Hin

23rd June2024 Soul Sustenance Telugu

June 23, 2024

నిద్రను ప్రశాంతంగా మరియు ఆనందంగా మార్చడానికి 5 చిట్కాలు

నిద్ర మనిషి ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటి. మన శారీరక, ఆధ్యాత్మిక మరియు భావోద్వేగ ఆరోగ్యాన్ని అపారంగా ప్రభావితం చేస్తుంది. నిద్రను ప్రశాంతంగా మరియు ఆనందంగా మార్చడానికి 5 చిట్కాలను చూద్దాం –

  1. నిద్రపోయే ముందు కొన్ని నిమిషాలు ధ్యానం చేయండి – రోజంతా, ఆత్మ శరీరం ద్వారా కర్మలు చేస్తుంది మరియు మనస్సు నిరంతరం ఆలోచనలను సృష్టిస్తుంది. కాబట్టి నిద్రపోయే ముందు సుమారు 15 నిమిషాల పాటు ఆత్మిక స్పృహను అనుభూతి చెంది భగవంతునితో కనెక్ట్ అవ్వడం మంచిది. ఇది మనస్సును నిశ్శబ్దం చేసి బుద్ధిని స్వచ్ఛంగా చేస్తుంది. ఇది మంచి రాత్రి నిద్రకు సరైన తయారీ.
  2. నిద్రపోయే ముందు మొబైల్ ఫోన్ వాడకం మరియు టీవీ చూడడం తగ్గించండి – నిద్రపోయే ముందు సుమారు 45 నిమిషాల నుండి ఒక గంట వరకు, మీ మొబైల్ ఫోన్‌ను మీ కళ్ళకు వీలైనంత దూరంగా ఉంచండి. టెలివిజన్‌ చూడకుండా ఉండండి. ఇది మనస్సు మరియు మెదడుకు విశ్రాంతినిస్తుంది. తద్వారా మీరు పడుకున్న వెంటనే సులభంగా నిద్రపోతారు.
  3. నేటి కోసం భగవంతునికి ధన్యవాదాలు చెప్పి, నిద్రపోయే ముందు అన్ని భారాలను తొలగించుకోండి – రోజులో జరిగిన అన్నింటికీ భగవంతునికి ధన్యవాదాలు చెప్పి, రోజులో ఏదైనా ప్రతికూలంగా జరిగితే, నిద్రపోయే ముందు ఆ భారాన్ని తీసివేయండి. భారాన్ని మీ మంచంలోకి తీసుకోకండి. మీరు భారమైన స్పృహతో నిద్రపోతే, మీరు నిద్రపోవడానికి సమయం పట్టవచ్చు. ఒక వేళ త్వరగా నిద్రపోయినప్పటికీ, మీ మనస్సులో అనేక ఆలోచనలు నడవడం వలన మీరు అర్ధరాత్రి లేవవచ్చు.
  4. మీ మంచం చుట్టూ సానుకూల శక్తి యొక్క సర్కిల్ ను విజువలైజ్ చేసి, నిద్రపోయే ముందు ఒక ధృవీకరణను అనుభూతి చెందండి – నిద్రపోయే ముందు కొన్ని సెకన్ల పాటు మీ మంచం చుట్టూ శాంతి, స్వచ్ఛత మరియు శక్తి యొక్క బంగారు సర్కిల్ ను విజువలైజ్ చేసుకొని “నేను శాంతి మరియు ఆనంద స్వరూపాన్ని అనే ధృవీకరణను అనుభూతి చెందండి. నేను సురక్షితంగా ఉన్నాను. నేను సులభంగా నిద్రపోతాను. ఇది మీ సౌరభాన్ని (aura ని) సానుకూలంగా చేసి, మీ నిద్రకు భంగం కలిగించే ప్రాపంచిక ప్రతికూల మరియు అశుద్ధ శక్తుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.
  5. నిద్రపోయే ముందు ఎక్కువగా మాట్లాడటం మరియు అనవసరమైన సంభాషణలు మానుకోండి – నిద్రపోయే ముందు మీరు ఎంత ఎక్కువ మాట్లాడితే, అంతగా మనస్సు ఎక్కువ ఆలోచనలను సృష్టిస్తుంది మరియు మెదడు మరింత చురుకుగా మారుతుంది. కాబట్టి, నిద్రపోయే ముందు తక్కువ మాట్లాడండి, మధురంగా ​​మాట్లాడండి మరియు మృదువుగా మాట్లాడండి. లేకపోతే నిద్రపోయే ముందు మాట్లాడే మాటల ఆలోచనలు స్విచ్ ఆఫ్ చేసి విశ్రాంతి తీసుకోకుండా మిమ్మల్ని నిరోధిస్తాయి.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

[drts-directory-search directory="bk_locations" size="lg" cache="1" style="padding:15px; background-color:rgba(0,0,0,0.15); border-radius:4px;"]

రికార్డు

12th May 2025 Soul Sustenance Telugu

సంఘర్షణల సమయంలో వ్యక్తులతో మాట్లాడండి … వారి గురించి మాట్లాడకండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సంబంధంలో విభేదాలు ఏర్పడినప్పుడు, మనలోని నెగటివ్ భావోద్వేగాలు తరచుగా అవతలి వ్యక్తితో మన సంభాషణలో అవరోధంగా మారతాయి. అవతలి వ్యక్తి గురించి

Read More »
11th May 2025 Soul Sustenance Telugu

మన పోజిటివిటీ కవచాన్ని బలంగా చేసుకోవటం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనమందరం కఠినమైన సమయాలను ఎదురవుతున్నాము మరియు జీవితం మనపై వివిధ నెగెటివ్  పరిస్థితుల బాణాలను మళ్లీ మళ్లీ విసురుతుంది. మనందరికీ పాజిటివిటీ

Read More »
10th May 2025 Soul Sustenance Telugu

విసుగు ను(కోపం యొక్క మరో రూపం) అధిగమించండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలో మనం ఎప్పటికీ మార్చలేని రెండు విషయాలు: – గతం మరియు – వ్యక్తులు ఇది మనల్ని ఎదో ఒక రకంగా

Read More »