Hin

29th nov 2023 soul sustenance telugu

November 29, 2023

నెగిటివ్ శక్తి మార్పిడిల చక్రాన్ని బ్రేక్ చేయడం (పార్ట్ 5)

ప్రతి వ్యక్తి స్వతహాగా మంచివారని మనందరికీ తెలుసు. అయితే వ్యక్తిత్వంలో తప్పుడు స్వభావాలు  ఎంతో కొంత అందరిలో ఉంటాయి. ఈ సరికాని వ్యక్తిత్వం ఆత్మ యొక్క నిజ గుణం కాదని, అది మనం తెచ్చిపెట్టుకున్నదని కూడా మనకు తెలుసు. సరికాని వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, చాలా సందర్భాలలో, మౌనంగా ఉండి ఆత్మ-పరిశీలన సమయంలో దాని గురించి తెలుసుకుంటాడు మరియు దాని వల్ల ఎవరికీ ఎటువంటి అసౌకర్యం లేదా దుఃఖం కలుగకుండా దానిని తొలగించే ప్రయత్నం కూడా చేస్తాడు. సరికాని వ్యక్తిత్వంతో పాటు, ప్రతి వ్యక్తి అనేక పాజిటివ్ సంస్కారాలు కలిగి ఉంటారు, అవే వారి శక్తి. ఇప్పుడు మనం అలాంటి వ్యక్తితో నెగిటివ్ శక్తుల మార్పిడిని కలిగి ఉన్నప్పుడు, ఆధ్యాత్మికంగా తెలివిగల వ్యక్తి ఏమి చేస్తాడు? ఎదుట వారి తేలికపాటి నెగిటివ్ ఛాయల గురించి తెలిసినా వారి గురించి తాను విన్న లేదా చూసిన పాజిటివ్ రంగులపై దృష్టి పెడతాడు. దానితో పాటు, నాలో ఉన్న నెగిటివ్ ఛాయలను కూడా తొలగించే పనిలో ఉన్నానని గ్రహించడం వల్ల సాధన చేయడం సులభం అవుతుంది.

 

ఈ రకమైన పాజిటివ్ దృష్టితో పాటు ఎదుట వారిలో ఉన్న పాజిటివ్ వ్యక్తిత్వ రంగులను అభినందించడం క్రమం తప్పకుండా సాధన చేస్తే, అది దయ చూపించడం అవుతుంది.  ఈ దయ స్వచ్ఛమైన ఆత్మిక ప్రేమకు యొక్క గుర్తు. అలాంటి ప్రశంసలు తనను తాను  పరిశీలించుకుని మార్చుకోవటానికి ఏమి చేయాలో చూసుకోవటానికి ఎదుట వారికి సులభం అవుతుంది. కానీ ఈ ప్రశంస యొక్క మొదటి ప్రభావం నాపై ఉంటుంది, నన్ను ఆంతరికంగా నెగిటివ్ మరియు వ్యర్థ ఆలోచనలు లేకుండా ఉంచుతుంది. కాబట్టి, నా మనస్సులో ఇతరుల విశేషతలను మెచ్చుకోవడం, సమయానుసారంగా వాటిని నా స్పృహలోకి తీసుకురావడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ సమయంలో నెగిటివ్ ప్రభావంతో ప్రభావితమయ్యే అవకాశం ఉంది, ఇది నా అవగాహనను శుద్ధంగా ఉంచడమే కాకుండా, ఎనర్జీ స్థాయిలో ఆ వ్యక్తికి చేరుతుంది. అలాగే, ఆ వ్యక్తి ఆ బలాలను కార్యరూపంలోకి తీసుకురావడానికి ప్రేరణ, శక్తిని  పొందుతారు, ఫలితంగా నెగిటివ్ శక్తి మార్పిడిని ముగించడానికి వారు పాత్రను పోషిస్తారు. ఇది ఆధ్యాత్మికత యొక్క ఇంద్రజాలం. నేను బాధ  యొక్క మూలాన్ని మాత్రమే తీసివేయను, ఈ సందర్భంలో కార్యరూపంలోకి వస్తున్న మరొకరి వ్యక్తిత్వం యొక్క నెగిటివ్ ఛాయను తీసేస్తాను మరియు నేను ఆధ్యాత్మికంగా కూడా ఎదుగుతాను.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

18th sep 2024 soul sustenance telugu

మన ప్రకంపనల నాణ్యత మరియు అవి ఇతరులను ఎలా ప్రభావితం చేస్తాయి

మనం సృష్టించే ప్రతి ఆలోచన, మనం మాట్లాడే ప్రతి పదం మరియు మనం చేసే ప్రతి చర్య విశ్వంలోకి భౌతికం కాని శక్తి లేదా ప్రకంపనల రేడియేషన్కు,ఇతర వ్యక్తుల వైపు, పరిసరాల వైపు, వాతావరణానికి,

Read More »
17th sep 2024 soul sustenance telugu

ఇతరులను అనుమానించడం ఆపండి, వారిని నమ్మడం ప్రారంభించండి

మనలో కొంతమందికి మన సంబంధాలలో వ్యక్తులను అనుమానించే సూక్ష్మమైన అలవాటు ఉంటుంది. కొన్నిసార్లు ఒకరి గురించి మనకున్న సందేహాలు వారితో కంటే కూడా మన అలవాటులతో ఎక్కువ సంబంధించబడి ఉంటాయి. మన అనారోగ్యకరమైన సందేహాలు,

Read More »
16th sep 2024 soul sustenance telugu

ఆంతరికంగా ఉన్న స్వయాన్ని గుర్తించి అనుభవం చేసుకోవటం (పార్ట్ 3)

మనం మన జీవితంలో ఎక్కువ భాగం మన ప్రత్యేకతలు, వ్యక్తిత్వం లేదా పాత్రతో అనుబంధం కొనసాగిస్తే, కాలక్రమేణా మనం గుర్తించబడటానికి వేచి ఉన్న నిజమైన స్వభావాన్ని మరచిపోతాము. పైన పేర్కొన్నవాటిలో నేను ఒకడిని, అని

Read More »