Hin

8th dec 2024 soul sustenance telugu

December 8, 2024

నిర్భయంగా ఉండటానికి 5 మార్గాలు

  1. స్వీయ గౌరవం యొక్క శక్తివంతమైన స్మృతిలో ఉండండి – మన భయాలన్నింటినీ అధిగమించగల మొదటి, అతి ముఖ్యమైన మార్గం మన స్వంత ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను లోతుగా గ్రహించడం. ఇంకా, జ్ఞానం, సుగుణాలు, నైపుణ్యాలు మరియు ఇతర వ్యక్తిత్వ లక్షణాల పరంగా మనకు ఉన్న మన స్వంత ప్రత్యేకతలను అనుభూతి చెందడం. అలాగే, జీవితంలోని వివిధ పరిస్థితులను నిర్లిప్త పరిశీలకుడిగా చూసే అలవాటును పెంపొందించుకొంటూ మన విభిన్న ప్రాప్తుల ఆంతరిక శక్తితో వాటిని సులభంగా అధిగమించగలమని భావించండి.
  2. భగవంతుడిని స్మరిస్తూ వారి సహాయాన్ని, శక్తిని అనుభవం చేసుకోండి – ఏ పరిస్థితిలోనైనా, మనం ఒంటరిగా ఉన్నామని భావించినప్పుడు మనం పరిస్థితికి భయపడతాము. మన స్వంతంగా దాన్ని పరిష్కరించలేమని భావిస్తాము. అటువంటి పరిస్థితులలో, మీరు భగవంతుడిని దగ్గరగా ఉన్నట్టు విజువలైజ్ చేసుకొని అనుభవం చేసుకోండి. వారి పరమ సహాయాన్ని తీసుకుంటూ పరమ శక్తిని గ్రహించండి. అలాగే, భగవంతుడిని పరిస్థితికి మార్గనిర్దేశం చేయనివ్వండి. మీరు బాధ్యతను వారికి వదిలేసి వారిని ఉత్తమంగా చేయనివ్వండి. ఇది మిమ్మల్ని నిరంతరం నిర్భయంగా చేస్తుంది.
  3. పరిస్థితిని తేలికతనంతో ఎదుర్కొంటూ దాని ఒత్తిడికి లోనుకాకండి – మీరు ఏదైనా నిర్దిష్ట పరిస్థితికి భయపడినప్పుడు, అది మీపై ఆధిపత్యం చెలాయించడం ప్రారంభిస్తుంది. మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యలు బలహీనపడతాయి. అటువంటి పరిస్థితులలో మీ మనస్సులో ఆధ్యాత్మిక శక్తి యొక్క రెండు అంశాలను మళ్లీ మళ్లీ గుర్తుంచుకోండి – నేను మాస్టర్ సర్వశక్తివంతుడను, సర్వశక్తివంతుడైన భగవంతుని సంతానాన్ని. నేను అడ్డంకులను నాశనం చేసేవాడిని. ఈ ఆలోచనలు పరిస్థితులపై సానుకూలంగా పనిచేస్తూ వాటిని మీకు సానుకూలంగా మరియు ప్రయోజనకరంగా చేస్తాయి.
  4. జాగ్రత్తగా ఆలోచించిస్తూ లోలోపలికి వెళ్లి మీ విజయాన్ని విజువలైజ్ చేయండి – దాని గురించి మన మనస్సులో ఎటువంటి సందేహం లేకుండా, పరిస్థితి ఇప్పటికే అధిగమించబడిందని మనం ముందే విజువలైజ్ చేసినట్లయితే నిర్భయత్వం వస్తుంది. ఏ పరిస్థితిలోనైనా మనం దీన్ని ఎంత ఎక్కువగా అభ్యసిస్తే, కష్టమైన పరిస్థితులను సులభంగా అధిగమించడానికి మనం అలవాటుపడతాము. ఎటువంటి చింత లేకుండా ధైర్యంగా, స్థితిస్థాపకంగా మారుతాము.
  5. భయం మీకు మంచిది కాదని మీరే చెప్పుకోండి – భయం అనేది ప్రతికూల శక్తి అని, అది మీ స్వంత మనస్సుకు మరియు దాని శ్రేయస్సుకు, మీ శారీరక ఆరోగ్యానికి, మీ సంబంధాలకు, మీరు చేసే ఏ చర్యల విజయానికైనా హానికరమని ఎల్లప్పుడూ మీకు మీరే గుర్తు చేసుకోండి. భయం అనేది తప్పు మార్గమని, అది పరిస్థితిని మరింత దిగజార్చుతుందని మీరు ఎంత ఎక్కువగా గ్రహిస్తే, అంత ఎక్కువగా మీరు దానిని మీ స్మృతిలోకి రానివ్వరు.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

15th jan 2025 soul sustenance telugu

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 3)

ఆత్మ మరియు భగవంతుని జ్ఞానాన్ని పంచుకున్న తరువాత, బ్రహ్మా కుమారీల 7 రోజుల పరిచయ కోర్సు ప్రపంచ నాటకం అంటే ఏమిటి మరియు అది 4 యుగాలతో ఎలా రూపొందించబడిందో మనకు బోధిస్తుంది –

Read More »
14th jan 2025 soul sustenance telugu 2

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 2)

మనలాగే, భగవంతుని ఆధ్యాత్మిక రూపం కూడా భౌతిక కళ్ళకు కనిపించని ఉన్నతోన్నతమైన జ్యోతిర్బిందువని తెలుసుకున్న తరువాత, ఎలా మనం భగవంతుడిని అర్థం చేసుకొని వారితో ఎలా అనుసంధానించగలము అనేదానికి బ్రహ్మా కుమారీల 7 రోజుల

Read More »
13th jan 2025 soul sustenance telugu 3

బ్రహ్మా కుమారీల 7 రోజుల కోర్సు (పార్ట్ 1)

మనమందరం భగవంతుడి నుండి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకుంటూ ప్రతిరోజూ ధ్యానాన్ని అభ్యసించే ఆధ్యాత్మిక విద్యార్థులం. ధ్యానం అంటే భగవంతునితో ఆధ్యాత్మిక అనుసంధానం. ఆధ్యాత్మిక జీవితంలోని ఈ రెండు అంశాలతో  అనగా ఆధ్యాత్మిక జ్ఞానం మరియు

Read More »