Hin

13th april 2024 soul sustenance telugu

April 13, 2024

నియంత్రణ నుండి ధ్యాస పెట్టడంలోకి మారడం

మీరు వారి పట్ల ధ్యాస పెడుతున్నారని వ్యక్తులు గ్రహించినప్పుడు, వారు దగ్గరవుతారు. మీరు వారిని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారని వారు భావిస్తే, వారు దూరంగా ఉంటారు. వ్యక్తులు ఎలా మారవచ్చు మరియు వారు ఏమి మార్చుకోవాలి అని సూచించడంలో మనం ఉత్తమ ఉద్దేశాలను కలిగి ఉంటాము, కానీ వారి పట్ల ధ్యాస పెట్టడం కొన్నిసార్లు నియంత్రణలోకి మారుతుంది.

 

  1. వ్యక్తులు వారి సామర్థ్యాలకు అనుగుణంగా మాత్రమే ఉండగలరు. వారి పట్ల సరైన నాణ్యత గల ప్రేమ మరియు దయాభావం యొక్క ఆలోచనలను సృష్టించండి. మీరు స్థిరంగా ఉండి, వారు ఎందుకు లేదా ఏమి మార్చుకోవాలో అని ఇతరులతో పంచుకున్నప్పుడు, అది వారి ప్రయోజనం కోసం మాత్రమే కానీ అది మీ స్వంత ఆనందం కోసం కాదు.

 

  1. వారి పట్ల మీకున్న ధ్యాసను వ్యక్తపరిచేటప్పుడు, ఈ భావాన్ని తీసివేయండి – నా పద్ధతి సరైనది, మీరు దానిని అనుసరించాలి – ఆ సంబంధం యొక్క పునాది నుండి. మీ మరియు వారి పద్ధతి వేర్వేరు అని అంగీకరించండి, అప్పుడు మాత్రమే వారు మీ పట్టించుకోవడాన్ని స్వీకరిస్తారు, మీరు సూచించిన మీ పద్ధతిని అనుసరించే ప్రయత్నం చేస్తారు.

 

  1. మీరు వ్యక్తులతో కోపంగా లేకపోయినా, వారు తప్పు అనే ఆలోచనను మీరు సృష్టిస్తే, నియంత్రణ శక్తి వారికి చేరుతుంది. ఎవరూ నియంత్రించకూడదని వారు దూరంగా వెళ్లడానికి ప్రయత్నిస్తారు. ఈ శక్తిని వారికి పంపిన తర్వాత, మర్యాదగా వారి పట్ల మీ ధ్యాసను వ్యక్తం చేసినప్పటికీ, వారు తమను తాము సమర్ధించుకుంటారు.

 

  1. ధ్యాస పెట్టడం అనేది పరిష్కార-ధోరణితో ఉంటుంది. కాగా, నియంత్రణ సమస్య-ధోరణి తో ఉంటుంది. మీరు ఎవరినైనా నియంత్రించడానికి ప్రయత్నించినప్పుడు, మీరు వారి అలవాటు లేదా ప్రవర్తనపై దాడి చేస్తారు, తద్వారా వారు మీపై దాడి చేస్తారు. మీ తర్కం వారి తర్కం ద్వారా ప్రతిఘటించబడుతుంది మరియు వాదన ప్రేరేపించబడుతుంది.

మీ సమీపంలో ఉన్న రాజయోగ మెడిటేషన్ సెంటర్ కొరకు

రికార్డు

9th sep 2024 soul sustenance telugu

గందరగోళం కాకుండా స్పష్టత కలిగి ఉండండి

శాంతి మరియు స్థిరత్వంతో కూడిన జీవితాన్ని గడపడానికి స్పష్టత కలిగి ఉండటం కీలకం. కానీ ఎలా ఉండాలి, ఏం చేయాలి లేదా ఏ దిశలో అడుగు పెట్టాలి అని మనం తరచుగా ఆలోచిస్తూ ఉంటాము.

Read More »
8th sep 2024 soul sustenance telugu

గణేష్ చతుర్థి యొక్క దివ్యత మరియు ఆధ్యాత్మికత (పార్ట్ 2)

శ్రీ గణేషుని పెద్ద ఉదరము ఇముడ్చుకునే శక్తిని సూచిస్తుంది. వ్యక్తుల బలహీనతలు మరియు వారి తప్పుడు చర్యల గురించి మనం ఇతరులతో మాట్లాడకూడదు. శ్రీ గణేషుని చేతిలో గొడ్డలి, తాడు మరియు కమలం చూపిస్తారు,

Read More »
7th sep 2024 soul sustenance telugu

గణేష్ చతుర్థి యొక్క దివ్యత మరియు ఆధ్యాత్మికత (పార్ట్ 1)

ఈ సంవత్సరం గణేష్ చతుర్థిని సెప్టెంబర్ 7 నుండి 17 వరకు జరుపుకుంటారు. శ్రీ గణేషుని జననం యొక్క నిజమైన అర్ధాన్ని మనం అర్థం చేసుకుంటాము. శ్రీ పార్వతీ దేవి స్నానం చేయాలనుకొని గేటు

Read More »