Hin

5th April 2025 Soul Sustenance Telugu

April 5, 2025

నిద్రపోయే ముందు మీ మనసులోని సమస్యలను పరిష్కరించుకోండి

రాత్రిపూట పడుకున్న వెంటనే నిద్రలోకి జారుకోవాలని మనందరికీ ఉంటుంది. మనం ప్రశాంతంగా నిద్రించడానికి మన మనస్సు స్విచ్ ఆఫ్ అవ్వాలని ఆశిస్తాము. కానీ మనం సమస్యలు, లక్ష్యాలు, చేయవలసిన పనులు లేదా ఇతర ఆలోచనలు ఆలోచిస్తూ పడుకుంటాము. తద్వారా మనస్సు నెమ్మదించకుండా యాక్టివ్ అవుతుంది. ఇది రాత్రిపూట అనేక ఆలోచనలను కలిగించి, నిద్రకు భంగం కలిగిస్తుంది, శారీరకంగా మరియు మానసికంగా మనపై ప్రభావం చూపుతుంది.

రాత్రి నిద్రపోయే ముందు మీరు మనస్సులోని సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో ఇప్పుడు చూద్దాం –

సంకల్పం :

నేను సంతోషకరమైన జీవిని. నేను తేలికగా, స్వచ్ఛంగా ఉన్నాను. నా మనస్సు రోజంతా ప్రశాంతంగా ఉంటుంది… నేను నా మనస్సు మరియు శరీరాన్ని బాగా చూసుకుంటాను… నేను నా పనిని మరియు సరైన విశ్రాంతిని బ్యాలెన్స్ చేసుకుంటాను. నా సరైన నిద్ర అలవాట్లు నా మనస్సు, మెదడు మరియు శరీరం అత్యధిక సామర్థ్యంతో పనిచేయడానికి వీలు కల్పిస్తాయి. నేను నిర్ణీత సమయానికి నిద్రపోతాను… నిద్రపోయే 30 నిమిషాల ముందు … నేను టెలివిజన్ స్విచ్ ఆఫ్ చేస్తాను… గాడ్జెట్‌ల నుండి దూరంగా ఉంటాను. నేను పడుకునే ముందు విశ్రాంతి తీసుకోవడానికి నా మనస్సును మరియు శరీరాన్ని సిద్ధం చేసుకుంటాను… నేను నా ఆలోచనలను గమనిస్తాను… మనసులో ఏదైనా సమస్య ఉంటే… నా మనస్సు కలవరపడితే… ఆ రోజు గురించి ఏదైనా ఆలోచనలతో బాధపడుతూ ఉంటే… మనసు అశాంతికి లోనైతే… నేను వెంటనే నా మనసుకు చెప్పుకుంటాను… దానికి సమాధానం చెబుతాను… లేదా దీని గురించి రేపు ఆలోచిద్దామని నా మనసును ఆదేశిస్తాను … నా మనసు నా మాట విని మౌనంగా ఉంటుంది… ఆ విషయం గురించి ఆలోచించడం మానేసి … ప్రశాంతంగా ఉంటుంది. 10 నిమిషాల పాటు నేను స్వచ్ఛమైన సమాచారాన్ని చదువుతాను లేదా వింటాను… మనసుకు చివరి సమాచారంగా… ఆ రోజు కోసం చేసిన సంకల్పాన్ని రిపీట్ చేసుకుంటాను… నా శరీరం మరియు మనస్సు రాత్రిపూట బాగా విశ్రాంతి తీసుకుంటున్నాయని నేను నిర్ధారిస్తాను… అవి ఛార్జ్ అవుతాయి…కొత్తగా బలాన్ని పొందుతాయి. 

మీ మనస్సును నెమ్మదించి మీకు అవసరమైన నిద్రను పొందడానికి ప్రతిరోజూ ఈ సంకల్పాన్ని రిపీట్  చేయండి. మీరు తేలికైన, స్వచ్ఛమైన మనస్సుతో నిద్రిస్తే, మీకు మీరు నిద్రించడానికి తగినంత సమయం ఇచ్చుకుంటారు మరియు మరుసటి రోజు ఉదయం ఫ్రెష్ గా మేలుకుంటారు.

రికార్డు

22nd May 2025 Soul Sustenance Telugu

భోజనం చేసే ముందు భగవంతునికి ఆహారాన్ని అర్పించడం వల్ల కలిగే 7 ప్రయోజనాలు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం అలవర్చుకోవల్సిన ఒక అందమైన అలవాటు, భగవంతుని ధ్యానంలో ప్రతి భోజనాన్ని వండడం. అలాగే, ఒక రోజులో

Read More »
21st May 2025 Soul Sustenance Telugu

మీ వాస్తవిక సత్య గుణానికి తిరిగి వెళ్లడం

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సత్యం మన వాస్తవిక గుణం, కానీ ఎప్పటికప్పుడు మన సౌలభ్యం కోసం లేదా స్వల్పకాలిక లాభాల కోసం అబద్ధాలు చెబుతాము. ఆసక్తికరమైన

Read More »
20th May 2025 Soul Sustenance Telugu

మీ పిల్లలతో తగినంత సమయం గడపకపోవడంపై అపరాధ భావాన్ని అధిగమించండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు వివిధ రకాల వ్యక్తిగత మరియు వృత్తిపరమైన నిబద్ధతలను గౌరవించేటప్పుడు, చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు తగినంత నాణ్యమైన సమయాన్ని ఇవ్వకపోవడం

Read More »