Hin

3rd-nov-2023-soul-sustenance-telugu

November 3, 2023

నిస్వార్ధమైన ప్రేమ యొక్క నిజమైన అర్థాన్ని అనుభూతి చేసుకోండి

ఆదిలో మనం  భూమిపైకి మన పాత్రలను పోషించడానికి పరంధామం నుండి వచ్చినపుడు మనమందరం గుణవంతులము మరియు ప్రేమ స్వరూపులము. మనం ప్రయాణం ప్రారంభించినప్పుడు ప్రేమ సహజంగా వ్యక్తమవుతుంది. మన ప్రేమ భగవంతుని ప్రేమలా నిస్వార్ధమైనది. కాలక్రమేణా మనం ఈ భూమిపై అనేక జన్మలు తీసుకునే కొద్దీ, మన ప్రేమ ఇతరులను అంగీకరించడానికి బదులుగా వారి నుండి ఆశించడం ప్రారంభమవుతుంది. మోహం కారణంగా మనం దుఃఖాన్ని పొందుతాము. ఇంకా కావాలి అని కోరుకుంటున్నాము కాబట్టి బాధను అనుభవిస్తాము. అవతలి వ్యక్తి మనకు భిన్నంగా ఉన్నందున మనం కలవరపడతాము. వారు మన సొంతం అనుకొని వారి పై సంబంధానికి బదులుగా ఆధిపత్యం చెలాయించాలని భావిస్తున్నాము. నిస్వార్ధమైన ప్రేమ యొక్క నిజమైన అర్థం ఏమిటి –

  1. అపరిమితమైన, ఎటువంటి హద్దులు లేని మరియు ఎటువంటి డిమాండ్లు లేని ప్రేమ.
  2. ఎదుటివారి బలహీనతలను చూడకుండా వారి గుణాలను ప్రేమించే ప్రేమ.
  3. ఆనందకరమైన, బలమైన మరియు అభద్రత, భయాలు లేని ప్రేమ.
  4. అవతలి వ్యక్తికి అనుగుణంగా సర్దుకోవడానికి మరియు త్యాగం చేయడానికి ఇష్టపడే ప్రేమ.
  5. సంబంధాలలో భగవంతుని ప్రేమ, మంచితనాన్ని మరియు విశాల హృదయాన్ని కలిగించేది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

8th feb 2025 soul sustenance telugu

ఇతరులకు నిరంతరం ఇస్తూ ఉండండి (పార్ట్ 1) 

ఎమోషనల్ ఓదార్పు మరియు శక్తిని ఇవ్వడం   మన జీవితమంతా మనకు తెలిసిన వ్యక్తులకు మరియు మనకు తెలియని వ్యక్తులకు కూడా సేవ చేస్తాము. ఎందుకంటే ఇవ్వడం, సేవ చేయడం మన సహజ లక్షణాలు.

Read More »
7th feb 2025 soul sustenance telugu

అంతర్గత శాంతి మరియు ఆనందం కోసం ఇంట్లో ఒక పవిత్ర స్థలాన్ని ఏర్పాటు చేసుకోవటం

ధ్యానం కోసం ఇంట్లో ప్రత్యేకమైన, ఉన్నతమైన తరంగాల గది లేదా చోటును ఏర్పర్చుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. మనము అంతర్గత శాంతి, ఆనందం కోసం ఉన్నత ఆధ్యాత్మిక శక్తి గల ప్రదేశాలకు వెళ్తాము. మనం మానసికంగా

Read More »
6th feb 2025 soul sustenance telugu

మనం స్వీయ నియంత్రణను ఎందుకు కోల్పోతున్నాము?

మనం ఎందుకు, ఎలా స్వీయ నియంత్రణను కోల్పోతామో అన్వేషిద్దాం. గాలిలోని కాలుష్య కారకాల గురించి మనకు తెలుసు, కానీ మరొక సూక్ష్మమైన మరియు కీలకమైన భాగం ఉంది, దానిని మనం చూడలేము కాని మనం

Read More »