Hin

26th nov 2023 soul sustenance telugu

November 26, 2023

నెగిటివ్ శక్తి మార్పిడిల చక్రాన్ని బ్రేక్ చేయడం (పార్ట్ 2)

ఒక వ్యక్తితో నెగిటివ్ శక్తి మార్పిడి యొక్క చక్రాన్ని బ్రేక్ చేయడానికి మొదటి పద్ధతి స్వ-పరివర్తన.

స్వపరివర్తన యొక్క మొదటి మెట్టు ఎదుటి వ్యక్తికి మాటల్లో ప్రతిస్పందించను. కానీ నేను ఇతరుల నుండి పొందిన నెగిటివ్ శక్తిని, భౌతిక రూపాల్లో అనగా నెగిటివ్ హావభావాలు , దృష్టి, మరియు చేతల ద్వారా ఇతరులకు వ్యక్తపరుస్తూ నెగిటివ్ వాతావరణాన్ని సృష్టిస్తాను. ఇది ఇతరుల మనస్సులలో ఆ వ్యక్తి గురించి నెగిటివ్ అవగాహన కలిగిస్తుంది. అటువంటి సంబంధాలకు హాని జరిగినందున భౌతిక స్థాయిలో నష్టం జరుగుతుంది. నష్టం జరిగాక నియంత్రించవలసి ఉంటుంది, ఇది కొన్నిసార్లు చాలా ఆలస్యం అవుతుంది. ఎందుకంటే మనం నెగిటివ్ సమాచారాన్ని ఇతరులకు, కొన్నిసార్లు మనం మనకు హాని చేసినట్లు ముందుగా భావించే వ్యక్తికి కూడా చేరవేస్తాము .

 

స్వ పరివర్తన యొక్క కొంచెం లోతైన రెండవ స్థాయి ఏమిటంటే, నేను ప్రతిస్పందించకపోవడమే కాకుండా నాకు సన్నిహితంగా ఉండే వ్యక్తులెవరితోనూ ఆ  వ్యక్తి గురించి వ్యతిరేకంగా మాట్లాడను. కానీ నేను అవతలి వ్యక్తి గురించి నెగిటివ్ గా ఆలోచిస్తూనే ఉంటాను. అటువంటి సందర్భాలలో, నా ఆలోచనలు మరియు భావోద్వేగాలు పూర్తిగా నా నియంత్రణలో లేనందున, హావభావాలనే తెరల వెనుక తెలియకుండా మరియు గుప్తంగా జరుగుతుంది. అటువంటి ఆలోచనలను తెలిసి చేసినా లేదా అంతర్గత బలం లేకపోవడం వల్ల అవి అనుకోకుండానే చేసినా ఆలోచనలు, భావోద్వేగాలు ఈ రకంగా ఉండటం, ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ప్రాథమిక అంశాల ప్రకారం తప్పు.  ఈ నెగిటివ్  ఆలోచనలు మరియు భావోద్వేగాలు ఒక సూక్ష్మ స్థాయిలో అవతలి వ్యక్తికి చేరుకుంటాయి, ఆ వ్యక్తితో సంబంధాలను దెబ్బతీస్తాయి.

 

స్వ పరివర్తన యొక్క మూడవ మరియు లోతైన స్థాయి నా ఆలోచనలు, భావాల క్వాలిటి  మార్చుకునే శక్తిని నేను పెంచుకుంటాను. నా ప్రతిచర్యలకు మూలమైన లోపాన్ని (బలహీనతను) తొలగించడానికి నేను మానసికంగా శక్తిని పొందుతాను, తద్వారా నన్ను బాధపెట్టేది ఇకపై అలా బాధపెట్టలేదు. తద్వారా అందరూ కోరుకున్నట్టుగా సంబంధాలను కాపాడుకోగలం. ఇముడ్చుకునే శక్తి, స్వపరివర్తనలను ఉత్తమంగా ఆచరించినట్లవుతుంది. ఇందులోనే  మరొకరితో నెగిటివ్ శక్తి మార్పిడిని ఆపగల సామర్ధ్యం ఉంది.

 

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

[drts-directory-search directory="bk_locations" size="lg" cache="1" style="padding:15px; background-color:rgba(0,0,0,0.15); border-radius:4px;"]

రికార్డు

10th july 2025 soul sustenance telugu

నా భాగ్యానికి ఎవరు బాధ్యులు?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలామంది భగవంతుడు మన భాగ్యాన్ని వ్రాస్తాడని నమ్ముతాము. ఈ నమ్మకం గురించి  మనం ఆలోచించి ఆత్మపరిశీలన చేసుకోవాలి. భగవంతుడు మన

Read More »
9th july 2025 soul sustenance telugu

ఆరోగ్యకరమైన వర్క్-లైఫ్ బ్యాలన్స్ ను సాధించడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితం ఒక ప్రవాహంవంటిది, కనుక, మనం మన బాధ్యతల ప్రాధాన్యతలను మారుస్తూ ఉండాలి, మనకు మద్దతు ఇచ్చే జీవితంలోని అన్ని అంశాల

Read More »
8th july 2025 soul sustenance telugu

ప్రేమను ఆపేక్షలతో సమానం చేయకండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన స్వభావాలు, విలువలు, లక్ష్యాలకు అనుగుణంగానే ఇతరులు ప్రవర్తించాలని మనం సాధారణంగా కోరుకుంటాం. ఎవరైనా మన అంచనాలకు తగ్గట్లుగా ఉంటే, వారు

Read More »