Hin

6th october 2024 soul sustenance telugu

October 6, 2024

నిర్లిప్తంగా ఉండి, గమనించి మరల్చుకోండి

మన జీవితాలు ఎప్పటికప్పుడు వివిధ రకాల పరిస్థితులతో నిండి ఉంటాయి. మనం తరచుగా పరిస్థితుల వల్ల ప్రతికూలంగా ప్రభావితమవ్వడంతో మన ఆంతరిక శక్తి తగ్గుతుంది. నిర్లిప్తంగా ఉండి, గమనించి మరల్చుకోవటం అనేది ఆధ్యాత్మికత యొక్క సరళమైన టెక్నిక్. దీని సహాయంతో మనం ప్రతికూల పరిస్థితిలో  ప్రభావితం కాకుండా, సానుకూలతను అనుభవం చేసుకుంటాము. మన సానుకూలతతో ప్రతికూల పరిస్థితిని ప్రభావితం చేసి మార్చవచ్చు. ఇది నిర్లిప్తత యొక్క టెక్నిక్. అంటే మనం పరిస్థితికి కట్టుబడి ఉండటానికి బదులు దాని నుండి నిర్లిప్తంగా ఉంటూ, మన ఆలోచనలను దగ్గరగా గమనించుకొని వాటిని సానుకూల దిశలో మరల్చుకుంటాము. ఒక విమానం లేదా ఓడ దాని ముందు ఉన్న అడ్డంకిని చూసినప్పుడు మరల్చుకునే విధానంలా మన ఆలోచనలను మరల్చుకుంటాము. ఈ టెక్నిక్ ను మనం ఎలా అభ్యసించాలి? ఇక్కడ 5 సోపానాలు ఉన్నాయి –

  1. ఉదయం సానుకూలమైనది ఏదైనా చదవి లేదా వింటూ మీ మనస్సును సానుకూల ఆలోచనలతో నింపుకోండి. మన మనస్సు సానుకూలతతో ఎంత ఎక్కువగా నిండి ఉంటే, అంతగా మనకు నిర్లిప్తంగా ఉండి పరిస్థితిని మనసులో నుండి తొలగించుకునే శక్తి ఉంటుంది. అలాగే, మనం మన ఆలోచనలను మరల్చుకొని శాంతి మరియు సంతృప్తిని అనుభవం చేసుకుంటాము.
  2. ప్రతి గంటకు ఒక నిమిషం మైండ్ ట్రాఫిక్ కంట్రోల్ ను సాధన చేయండి. ఆ ఒక్క నిమిషంలో, మీరు చేసేవి పక్కన పెట్టి మిమ్మల్ని మీరు శాంతియుతమైన, ప్రేమగల మరియు శక్తివంతమైన ఆత్మగా అనుభవం చేసుకోండి.
  3. రోజంతటిలో 10-15 సార్లు ధృవీకరణలను చేసే అభ్యాసం చేయండి. సానుకూల ఆలోచనను రిపీట్ చేసుకుంటూ దాన్ని పదే పదే అనుభవం చేసుకోవటమే ధృవీకరణ. ఇది మన మనస్సును స్థిరంగా, కేంద్రీకృతం చేస్తుంది. అప్పుడు మన మనసు ఏ పరిస్థితికి లేదా వ్యక్తికి సులభంగా ప్రభావితం కాదు.
  4. ఆ రోజుకు డిజిటల్ డిటాక్స్ ప్లాన్ ను రూపొందించుకోండి. రోజంతా, మన మనస్సులు మన మొబైల్స్, కంప్యూటర్లు, టెలివిజన్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా సమాచారంతో నిండిపోతాయి. ఈ పరికరాల ద్వారా ప్రతికూల వార్తలను, ప్రతికూల సమాచారాన్ని తీసుకోవడం తగ్గించండి.
  5. రోజంతా భగవంతుని సాంగత్యంలో ఉండండి. మన భారాలను విడిచిపెట్టి, వాటిని భగవంతునికి ఇవ్వడంతో, మనం పరిస్థితులను నిర్లిప్త పరిశీలకులుగా చూస్తూ వాటిలో చిక్కుకోము.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

20th march 2025 soul sustenance telugu

సంబంధాల్లో కలిగే బాధ నుండి విముక్తిని పొందడం (పార్ట్ 1)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు జీవితంలోని వివిధ రంగాలలో వేర్వేరు సంబంధాలలోకి వచ్చినప్పుడు, కొన్నిసార్లు మన అంతర్గత ప్రపంచంలోకి మరొక ఆత్మను అనుమతించినప్పుడు, మనల్ని వారు అర్థం

Read More »
19th march 2025 soul sustenance telugu

జీవితంలోని వివిధ దృశ్యాలలో సాకులు చెప్పడం మానుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు మనలో చాలా మంది మన విశ్వసనీయతను కాపాడుకోవడానికి, ఇతరులపై లేదా పరిస్థితులపై నిందలు వేయడానికి సాకులు చెబుతారు. కొన్నిసార్లు మనకు, మన

Read More »
18th march 2025 soul sustenance telugu

నెగటివ్ ఆలోచనలను ఆధ్యాత్మిక శక్తితో మార్చడం (పార్ట్ 3)

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు అంతర్గత బలం యొక్క సానుకూల సంస్కారాలను సృష్టించడానికి, మనం ముందుగా పట్టుదల యొక్క మొదటి అడుగు వేయాలి. పట్టుదల అంటే నేను

Read More »