Hin

28th nov 2023 soul sustenance telugu

November 28, 2023

నెగిటివ్ శక్తి మార్పిడిల చక్రాన్ని బ్రేక్ చేయడం (పార్ట్ 4)

ఏవరైనా ఇద్దరు వ్యక్తుల మధ్య నెగిటివ్ శక్తి మార్పిడికి మూల కారణాలలో ఒకటి వ్యక్తిత్వాలు లేదా స్వభావాల ఘర్షణ. ఇది తప్పుగా ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య కావచ్చు లేదా ఒకరు ఒప్పు మరొకరు తప్పుగా ఉన్న ఇద్దరి మధ్య కావచ్చు. తక్కువ సందర్భాలలో ఇద్దరూ సరైయన ఇద్దరు వ్యక్తుల మధ్య కావచ్చు. కొన్నిసార్లు ఇద్దరు వ్యక్తుల వ్యక్తిత్వాలు సరైనవి, వారి పని విధానాలు సరైనవి, వారి ఆలోచనా విధానాలు సరైనవి ఉన్నపటికి అవి భిన్నంగా ఉన్న కారణంగా జరుగుతాయి. ఈ వ్యక్తిత్వాల ఘర్షణ రెండు వైపులా చికాకు కలిగించి ద్వేషంగా, కోపంగా మారి ఇరువురిని బాధిస్తుంది. దీన్ని ఎలా సరిదిద్దాలి? దీనికి ఒక ముఖ్యమైన పద్ధతి అహం యొక్క త్యాగం. చాలా సార్లు సరైన ఇద్దరు వ్యక్తుల మధ్య నెగిటివ్ శక్తి మార్పిడికి కారణం రెండు వైపులా సూక్ష్మమైన అహం, వారిలో ఒకరు వారి అహాన్ని త్యాగం చేసినప్పుడు అది అంతమవుతుంది. తన అహాన్ని త్యాగం చేసేవాడు, విభిన్న వ్యక్తిత్వాల వ్యక్తులందరి నుండి ఆశీర్వాదాలను పొందటానికి అర్హుడని అంటారు ,వారే సంబంధాలలో సామరస్యాన్ని తీసుకు వస్తారు.

 

అహాన్ని త్యాగం చేసే వ్యక్తి పరిపక్వత కలిగి ఉండి ఒక నిర్దిష్ట వ్యక్తితో నెగిటివ్ శక్తి మార్పిడిని అంతం చేసే బాధ్యత అతనిపై ఉందని గ్రహించగల వినయం కలిగి ఉంటాడు. అలాంటి వ్యక్తి కోమలమైన మనసు కలిగి ఉంటాడు. పరిస్థితి కోరిన విధంగా తనను తాను మలుచుకోవడం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని అది నెగిటివ్ శక్తి మార్పిడిని ఎలా ముగించగలడో చూస్తాడు. అలాంటి వ్యక్తి అభినందనల సాగరం లాంటివాడు. అతను తన స్వంత ఆసక్తిని త్యాగం చేసి , “నేను సరైనది చేసాను, నాకు నచ్చిన విధంగా అన్నీ జరగాలనే “స్పృహను త్యాగం చేసి మరొకరి ఆసక్తికి మొదటి స్థానం ఇవ్వాలి అని అనుకుంటాడు. అలాగే, అతను తన పేరును వదులుకొని ఇతరుల పేరును ప్రఖ్యాతం చేస్తాడు. అలాంటి వారు ఇతరులను, వారి  పని తీరుతో పాటు, వారి వ్యక్తిత్వాన్ని వ్యక్తిగతంగా లేదా సమూహంగా ప్రశంసిస్తాడు. అటువంటి వ్యక్తి అంతకు ముందు నెగిటివ్ తరంగాలను మార్పిడి చేసుకున్న వ్యక్తికి గురువు మరియు స్నేహితుడు అవుతాడు, నెగిటివ్ శక్తి మార్పిడిని అంతం చేయడానికి ఒక సాధనంగా మారతాడు.

 

(రేపు కొనసాగుతుంది…)

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

16th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 4)

ప్రపంచ నాటకం యొక్క తదుపరి 2 యుగాలు అనగా తదుపరి 2500 సంవత్సరాలలో స్వర్గంలో దైవిక మానవుల చేతనంలో ఉన్న దేవతలు,  ఆత్మిక స్మృతి  నుండి శారీరిక స్మృతికి  మారినప్పుడు, వారు స్వయాన్ని దేవి

Read More »
15th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 3)

ఆత్మ మరియు భగవంతుని జ్ఞానాన్ని పంచుకున్న తరువాత, బ్రహ్మా కుమారీల 7 రోజుల పరిచయ కోర్సు ప్రపంచ నాటకం అంటే ఏమిటి మరియు అది 4 యుగాలతో ఎలా రూపొందించబడిందో మనకు బోధిస్తుంది –

Read More »
14th jan 2025 soul sustenance telugu 2

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 2)

మనలాగే, భగవంతుని ఆధ్యాత్మిక రూపం కూడా భౌతిక కళ్ళకు కనిపించని ఉన్నతోన్నతమైన జ్యోతిర్బిందువని తెలుసుకున్న తరువాత, ఎలా మనం భగవంతుడిని అర్థం చేసుకొని వారితో ఎలా అనుసంధానించగలము అనేదానికి బ్రహ్మా కుమారీల 7 రోజుల

Read More »