Hin

18th mar 2024 soul sustenance telugu 1

March 18, 2024

నెగిటివ్ శక్తిని గ్రహించకండి లేదా చూపించకండి, దానిని మార్చండి

  1. గ్రహించకండి: ఇతరుల నెగిటివ్ శక్తిని మనం వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడు దానిని సులభంగా గ్రహించి దానిని మళ్ళీ సృష్టిస్తూ ఉంటాము. ఇందుకు చక్కని ఉదాహరణ – టి.వి చూడటం, మీడియాకు ప్రభావితం అవ్వడం. ఇక్కడే ఇతరుల నాటకీయ జీవితాలలో ఇరుక్కుపోయి ఇతరుల భావోద్వేగ స్థితులను తమలోకి గ్రహిస్తుంటారు. అప్పుడు, వారు తమ నిజ జీవితంలో అడుగు పెట్టినప్పుడు, వారు నిర్ణయాలు తీసుకోవడంలో, ఇతరులను చూసే దృష్టికోణంలో మునుపటి నెగిటివ్ శక్తి పని చేస్తుంది.
  2. చూపించకండి: మనం తిరిగి వారికి నెగిటివ్ శక్తిని పంపితే ఏమవుతుంది? వారు తిరిగి మనకు పంపుతారు కదా. అప్పుడు మనమేం చేస్తాము? మళ్ళీ తిరిగి వారికి మనం పంపుతాము. ఇలా జరుగుతూనే ఉంటుంది. దీనినే సంబంధాల డింగ్ డాంగ్ అంటారు. ఇలా ఎంత కాలం జరుగుతుంది? కొన్ని కార్పొరేట్ కంపేనీలలో కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. కుటుంబాలలో జీవితాంతం కొనసాగుతుంది.
  3. మార్చండి: మనందరికీ శక్తిని మార్చగల సత్తా ఉంది. పిల్లవాడు తన కోపాన్ని తల్లిపై చూపిస్తే తల్లి తిరిగి కొడుకుపై కోపాన్ని చూపిస్తుందా? లేదు, పిల్లవాడి అప్పటి మూడ్‌ను అర్థం చేసుకుని, ఆ నెగిటివ్ శక్తిని స్వీకరిస్తుంది, దానిని మారుస్తుంది, తిరిగి సహానుభూతి, ప్రేమ, ఆధారము వంటి సుగుణాలతో అతనికి ఇస్తుంది. ఇలా మనం పిల్లలతో చేయగలిగినప్పుడు ఇతరులతో ఎందుకు చేయలేము? ఈ నెగిటివ్ చక్రాన్ని ఎవరో ఒకరు ఆపాలి కదా. లేకపోతే ఈ నెగిటివ్ శక్తి అలవాటుగా మారి దానినే ఇస్తూ ఉంటాము. బంధాలు ఏవైనాకానీ, మనం ముందుగా మారి, ఇతరులకు పాజిటివ్ శక్తిని పంపుదాము.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

20th march 2025 soul sustenance telugu

సంబంధాల్లో కలిగే బాధ నుండి విముక్తిని పొందడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలోని వివిధ రంగాలలో వేర్వేరు సంబంధాలలోకి వచ్చినప్పుడు, కొన్నిసార్లు మన అంతర్గత ప్రపంచంలోకి మరొక ఆత్మను అనుమతించినప్పుడు, మనల్ని వారు అర్థం

Read More »
19th march 2025 soul sustenance telugu

జీవితంలోని వివిధ దృశ్యాలలో సాకులు చెప్పడం మానుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలా మంది మన విశ్వసనీయతను కాపాడుకోవడానికి, ఇతరులపై లేదా పరిస్థితులపై నిందలు వేయడానికి సాకులు చెబుతారు. కొన్నిసార్లు మనకు, మన

Read More »
18th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు అంతర్గత బలం యొక్క సానుకూల సంస్కారాలను సృష్టించడానికి, మనం ముందుగా పట్టుదల యొక్క మొదటి అడుగు వేయాలి. పట్టుదల అంటే నేను

Read More »