Hin

29th dec 2024 soul sustenance telugu

December 29, 2024

ఒక సంఘర్షణ తర్వాత సాధారణ సంభాషణకు తిరిగి రావడం

వాదన లేదా సంఘర్షణ వంటి భావోద్వేగ విస్ఫోటం సంభవించినప్పుడు, మనలో కొందరు రక్షణ యంత్రాంగం లేదా నియంత్రణ యంత్రాంగంగా నిశ్శబ్ద చికిత్సను ఆశ్రయిస్తారు. కమ్యూనికేషన్ లేనటువంటి రోజులు లేదా వారాలు ఇబ్బందికరమైనవి, అనారోగ్యకరమైనవి, ఎందుకంటే మనం ప్రతికూల ఆలోచనలకు అతుక్కుపోతాము, వాతావరణాన్ని భారీ వైబ్రేషన్లతో నింపి ప్రతి ఒక్కరినీ క్షీణింపజేస్తాము. కుటుంబంతో లేదా స్నేహితులతో వాగ్వాదం తర్వాత ధూళి తగ్గినప్పుడు, మీ భావోద్వేగాలు అధిక స్థాయిలో కొనసాగుతాయా? ఆగ్రహం మరియు ప్రతీకారం యొక్క తప్పుడు ఆలోచనలు మీ మనస్సులో మబ్బుగా ఉన్నాయా? మీరు ఒకరితో ఒకరు గంటలు, రోజులు లేదా నెలలు కూడా మాట్లాడుకోవడానికి నిరాకరిస్తున్నారా? సంపూర్ణ నిశ్శబ్దం మన అభిప్రాయాన్ని తెలియజేయడానికి సహాయపడుతుందని, స్థిరంగా ఉండి గ్రహించడానికి సమయం ఇస్తుందని నమ్మి, సంఘర్షణ తర్వాత మనం తరచుగా మాట్లాడటం మానేస్తాము. కమ్యూనికేషన్ లేనప్పుడు, మనస్సు భారీ, విషపూరిత ఆలోచనలను సృష్టిస్తూనే ఉంటుంది, ఇటీవలి గాయాలను ముందుంచి, మరింత నొప్పిని కూడబెట్టుకుని ఒకరి పట్ల ఒకరికి తిరస్కరణను ప్రసరింపజేస్తుంది. ఈ వైబ్రేషన్లు ప్రతి ఒక్కరి మనస్సు మరియు శరీరానికి హానికరం. సమస్యను పక్కన పెట్టి, మన అహంకారాన్ని పక్కనపెట్టి, మన సాధారణ ఆలోచనలు, మాటలు మరియు ప్రవర్తనకు తిరిగి వెళ్దాం. ఏమీ జరగలేదని భావించి వారితో మాట్లాడేందుకు మనం ముందుకు రావాలి. ఏది ఏమి అయినా, వారు మన ప్రియమైనవారు, శ్రేయోభిలాషులు. వారి శ్రేయస్సు మన ప్రాధాన్యత, మన శ్రేయస్సు వారి ప్రాధాన్యత. కమ్యూనికేషన్ ను తిరిగి ప్రారంభించడం అనేది సంబంధాన్ని కాపాడుకోవడానికి సులభమైన మార్గం. ఇది ఒకరి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ముఖ్యంగా, ఇంట్లో లేదా మన కార్యాలయంలో సరైన సంస్కృతిని సృష్టిస్తుంది. 

 

మీరు శ్రద్ధగల వ్యక్తి అని గుర్తుంచుకోండి. మీ కుటుంబం, స్నేహితుల ఆనందం మరియు ఆరోగ్యం కోసం శ్రద్ధ వహించండి. కొన్నిసార్లు వారు మీ అభిప్రాయంతో సరిపోలని విభిన్న అభిప్రాయాలను కలిగి ఉంటారు. మీరు మీ దృక్పథాన్ని తెలియజేస్తారు మరియు వారు వారి అభిప్రాయాలకు కట్టుబడి ఉంటే వారు మీతో ఏకీభవించరు. మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారో స్థిరంగా చెప్పండి. మీరు వారి అభిప్రాయాలతో ఏకీభవించకపోయినా వారిని గౌరవించండి. ఆ సన్నివేశం జరిగిన వెంటనే, మీ మనసు లోంది తుడిచేసి సన్నివేశం యొక్క శక్తిని మార్చండి. విభేదాలను ఆరోగ్యకరమైన రీతిలో పరిష్కరించుకోండి కానీ ప్రతికూల నిశ్శబ్దపు కాలాన్ని ఎప్పుడూ రాన్నివ్వకండి. ప్రశాంతంగా మీ సాధారణ స్థితికి తిరిగి రండి. వెంటనే వారితో స్వచ్ఛందంగా మాట్లాడండి మరియు వారు మాట్లాడే వరకు వేచి ఉండకండి. మీ ఇద్దరి మధ్య ఇబ్బంది కరమైంది ఏమీ జరగలేదన్నట్లుగా ప్రవర్తించండి. మీ బేషరతు ప్రేమ, గౌరవం వారిని నయం చేస్తాయి. సంబంధాన్ని మెరుగు పరచి, సామరస్యాన్ని పునరుద్ధరించండి.

రికార్డు

28th march 2025 soul sustenance telugu

సోషల్ మీడియా లైక్‌లు ముఖ్యమా?

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఆధారిత సమాజంలో, మనం పోస్ట్ చేసే దానిపై ప్రజల ఆమోదం పొందడం మన స్వీయ-విలువ మరియు కీర్తికి కొలమానంగా

Read More »
27th march 2025 soul sustenance telugu

6 రకాల సంతృప్తులను మీ జీవితంలో భాగం చేసుకోండి

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను నాతో సంతృప్తిగా ఉన్నానా – నాతో, నా సంస్కారాలతో, నా ఆలోచనలతో, మాటలు మరియు చర్యలతో సంతృప్తి చెందడం మరియు

Read More »
26th march 2025 soul sustenance telugu

ఈజీగా ఉండండి , బిజీగా కాదు

ప్రతి రోజు మీ వాట్సప్ లో ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు నేను చాలా బిజీగా ఉన్నాను…నాకు సమయం లేదు అని తరచుగా అంటూ ఉంటాము. ఇలాంటి మనస్తత్వం మనల్ని సమయానికి ప్రాధాన్యత ఇవ్వనివ్వదు.

Read More »