Hin

11th dec 2024 soul sustenance telugu

December 11, 2024

నిజమైన విజయానికి ప్రాథమిక సూత్రాలు

కొన్నిసార్లు మనం మన లక్ష్యాలను సాధించలేనప్పుడు, మనం అంటాము – నేను విజయవంతం కాలేదు, నేను విఫలమయ్యాను. మిమ్మల్ని మీరు వైఫల్యం అని అనుకుంటే మీకు మీరే అన్యాయం చేసుకోవడం. మిమ్మల్ని మీరు నిజంగానే విజయం పొందిన వారిలా చూడటం ప్రారంభించండి. మనం అనుకున్నది సాధించలేనప్పుడు, మనల్ని మనం వైఫల్యులుగా గుర్తించుకుంటాము. విజయం యొక్క సారాంశాన్ని మనం అర్థం చేసుకోవాలి.

 

  1. విజయం అనేది మీరు ఏమి చేస్తున్నారనే దాని గురించి కాదు, మీరు ఎవరు అనేది మొదట విజయం. ఇది నేను- ఆత్మ అనే దాని గురించి, ఆలోచించే, అనుభూతి చెందే, మాట్లాడే, ప్రవర్తించే, చర్యలోకి వచ్చే, ప్రతి పనిని పూర్తి చేసి, లక్ష్యాలను సాధించే శక్తి. విజయం ‘నేను’ తో మొదలవుతుంది, చేసే పనితో కాదు.

 

  1. మీరు అసంతృప్తిగా, కలత చెందుతూ, ఆందోళన చెందుతూ లేదా అహంభావంతో ఉండి, బాహ్య ప్రపంచంలో మీ కోరికలను నెరవేర్చుకుంటే, మిమ్మల్ని మీరు విజయవంతులుగా చెప్పుకోగలరా? మీరు ఎవరు అనే దానితో మీరు సంతోషంగా లేనందున అలా చెప్పుకోలేము.

 

  1. మీరు సంతోషంగా, శ్రద్ధగా, దయతో ఉన్నప్పుడు మీరు విజయవంతమవుతారని గుర్తుంచుకోండి. ఇతరుల విజయాలు, పదవి లేదా వయస్సుతో సంబంధం లేకుండా మీరు వ్యక్తులతో కనెక్ట్ అయితే మీరు విజయవంతమవుతారు. మీకు తెలిసిన వాటిని పంచుకుని, ఇతరులతో సహకరిస్తే మీరు విజయవంతమవుతారు.

 

  1. మీరు- ఆత్మ విజయవంతమై, తరువాత బాహ్య ప్రపంచంలో కార్యరూపం దాల్చినప్పుడు, మీరు మీ విజయాలను ఆస్వాదిస్తారు. మీరు కోరుకున్నది మీకు లభించకపోయినా, మీరు విజయవంతమయ్యారనే గుర్తుంచుకోండి, ఆ విజయం ప్రస్తుతానికి పెండింగ్ లో ఉంది. మీరు తిరిగి ప్రయత్నించి సాధించడానికి శక్తి ఉంటుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

15th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 3)

ఆత్మ మరియు భగవంతుని జ్ఞానాన్ని పంచుకున్న తరువాత, బ్రహ్మా కుమారీల 7 రోజుల పరిచయ కోర్సు ప్రపంచ నాటకం అంటే ఏమిటి మరియు అది 4 యుగాలతో ఎలా రూపొందించబడిందో మనకు బోధిస్తుంది –

Read More »
14th jan 2025 soul sustenance telugu 2

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 2)

మనలాగే, భగవంతుని ఆధ్యాత్మిక రూపం కూడా భౌతిక కళ్ళకు కనిపించని ఉన్నతోన్నతమైన జ్యోతిర్బిందువని తెలుసుకున్న తరువాత, ఎలా మనం భగవంతుడిని అర్థం చేసుకొని వారితో ఎలా అనుసంధానించగలము అనేదానికి బ్రహ్మా కుమారీల 7 రోజుల

Read More »
13th jan 2025 soul sustenance telugu 3

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 1)

మనమందరం భగవంతుడి నుండి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకుంటూ ప్రతిరోజూ ధ్యానాన్ని అభ్యసించే ఆధ్యాత్మిక విద్యార్థులం. ధ్యానం అంటే భగవంతునితో ఆధ్యాత్మిక అనుసంధానం. ఆధ్యాత్మిక జీవితంలోని ఈ రెండు అంశాలతో  అనగా ఆధ్యాత్మిక జ్ఞానం మరియు

Read More »