Hin

30th dec 2024 soul sustenance telugu

December 30, 2024

నిదానించండి – జీవితంలో త్వరపడకండి

ఒకేసారి అనేక పనులను పూర్తి చేయడానికి చాలా కష్టపడుతున్న నేటి కాలంలో, మనకు తెలియకుండానే ఒక పని నుండి మరొక పనికి పరుగెత్తే మోడ్‌లోకి వెళ్తాము. మన రోజువారీ జీవితంలో చాలా హడావడి ఉన్నట్లు అనిపిస్తుంది, నిదానించడం ఇకపై ఒక ఎంపికగా అనిపించటం లేదు.  

  1. మీరు టీవీ చూస్తున్నప్పుడు ఇమెయిల్లను డ్రాఫ్ట్ చేస్తారా? మీ పనికి తిరిగి రావాలనే ఆలోచనలో ఇతరులతో మాట్లాడుతున్నారా? వీలైనంత త్వరగా ఆహారం తీసుకుంటున్నారా? లేదా వేగంగా డ్రైవింగ్ చేస్తున్నారా? పనుల మధ్య బౌన్స్ అవ్వడం వల్ల మనం ఎక్కువ సాధించగలమని కాదు.
  2. మీరు చేసే విధానాలను, ఉండే విధానాలను పునరాలోచించుకోండి. హడావడి పడకండి, నిదానించి ప్రతి అనుభవాన్ని తీసుకోండి, ప్రతి సన్నివేశం యొక్క వైబ్రేషన్లను అనుభూతి చెంది సన్నివేశంలోకి మీ శక్తిని ప్రసరింపజేయండి. అప్పుడు జీవితం మీకు ఏమి అందిస్తుందో, మీరు ప్రపంచానికి ఏమి అందించగలరనే దాన్ని మీరు అభినందించవచ్చు.  
  3. ప్రస్తుత క్షణంలో పూర్తిగా ఉండండి. మీరు చేసే ప్రతి పని మీద ధ్యాస పెట్టండి. మీరు అలా చేస్తే, మీరు బాగా దృష్టి పెట్టవచ్చు, మరింత సృజనాత్మకంగా ఉండి, నాణ్యతతో పనిని త్వరగా పూర్తి చేయవచ్చు. ముఖ్యమైన పనులకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి వాటికే కట్టుబడి ఉండండి. మీరు బాధ్యతను పంచుకోగలరా, వాయిదా వేయగలరా లేదా వాటిలో కొన్నింటిని వదిలేయొచ్చా అని చెక్ చేసుకోండి. విశ్రాంతి తీసుకొని రిఫ్రెష్ అవ్వడానికి పనుల మధ్య విరామం తీసుకోండి.  
  4. పని చేయడంపై కంటే ఎక్కువ స్వస్థితి పై దృష్టి పెడుతూ మిమ్మల్ని మీరు శక్తివంతం చేసుకోవడానికి లోలోపలికి వెళ్లండి. వ్యాయామం, ఆహారం, కార్యాచరణ, ప్రశాంతత మరియు విశ్రాంతి వంటి జీవనశైలి పద్ధతులని అనుసరించండి. మనస్సు, శరీరం ఒత్తిడి లేకుండా ఉన్నందున ప్రతిదీ సకాలంలో ఎలా సాధించబడుతుందో గమనించండి.

రికార్డు

28th march 2025 soul sustenance telugu

సోషల్ మీడియా లైక్‌లు ముఖ్యమా?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఆధారిత సమాజంలో, మనం పోస్ట్ చేసే దానిపై ప్రజల ఆమోదం పొందడం మన స్వీయ-విలువ మరియు కీర్తికి కొలమానంగా

Read More »
27th march 2025 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు

Read More »
26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »