Hin

28th dec 2024 soul sustenance telugu

December 28, 2024

నేను భగవంతునికి మంచి బిడ్డనా?

మనమందరం భగవంతునికి అందమైన పిల్లలం. మనలో ప్రతి ఒక్కరికి అనేక ప్రత్యేకమైన విశేషతలు ఉన్నాయి, అవి మనకు ఆశీర్వదించబడ్డాయి. భగవంతుడు మనకు అనాది ఆత్మిక తల్లి, తండ్రి. వారు జ్ఞానం, గుణాలు మరియు శక్తుల సాగరుడు. భగవంతునితో మనకు ఒక అందమైన సంబంధం ఉంది. ఆ సంబంధంలో వారి పట్ల లోతైన ప్రేమ మరియు గౌరవం నిండి ఉంది. మన జీవితంలోని ప్రతి క్షణంలో భగవంతుడు మనతో ఉంటారు. మన భౌతిక కళ్ళతో వారిని చూడలేనప్పటికీ, మన మనస్సులో భావన కలిగి ఉంటూ, బుద్ధితో వారిని అనుభవం చేయవచ్చు. భగవంతునితో సన్నిహితమైన, ప్రేమపూర్వకమైన సంబంధంలో చాలా ముఖ్యమైన అంశం భగవంతుని మంచి బిడ్డగా ఉండటం. 

 

భగవంతుని మంచి పిల్లలలో ఉండవలసిన 6 విషయాలను చూసి మనల్ని మనం చెక్ చేసుకుందాం – 

 

  1. వారు భగవంతునిలో ఉన్న మంచితనాన్ని తమలో కలిగి ఉంటూ ప్రతి ఒక్కరికీ దానిని ప్రసరింపజేస్తారు. 

 

  1. భగవంతుని మంచి పిల్లలు ప్రతి రోజూ భగవంతుడిని స్మరిస్తూ, వారి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చదవుతూ లేదా వింటూ ప్రారంభిస్తారు. భగవంతునితో ఉన్న సంబంధంలో వారు ఏమి అనుభవం చేసుకున్నా, అది వారు ఇతరులతో పంచుకుంటారు.

 

  1. పరిపూర్ణులైన భగవంతుని పిల్లల యొక్క మంచి లక్షణం భగవంతునితో వారి సంబంధంలో ఉండే నిజాయితీ. భగవంతుడు ఇష్టపడని లేదా అంగీకరించని దేనినీ వారు ఎప్పటికీ చేయరు.

 

  1. అలాగే, అటువంటి పిల్లలు భగవంతుడు వారికి ఇచ్చిన వివిధ సానుకూల ప్రయోజనాలను – ప్రతి ఒక్కరికీ ఆనందాన్ని ఇవ్వడం, ప్రతి ఒక్కరినీ భగవంతునికి దగ్గర చేయడం, ఆధ్యాత్మిక సోదరభావం ఆధారంగా ప్రపంచంలో సానుకూల ఐక్యతను సృష్టించడం వంటివి నెరవేర్చడంలో ఎల్లప్పుడూ బిజీగా ఉంటారు

 

  1. మంచి విధేయతగల భగవంతుని పిల్లలు తమలో తాము అన్ని ప్రతికూల వ్యక్తిత్వ లక్షణాలను తొలగించి, భగవంతుడు చెప్పే సానుకూల మార్పులు తీసుకువస్తారు.

 

  1. చివరగా, భగవంతుని మంచి పిల్లలు చాలా వినయంగా ఉంటారు, భగవంతునితో అనుసంధానించబడి ఉంటారు, జీవితంలోని ప్రతి దశలో వారు నిశ్చయంగా ఉంటే, భగవంతుడు ఎల్లప్పుడూ వారికి సహాయం చేస్తాడని గుర్తుంచుకుంటారు. వారు ఎప్పటికీ ఆశను కోల్పోరు.

రికార్డు

28th march 2025 soul sustenance telugu

సోషల్ మీడియా లైక్‌లు ముఖ్యమా?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఆధారిత సమాజంలో, మనం పోస్ట్ చేసే దానిపై ప్రజల ఆమోదం పొందడం మన స్వీయ-విలువ మరియు కీర్తికి కొలమానంగా

Read More »
27th march 2025 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు

Read More »
26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »