంటి హానికరమైన భావాలు అవతలి వ్యక్తికి చేరుకుంటాయి. ఈ ఎనర్జీ ని స్వీకరించినప్పుడు, అవతలి వ్యక్తి మనల్ని నెగిటివ్ గా గ్రహించడం, స్పందించడం లేదా మన గురించి నెగటివ్ గా ఆలోచించడం ప్రారంభిస్తాడు. మనకు మరియు అవతలి వ్యక్తికి మధ్య భావోద్వేగ ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభమవుతుంది. నెగిటివ్ ఆలోచనలు, భావాలు, వైఖరులు, మాటలు మరియు చేతలు ఒకదానికొకటి ఎప్పటికప్పుడు మార్పిడి అవుతుంటాయి. అవతలి వ్యక్తితో నెగిటివ్ కర్మల  ఖాతాలు లేదా బంధనాలు సృష్టించబడతాయి. ఈ నెగిటివ్ కర్మల ఖాతాలు పెరుగుతూ ఉంటాయి. అటువంటప్పుడు, మనం లేదా అవతలి వ్యక్తి, ఎప్పటికప్పుడు, భౌతిక లేదా భౌతికేతర స్థాయిలో పాజిటివ్ గా వ్యవహరించినా లేదా ప్రతిస్పందించినా, నెగిటివ్ బంధాన్ని బ్రేక్ చేసి సంబంధాన్ని పాజిటివ్ గా మార్చడం చాలా తక్కువ. ఎందుకంటే, కొంచెం పాజిటివ్‌తో పాటు చాలా నెగెటివ్‌లు ఉన్నందున మరియు అది చేయగలిగింది నెగటివ్‌ను కొద్దిగా పలచబరచడమే కానీ దాని ప్రభావాలను పూర్తిగా తొలగించదు.

 

కాబట్టి, నెగిటివ్ శక్తి మార్పిడి యొక్క ఈ విష చక్రాన్ని మనం ఎలా బ్రేక్ చేయాలి? మనం దాని గురించి  కొన్ని పద్ధతులను రాబోయే కొద్ది రోజుల సందేశాలలో చర్చించుకుందాం.

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

[drts-directory-search directory="bk_locations" size="lg" cache="1" style="padding:15px; background-color:rgba(0,0,0,0.15); border-radius:4px;"]

రికార్డు

11th july 2025 soul sustenance telugu

చెడు శకునాలు మరియు మూఢనమ్మకాల ప్రభావం నుండి అతీతంగా అవ్వండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు కొన్ని గ్రహాలు, ప్రదేశాలు, సంఖ్యలు, రంగులు, వస్తువులు, వ్యక్తులు మరియు భౌతిక శరీరాల వెలుపల సూక్ష్మ శరీరాలలో ఉండే కొన్ని ఆత్మల

Read More »
10th july 2025 soul sustenance telugu

నా భాగ్యానికి ఎవరు బాధ్యులు?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలామంది భగవంతుడు మన భాగ్యాన్ని వ్రాస్తాడని నమ్ముతాము. ఈ నమ్మకం గురించి  మనం ఆలోచించి ఆత్మపరిశీలన చేసుకోవాలి. భగవంతుడు మన

Read More »
9th july 2025 soul sustenance telugu

ఆరోగ్యకరమైన వర్క్-లైఫ్ బ్యాలన్స్ ను సాధించడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితం ఒక ప్రవాహంవంటిది, కనుక, మనం మన బాధ్యతల ప్రాధాన్యతలను మారుస్తూ ఉండాలి, మనకు మద్దతు ఇచ్చే జీవితంలోని అన్ని అంశాల

Read More »