Hin

12th feb 2025 soul sustenance telugu

February 12, 2025

నిద్రపోయే ముందు పనులకు సంబంధించిన కమ్యూనికేషన్ మరియు టెక్నాలజీ నుండి దూరమవ్వండి 

రాత్రి వరకు పనులకు సంబంధించిన కమ్యూనికేషన్ లో చిక్కుకోవడం వల్ల మనం నిద్రపోతున్నప్పుడు కూడా మనస్సు పనుల గురించి ఆలోచిస్తూ, మన నిద్రకు భంగం కలిగిస్తుంది. మన సాంకేతిక పరిజ్ఞాన వినియోగం అదుపు తప్పడం మరియు మన రోజువారీ జీవితాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేయడం గురించి మనకు తెలుసు. పనులకు సంబంధించిన కమ్యూనికేషన్ కోసం నిద్రపోయే వరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం మనస్సు మరియు శరీరానికి అనారోగ్యకరం.

 

  1. సాంకేతిక పరిజ్ఞానం ఇంతగా శక్తివంతం అవ్వకముందు, మీరు ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మీ మనస్సు మీతో, మీ కుటుంబంతో ఉండేది. ఈ రోజు మీ మనస్సు అర్థరాత్రి, ఉదయాన్నే మరియు సెలవుల్లో కూడా పనితో ముడిపడి ఉంది. మీరు ఇమెయిల్లను చెక్ చేస్తూ, కాల్స్ చేస్తూ లేదా మెసేజ్ లకు రిప్లై ఇస్తూనే ఉంటారు.

 

  1. నిద్రపోయే ముందు పనుల సమస్యల గురించి చదవడం వల్ల మీ మనస్సు దాని గురించి ఎక్కువసేపు ఆలోచించేలా ప్రేరేపిస్తుంది. ఇప్పటికే అలసిపోయిన మనస్సు మరింత అలసిపోతుంది. కాబట్టి మీ శరీరం రాత్రిపూట విశ్రాంతి తీసుకున్నప్పటికీ, మీ మనస్సు సానుకూలంగా ఛార్జ్ అవ్వదు మరియు మీరు లేచిన తర్వాత కూడా మీకు అలసట గానే అనిపిస్తుంది.

 

  1. మీరు నిద్రపోవడానికి కనీసం 2 గంటల ముందు, ఆఫీస్ కమ్యూనికేషన్ నుండి స్విచ్ ఆఫ్ చేసే క్రమశిక్షణను పెట్టుకొని అనుసరించండి. మీ కుటుంబంతో మరియు మీతో సమయాన్ని గడపండి. వేరొకరు చేస్తారనే కారణంతో లాగిన్ చేయవద్దు. ఆ రోజుకు మీ పనులు మంచిగా పూర్తయ్యాయని మరియు పెండింగ్లో ఉన్న ఏదైనా పనిని పూర్తి చేయడానికి మీకు మరుసటి రోజు ఉందని మిమ్మల్ని మీరు నమ్మండి.

 

  1. నిద్రవేళకు కనీసం 10 నిమిషాల ముందు ధ్యానం చేయండి. ఇది మీ మనస్సును నిశ్శబ్దం చేసి, నిద్రకు సిద్ధం చేస్తుంది. మీ మనస్సు విశ్రాంతి పొంది రాత్రిపూట పునరుజ్జీవింపబడుతుంది. మరుసటి రోజు మీరు పనిలో సృజనాత్మకంగా, సహజంగా మరియు మరింత ఉత్పాదకంగా ఉంటారు.

రికార్డు

28th march 2025 soul sustenance telugu

సోషల్ మీడియా లైక్‌లు ముఖ్యమా?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఆధారిత సమాజంలో, మనం పోస్ట్ చేసే దానిపై ప్రజల ఆమోదం పొందడం మన స్వీయ-విలువ మరియు కీర్తికి కొలమానంగా

Read More »
27th march 2025 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు

Read More »
26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »