Hin

27th nov 2023 soul sustenance telugu

November 27, 2023

నెగిటివ్ శక్తి మార్పిడిల చక్రాన్ని బ్రేక్ చేయడం (పార్ట్ 3)

ఒక వ్యక్తితో నెగిటివ్ శక్తి మార్పిడి యొక్క చక్రాన్ని బ్రేక్ చేయడానికి  ఆ వ్యక్తి ఆ సమయంలో శాంతి, ప్రేమ అనే సంపదలను కోల్పోయి ఉన్నాడని మనం తెలుసుకొని స్పందించడం. ఆ అవగాహనకు పునాది నిరాడంబరమైన మనసు. చాలా సార్లు  ఈ అవగాహన అహంకారంతో కూడి ఉండడం వలన  పరిస్థితిని చల్లబరచడానికి బదులుగా సూక్ష్మ స్థాయిలో మరింత అస్థిరతను కలిగిస్తుంది. కాబట్టి ఈ అవగాహన ఆధారంగా ఆ సమయంలో నా కర్తవ్యం నాకు గుర్తుచేసేది  – భగవంతుని ప్రేమ మరియు శాంతి యొక్క అనంతమైన సంపదతో ఆ వ్యక్తికి సేవ చేయడం.

 

కాబట్టి, ఆ సందర్భంలో రోజుకు ఒకసారైనా 5 నిమిషాల పాటు స్వచ్ఛంగా పాజిటివ్ మరియు శక్తివంతమైన ఆలోచన ప్రకంపనలు ఇచినట్లైతే, అవతలి వ్యక్తికి ప్రేమ మరియు శాంతి ఓదార్చే పనిని చేస్తాయి. ఈ పద్ధతి ద్వారా, మీ సద్భావన, సంతృప్తి మీకు సమస్య గా ఉన్న అవతలి వ్యక్తికి చేరుతాయి. అలా చేయడం ద్వారా, ఆ వ్యక్తికి చేరవేసిన ఈ పాజిటివ్ భావాలు అతని లోపల, తనకి ఉన్న నెగిటివిటీ ని గ్రహించడానికి మార్గం సుగమం చేస్తాయి. ఈ నెగిటివిటీ ఆ వ్యక్తి ఏదైనా తప్పుడు పనుల చేయడంలో మరియు బలహీనతల రూపంలో ఉంటుంది. అవగాహన మార్పుకు ప్రేరణగా పనిచేస్తుంది. ఉత్సాసమైన ముఖంతో , మీ ఉత్సాహభరితమైన సాంగత్యంతో ఆ వ్యక్తికి రంగును అంటించవచ్చు.  ఇలా మధురత, ఆనందం మరియు సంతృప్తి యొక్క భావాలతో నిండిన సాంగత్యం వారిలో పరివర్తనను తీసుకువస్తుంది. దీనికి కారణం మన చేతలు మరొకరికి శిక్షణల గా అవ్వటం. దానితో ఆ వ్యక్తి మరింత వినయంగా మారిపోయి, మంచిగా, పాజిటివ్ గా అవ్వడానికి ప్రేరణ పొందుతాడు. అలాగే, వినయపూర్వకమైన, విలువైన మరియు మధురమైన మాటలు నెగిటివ్ శక్తి మార్పిడిని అంతం చేయడంలో సహాయపడతాయి. ఇంకా, ఇతరుల ఆశీర్వాదాలు ,  అభినందనలు పొందుతారు, అలాగే ఆ పరిస్థితికి సంబంధించిన వ్యక్తుల మనసులను కూడా గెలుచుకుంటారు.

 

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

8th sep 2024 soul sustenance telugu

గణేష్ చతుర్థి యొక్క దివ్యత మరియు ఆధ్యాత్మికత (పార్ట్ 2)

శ్రీ గణేషుని పెద్ద ఉదరము ఇముడ్చుకునే శక్తిని సూచిస్తుంది. వ్యక్తుల బలహీనతలు మరియు వారి తప్పుడు చర్యల గురించి మనం ఇతరులతో మాట్లాడకూడదు. శ్రీ గణేషుని చేతిలో గొడ్డలి, తాడు మరియు కమలం చూపిస్తారు,

Read More »
7th sep 2024 soul sustenance telugu

గణేష్ చతుర్థి యొక్క దివ్యత మరియు ఆధ్యాత్మికత (పార్ట్ 1)

ఈ సంవత్సరం గణేష్ చతుర్థిని సెప్టెంబర్ 7 నుండి 17 వరకు జరుపుకుంటారు. శ్రీ గణేషుని జననం యొక్క నిజమైన అర్ధాన్ని మనం అర్థం చేసుకుంటాము. శ్రీ పార్వతీ దేవి స్నానం చేయాలనుకొని గేటు

Read More »
6th sep 2024 soul sustenance telugu

మీరు కలిసే ప్రతి ఒక్కరికీ చిరునవ్వుతో అభివాదం చేయండి

గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, ఆల్ ది బెస్ట్… కొన్నిసార్లు శుభాకాంక్షలు ఎటువంటి భావాలు లేకుండా కేవలం పదాలుగా మారతాయి. అంతరికంగా మనం వారి సామర్థ్యాన్ని అనుమానించినప్పటికీ, వ్యక్తులకు అల్ ది బెస్ట్ తెలియజేయవచ్చు.

Read More »